పల్లె ఓటర్ల జాబితా గడువు పెంపు
ABN , Publish Date - Mar 09 , 2026 | 01:00 AM
పల్లె ఓటర్ల జాబితా ప్రకటనను ఎన్నికల సంఘం వాయిదా వేసింది.
పన్ను వసూళ్లు, సర్వేలతో సిబ్బంది బిజీ
అధికారుల వినతి
ఈ నెల 18న జాబితా ప్రకటన
పల్లె ఓటర్ల జాబితా ప్రకటనను ఎన్నికల సంఘం వాయిదా వేసింది. ఒక వైపు ఆస్తిపన్ను వసూళ్లు, మరో వైపు స్వమిత్వ సర్వేలు, ఇంకోవైపు మౌలిక వసతుల కల్పన వంటి పనులతో పంచాయతీలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ఇదే విషయంపై జిల్లా పంచాయతీ అధికారుల నుంచి ఎన్నికల సంఘానికి వినతులు వెళ్లాయి.
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
పంచాయతీ ఓటర్ల జాబితా ఈనెల 9న వార్డుల వారీగా ప్రకటించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసింది. జిల్లాల్లో సిబ్బంది అధికారుల పని ఒత్తిడిపై ఉన్నతాధికారులు ఎన్నికల సంఘానికి విన్నవించడంతో మార్చి 18కి వాయిదా వేస్తూ తాజాగా మళ్లీ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మేరకు పంచాయతీల్లో కసరత్తు చేస్తున్నారు. జిల్లాలోని 20 మండలాల పరిధిలోని పంచాయతీలకు ఇప్పటికే ఓటర్ల జాబితా చేరుకుంది. వాటిలో తొలగిం చాల్సిన వి కొన్ని ఉంటే కలపాల్సినవి ఇంకొన్ని ఉన్నాయి. ఆ దిశగా చర్యలు తీసుకున్నారు. ఒకే డోర్ నెంబర్‌పై అనేకమంది ఓటర్లున్నారు. నిబంధనల మేరకు ఒక డోర్ నెంబర్‌పై అదే కుటుంబానికి చెందిన ఓటర్లు ఉండాలి. దానిని సరిదిద్దనట్టయితే కొన్ని గ్రామాల్లో అత్యధిక ఓటర్లను తొలగించాల్సి వస్తోంది. ఒక్కో గ్రామంలో ఇలా 100 నుంచి 200 వరకు ఓటర్లు తొలగించాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ఇటువంటి గ్రామాలు జిల్లాలో అనేకం ఉన్నాయి. దీనిని సరిదిద్ద డానికి సమయం పట్టనుంది. తాజాగా ఎన్నికల సంఘం గడువు ఇవ్వడంతో పంచాయతీ అధికారులు కాస్త ఊరట పొందారు. శనివారం రాత్రి తాజా ఉత్తర్వులు అందాయి. మార్చి 18న జాబితాను ప్రచురించనున్నారు.
పట్టణాల్లో వాయిదానే..
పట్టణాలకు వచ్చేసరికి మార్చి 9న ప్రచురించా లని ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే మున్సిపాలిటీలకు సమస్య ఉందంటూ ప్రభుత్వం సూచించడంతో ప్రకటన వాయిదా వేసింది. నోటిఫి కేషన్ రద్దు చేసింది. దాంతో పట్టణాల్లో ప్రస్తుతం ఓటర్ల ప్రకటన లేనట్టే. ప్రస్తుతానికి పల్లెలకు సంబం ధించిన ఓటర్ల జాబితాను మాత్రమే మార్చి 18న ప్రకటించనున్నారు. పట్టణాల్లో విలీన గ్రామాలతో సహా జాబితా సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు మున్సిపాలిటీల పరిధిలో విలీన గ్రామాలున్నాయి. వాటికి కూడా జాబితా సిద్ధం చేశారు. గత ప్రభుత్వం విలీన గ్రా మాలను మున్సిపాలిటీల్లో కలిపి పట్టణ వార్డులను నిర్ధారించింది. కానీ అమలుకు నోచుకోలేదు. మున్సిపాలిటీలతోపాటు, విలీన గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించలేదు. ఈ సారి ఎన్నికలకు విలీన గ్రామాలను సిద్ధం చేస్తున్నారు.
409 పంచాయతీల్లో..
జిల్లాలోని 409 గ్రామపంచాయతీల్లో వార్డుల వారీగా జాబితా సిద్ధం కానుంది. జాబితాలను పరి శీలించి తప్పిదాలను సరిచేస్తున్నారు. ఈ ఏడాది జనవరి ఒకటో తేదీనాటికి ఉన్న ఓటర్ల వివరాలను ప్రకటించేందుకు పంచాయతీలో సిద్ధమవుతున్నాయి.