ఏం చేద్దాం..?
ABN , Publish Date - Aug 22 , 2026 | 12:15 AM
భీమవరం మున్సిపల్ ఎన్నికలపై కూటమి నేతలు రంగంలోకి దిగారు.
భీమవరం మున్సిపాలిటీ విలీన సమస్య పరిష్కారమెలా?
గ్రామపెద్దలతో చర్చించి కేసుల ఉపసంహరణకు ప్రయత్నం
కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ నివాసంలో కూటమి నేతల సమీక్ష
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
భీమవరం మున్సిపల్ ఎన్నికలపై కూటమి నేతలు రంగంలోకి దిగారు. జిల్లా కేంద్రమైన భీమవరంలో ఎన్నికలు నిర్వహించాలన్న పట్టుదలతో నేతలున్నారు. హైకోర్టులో విలీన గ్రామస్తులు వేసిన కేసును కొట్టివేసినప్పుడే ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. ఆలోగానే భీమవరంలో విలీనమైన నాలుగు గ్రామాల పెద్దలతో సంప్రదించి కేసులు ఉపసంహ రించేలా చర్యలు తీసుకోవడానికి కూటమి నేతలు సమావేశమయ్యారు. కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ ఆధ్వర్యంలో నాయకులు మంతనాలు సాగించారు. ఎమ్మెల్యే అంజిబాబు, జనసేన అధ్యక్షుడు కొటికల పూడి చినబాబు, తెలుగుదేశం నుంచి మెంటే పార్థసారథి, రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు తదితరులు చర్చించారు. గ్రామపెద్దలతో చర్చించి కేసులు ఉప సంహరించుకోవడానికి ప్రయత్నం చేయాలని తీర్మానించారు. భీమవరం పురపాలక సంఘంలో తాడేరు, రాయలం, చినఅమిరం, కొవ్వాడ అన్నవరం గ్రామాలను విలీనం చేశారు. వీటిపై ముఖ్యంగా రాయలం, చినఅమిరం గ్రామాల నుంచి హైకోర్టులో కేసులు వేశారు. విలీన ంపై హైకోర్టు స్టే విధించింది. అక్కడ కేసు తేలక ముందే విలీన గ్రామాల పెద్దలతో చర్చించాలని కూటమి నేతలు ఒక నిర్ణయానికి వచ్చారు. భీమవరం మున్సి పల్ కార్పొరేషన్‌కు హామీ ఇస్తే విలీన కేసులను ఉపసంహరిం చుకుంటామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వద్ద గతంలోనే విలీన గ్రామాల పెద్దలు ప్రస్తావించారు. ఆ తర్వాత దానికి సమ్మతించలేదు. ఎమ్మెల్యే అంజిబాబుతో ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.
ఆ..మున్సిపాలిటీల సంగతే మిటి ?
రాష్ట్ర వ్యాప్తంగా 23 మున్సిపాలిటీల్లో విలీన సమస్య ఉంది. అందులో దాదాపు 14 మున్సిపాలిటీల్లో సమస్య ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. అక్కడ నేతలు, ప్రజా ప్రతినిధులు సమస్యను పరిష్కరించే దిశగా మంతనాలు సాగించారు. కేసులను ఉపసంహరించుకునేలా ఏర్పాట్లు చేస్తు న్నారు. విలీన కేసు సెప్టెంబరు ఒకటో తేదీన హైకోర్టులో వాదనకు రానుంది. అప్పటిలోగా సమస్య లేకుండా చూడాలని ఇతర జిల్లాల్లో కూటమి నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు. పాలకొల్లు మున్సిపాలిటీలో విలీనం ఉన్నా లేక పోయినా ఎన్నికలు జరగాలన్న తలంపుతో మంత్రి నిమ్మల ఉన్నట్టు అక్కడ కూటమి నేతల్లో చర్చ జరుగుతోంది. తాడేపల్లి గూడెంలో మాత్రం కూటమి కేడర్ ఉత్కంఠగా చూస్తోంది. తణుకు మున్సిపాలిటీ విషయంలోనూ ప్రభుత్వమే ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. . పైడిపర్రు గ్రామంలో ఎటువంటి ఇబ్బంది లేదు. వెంకట్రాయపురంలోనే సమస్య ఉంది. మున్సిపాలిటీ నుంచే అక్కడ మౌలిక వసతులు కల్పిస్తున్నారు. టౌన్‌షిప్ కార్యవర్గం కోర్టును ఆశ్రయించింది. ఇప్పుడదే కార్యవర్గం కేసును ఉపసంహరించుకుంటామని ముందుకొచ్చినట్టు సమాచారం. అయితే సంప్రదించేందుకు ప్రభుత్వమే చొరవ చూపాల్సి ఉంటుంది.