నేడు ఓటర్ల జాబితా విడుదల
ABN , Publish Date - Apr 15 , 2026 | 12:19 AM
పంచాయతీ ఎన్నికలకు మార్గం సుగమం అవుతోంది. పంచాయతీల వారీగా ఓటర్ల జాబితా సిద్ధమైంది.
రెండుసార్లు మారిన గడువు
సాంకేతిక కారణాలతో జాప్యం
ఎట్టకేలకు జాబితా సిద్ధం
అభ్యంతరాల స్వీకరణకు మూడు రోజులు
18న తుది జాబితా ప్రచురణ
గ్రామాల్లో ఎన్నికల వేడి
పంచాయతీ ఎన్నికలకు మార్గం సుగమం అవుతోంది. పంచాయతీల వారీగా ఓటర్ల జాబితా సిద్ధమైంది. అనంతరం రిజర్వేషన్ల ప్రక్రియ, కొత్తగా పోలింగ్ కేంద్రాల గుర్తింపు, ఏర్పాటు ప్రక్రియపై కసరత్తు జరుగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని రాష్ట్రంలోని అధికార పక్ష నేతలు స్థానిక నేతలకు సంకేతాలు ఇచ్చారు. దీనితో స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో నిర్వహించే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
ఏలూరు సిటీ, ఏప్రిల్ 14(ఆంధ్రజ్యోతి): పంచాయతీల వారీగా ఓటర్ల జాబితా సిద్ధం చేశారు. ఎన్ని కల కమిషన్ విధించిన గడువు మేరకు ఈనెల 15న ఓటర్ల జాబితా విడుదల చేయనున్నారు. మూడు రోజులపాటు అభ్యంతరాలను స్వీకరించి 18న తుది జాబితా ప్రచురిస్తారు. వాస్తవానికి మార్చి 9వతేదీ లోపు జాబితాలు తయారు చేయాలని ముందుగా ఆదేశించినా తరువాత మార్చి 18 వరకు గడువు పెంచారు. సాంకేతిక కారణాల వల్ల ఓటర్ల జాబితా లు తయారు కాలేదని ప్రభుత్వం ఎన్నికల కమి షన్‌కు చెప్పింది. ఏప్రిల్ 15 వతేదీలోగా జాబితా లను రూపొందించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ గడువు విధించింది. బుధవారం పంచాయతీల వారీగా ఓటర్ల జాబితా విడుదలకు అధికారులు రంగం సిద్ధం చేశారు. అనంతరం మిగిలిన ప్రక్రియ నిర్వహించే అవకాశాలున్నాయి. ఓటర్ల జాబితాలను ప్రకటించిన తర్వాత రిజర్వేషన్ ప్రక్రియ, గ్రామ పంచాయతీల వారీగా వార్డుల విభజన జరగాల్సి ఉంది. కొన్ని గ్రామ పంచాయతీల్లో వార్డుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. దీని తర్వాత పోలింగ్ కేంద్రాల గుర్తింపు ప్రక్రియ నిర్వహిస్తారు.
పెరగనున్న ఓటర్ల సంఖ్య
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 2021 ఫిబ్రవ రిలో 48 మండలాల్లోని 887 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించారు. 2021 ఏప్రిల్ 2న పం చాయతీలకు పాలకవర్గాలు ఏర్పడ్డాయి. తర్వాత జిల్లాల పునర్విభజనతో మార్పులు సంభవించాయి. ఏలూరు జిల్లాలోని 27 మండలాల్లో ఓటర్ల సంఖ్య పెరగనుందని చెబుతున్నారు. కొత్త ఓటర్లు ఎక్కువ మంది చేరనున్నారని తెలుస్తోంది. దీంతో ఈసారి పంచాయతీల ఎన్నికలలో యువ ఓటర్ల ప్రాతినిధ్యం ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి.
రాజకీయ వర్గాల్లో ఎన్నికల వేడి
గ్రామ పంచాయతీలలో ఈ నెల 3 నుంచి ప్రత్యే కాధికారుల పాలన ఏర్పడడంతో అన్ని చోట్ల ఎన్ని కలపై చర్చ సాగింది. ఎన్నికలకు రాజకీయ పార్టీలు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఈ మేరకు పార్టీ శ్రేణులకు సంకేతాలు ఇచ్చాయి. గ్రామ పంచాయ తీల్లో పోటీ చేసే సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో ఉన్నాయి. అధికా ర కూటమి, ప్రతిపక్ష పార్టీలు రిజర్వేషన్లకు అనుగు ణంగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. రిజర్వేషన్, కులాల వారీగా అభ్యర్థుల ఎంపికపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. గ్రామాల్లో ఎక్కడ చూసినా గ్రామ పంచాయతీ ఎన్నికలపైనే చర్చలు జరుగుతున్నాయి.