విలీనం సంపూర్ణం!
ABN , Publish Date - Oct 03 , 2026 | 01:03 AM
మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాల సమస్యకు పరిష్కారం లభించే దిశగా చర్యలు మొదలయ్యాయి.
మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజనకు రంగం సిద్ధం
భీమవరంలో 52, తాడేపల్లిగూడెంలో 48 వార్డులకు చేరే అవకాశం
పన్నుల వసూళ్లు, మండల పరిషత్‌ల పరిధిలోనూ మార్పులు
మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాల సమస్యకు పరిష్కారం లభించే దిశగా చర్యలు మొదలయ్యాయి. విలీన గ్రామాలను మున్సిపాలిటీల్లో అధికారికంగా కలిపిన తర్వాత వాటి ఆధారంగా వార్డుల పునర్విభజన చేపట్టనున్నారు. ప్రభుత్వం గత మార్చిలో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం జనాభా ప్రాతిపదికన మున్సిపాలిటీల్లో వార్డుల సంఖ్యను నిర్ణయించనున్నారు. దీంతో భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, తణుకు మున్సిపాలిటీల్లో వార్డుల సంఖ్య మారనుంది. అదే సమయంలో విలీన గ్రామాల పన్నుల వసూళ్లు మున్సి పాలిటీల పరిధిలోకి రానుండగా.. ఆయా గ్రామాలు ఉన్న మండల పరిషత్‌ల పరిధి కూడా తగ్గనుంది.
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 60 వేల నుంచి 80 వేల జనాభా ఉన్న మున్సిపాలిటీల్లో 40 వార్డులు ఏర్పాటుచేయాలి. 80 వేల నుంచి లక్ష జనాభా ఉంటే 44 వార్డులు, లక్ష నుంచి లక్షా 50 వేల వరకు ఉంటే 48 వార్డులు ఉండాలి. లక్షా 52 వేలకు పైగా జనాభా ఉంటే 52 వార్డులు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన విలీన గ్రామాలను కలుపుకున్న తర్వాత భీమవరం మున్సిపాలిటీ జనాభా లక్షా 50 వేలు దాటితే 52 వార్డులు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. గ్రామాలతో కలిపి భీమవరం జనాభా రెండు లక్షలలోపు ఉంటుందని అధికారులు అం చనా వేస్తున్నారు. తాడేపల్లిగూడెం మున్సిపాలి టీలో ప్రస్తుతం పాత మున్సిపల్ పరిధిలో 35 వార్డులు ఉన్నాయి. విలీన గ్రామాలను కలుపుకొ ని 42 వార్డులు ప్రతిపాదించినా అవి అమల్లోకి రాలేదు. తాజాగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్త ర్వుల ప్రకారం పునర్విభజన జరిగితే వార్డుల సంఖ్య 48కు పెరిగే అవకాశం ఉంది. పాల కొల్లులోనూ వార్డుల సంఖ్య పెరగనుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం పట్టణ జనాభా సుమా రు 61 వేలు. ప్రస్తుతం ఏడు గ్రామాలు విలీన మయ్యాయి. 2011 జనాభా ఆధారంగా మొత్తం జనాభా 80 వేలలోపే ఉంటే ప్రస్తుత 31 వార్డులు 40కి పెరగనున్నాయి. జనాభా 80 వేలు దాటితే 44 వార్డులు అయ్యే అవకాశం ఉంది. తణుకు మున్సిపాలిటీలోనూ ఇదే జనాభా ప్రాతి పదికన వార్డుల సంఖ్యను పునర్నిర్ణయించను న్నారు. దీంతో ఆయా మున్సిపాలిటీల అధికారు లు జనాభా లెక్కలు, విలీన గ్రామాల వివరాల ను సమన్వయం చేసి వార్డుల పునర్విభజనపై కసరత్తు చేస్తున్నారు.
పన్నుల వసూళ్లకు మారనున్న విధానం
విలీన గ్రామాల సమస్య కొనసాగుతు న్న సమయంలో భీమవరం మున్సిపాలి టీలో పన్నుల వసూళ్లకు సంబంధించి ఇబ్బందులు ఎదురయ్యాయి. అప్పటి కలెక్టర్ ప్రశాంతి విలీన గ్రామాల రికార్డులను స్వాధీనం చేసుకోవాలని నోటిఫికేషన్ జారీ చేయడంతో మున్సిపల్ అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. విలీన గ్రామా లకు సంబంధించి పన్నుల డి మాండ్‌ను లెక్కించారు. అయి తే ఆయా గ్రామాల్లో పంచా యతీల ద్వారానే పన్నులు వ సూలు కావడంతో మున్సి పాలిటీ రికార్డుల్లో డిమాం డ్ కనిపించినా వసూళ్లు నమోదుకాలేదు. దీంతో
మున్సిపాలిటీ పన్నుల వసూళ్లపై ఆన్‌లైన్ వివరా ల్లోనూ ప్రభావం కనిపించింది. విలీన ప్రక్రియ పూర్తయితే పంచాయతీల రికార్డులను మున్సిపా లిటీలు స్వాధీనం చేసుకోనున్నాయి. తాడేపల్లిగూ డెం, తణుకు, పాలకొల్లు మున్సిపాలిటీల్లోనూ ఇదే విధానం అమల్లోకి రానుంది. జిల్లా కలెక్టర్ ఆదేశాల అనంతరం రికార్డుల స్వాధీనం, పన్నుల వసూళ్ల ప్రక్రియ చేపట్టనున్నారు. దీంతో విలీన గ్రామాల పన్నులు మున్సిపాలిటీల ద్వారానే వసూలయ్యే అవకాశం ఉంది.
డ్వాక్రాలకూ తప్పనున్న ఇబ్బందులు
విలీన గ్రామాల్లో పరిపాలన పంచాయతీల పరిధిలో కొనసాగుతుండగా, అక్కడి డ్వాక్రా సం ఘాలను మెప్మా పరిధిలోకి తీసుకురావడంతో మహిళా సంఘాలు ఇబ్బందులు ఎదుర్కొన్నా యి. పంచాయతీ సిబ్బంది గ్రామసభలు, సమీక్ష సమావేశాలకు సంఘాల సభ్యులను పిలిచేవారు. మరోవైపు బ్యాంకు రుణాలు, ఇతర ఆర్థిక వ్యవ హారాల్లో మెప్మా సూచనలు, ఆదేశాలను పాటిం చాల్సి వచ్చేది. దీంతో ఒకే సంఘం రెండు రకాల పరిపాలనా వ్యవస్థలతో సమన్వయం చేసుకోవా ల్సిన పరిస్థితి ఏర్పడింది. విలీన గ్రామాల పరి పాలన మున్సిపాలిటీల పరిధిలోకి పూర్తిగా వచ్చి న తర్వాత ఇబ్బందులు తొలగే అవకాశం ఉంది.
మునిసిపాలిటీలో మేం కలవం
కొండ్రుప్రోలు వాసుల నిరసన
తాడేపల్లిగూడెం రూరల్, అక్టోబరు 2(ఆం ధ్రజ్యోతి): తమ గ్రామాన్ని తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో కలపొద్దంటూ కొండ్రుప్రోలు గ్రామస్థులు రోడ్డెక్కారు. మున్సిపాలిటీలో విలీ న గ్రామాలను కలుపుతూ ఎన్నికలు నిర్వహిం చాలని కోర్టు తీర్పుతో గ్రామస్థులంతా శుక్రవా రం గ్రామంలో నిరసన తెలిపారు. తమ గ్రా మంలో ఎన్నికలు, నిధులు లేక వెనకబడిం దని మళ్లీ మున్సిపాలిటీలో కలిపితే గ్రామ పం చాయతీలకు ఉండే నిధులు లేక మరింత వెన క్కి వెళ్లిపోతుందని పాలకులు తమ పరిస్థితి పట్టించుకుని తమ గ్రామాన్ని పంచాయతీగానే కొనసాగించాలని డిమాండ్ చేశారు. కూలి పనులు చేసుకునే వారున్న గ్రామంలో ఉపాధి హామీ పథకం లేకుండా పోయే ప్రమాదం ఉందని తమ గ్రామప్రజల ఆకాంక్ష మేరకు తమ గ్రామాన్ని పంచాయతీలోనే కొనసాగిం చాలని కోరారు. అన్ని పార్టీల నాయకులు, మహిళలు, గ్రామస్థులు పాల్గొన్నారు.