నేటినుంచి ‘విర్డ్’లో ఆర్థోపెడిక్ ప్రత్యేక క్యాంపు
ABN , Publish Date - Aug 23 , 2026 | 11:28 PM
ద్వారకాతిరుమల విర్డ్ ఆసుప త్రిలో ప్రజలకు నాణ్య మైన వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నా మని ఈనెల 24 నుంచి 27 వరకు వైద్య నిపుణులతో చారిటబుల్ ఆర్దోపెడిక్ క్యాంపు నిర్వహిస్తున్నామని ట్రస్ట్ చైర్మన్ రాజా ఎస్వీ సుధాకరరావు తెలిపారు
ద్వారకాతిరుమల, ఆగస్టు 23(ఆంధ్రజ్యోతి): ద్వారకాతిరుమల విర్డ్ ఆసుప త్రిలో ప్రజలకు నాణ్య మైన వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నా మని ఈనెల 24 నుంచి 27 వరకు వైద్య నిపుణులతో చారిటబుల్ ఆర్దోపెడిక్ క్యాంపు నిర్వహిస్తున్నామని ట్రస్ట్ చైర్మన్ రాజా ఎస్వీ సుధాకరరావు తెలిపారు. ఈ క్యాంపులో ప్రముఖ ఆర్దోపెడిక్ సర్జన్లు, యుఎస్‌ఏకు చెందిన డాక్టర్ శ్రీనాథ్ కామినేని, ఇండియాకు చెందిన డాక్టర్ భవ్యచంద్, డాక్టర్ శ్రీనివాస్ కంభంపాటి తదితరులు వైద్యసేవలంది స్తారన్నారు. దీనిలో భుజం, మోచేతినొప్పి, బిగువు, బలహీనత, అస్థిరత, ఆర్ధరైటిస్, తరచూ కీలు తొలగడం వంటి సమస్యలతో బాధపడుతున్న రోగులు ఉచిత వైద్యశిబిరానికి హాజరుకావాలని కోరారు. ఈనెల 24న భుజం, మోచేతి నొప్పి తదితర సమస్యలతో ఉన్న రోగులకు క్లినికల్ పరీక్షలు, స్ర్కీనింగ్ చేస్తార న్నారు. శిబిరంలో ఎంపికైన రోగులకు ఆగస్టు 25 నుంచి 27 వరకు శస్త్రచికిత్సలు చేస్తామన్నారు. ఈ అవకాశాన్ని రోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.