Share News

సచివాలయానికి తాళం

ABN , Publish Date - Mar 06 , 2026 | 12:07 AM

‘‘అధికారులు సహకరించడం లేదు.. కనీసం గౌరవం ఇవ్వడం లేదు.. ఇప్పటివరకు గ్రామంలో చేసిన ఆభివృద్ధి పనులకు బిల్లులు మంజూరు చేయడం లేదు..ఎన్నిసార్లు విన్నవించినా స్పందన లేదు.. విసిగిపోయి చివరికి సచివాలయానికి తాళం వేయక తప్పలేదు..’’

సచివాలయానికి తాళం
సచివాలయం వద్ద నిరసన తెలుపుతున్న సర్పంచ్‌ రామాంజనేయులు

అధికారులు సహకరించడం లేదంటూ సర్పంచ్‌ ధర్నా

నరసాపురం రూరల్‌, మార్చి 5(ఆంధ్రజ్యోతి): ‘‘అధికారులు సహకరించడం లేదు.. కనీసం గౌరవం ఇవ్వడం లేదు.. ఇప్పటివరకు గ్రామంలో చేసిన ఆభివృద్ధి పనులకు బిల్లులు మంజూరు చేయడం లేదు..ఎన్నిసార్లు విన్నవించినా స్పందన లేదు.. విసిగిపోయి చివరికి సచివాలయానికి తాళం వేయక తప్పలేదు..’’ అని నరసాపురం మండలం పసలదీవి సర్పంచ్‌ కొట్టు రామాంజనేయులు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం ఉదయం గ్రామ కార్యదర్శి, సిబ్బందికి పంచాయతీకి వచ్చే సమయానికి కంటే ముందుగా కార్యాలయం వద్దకు వెళ్లారు. తాళం వేసి తలుపు వద్ద ధర్నా చేపట్టారు. ఆయనకు మద్దతుగా గ్రామంలోని కొందరు కూడా కార్యాలయం వద్ద బైఠాయించారు. మూడు రోజుల క్రితం జరిగిన మండల సమావేశంలో పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ఇదే ఆంశంపై గళం ఎత్తారు. ప్రజాప్రతినిధుల్ని అధికారులు పట్టించుకోవడం లేదని కనీసం గౌరవం కూడా ఇవ్వడం లేదని పంచాయతీల్లో ప్రతిపాదించిన పనులు కూడా చేపట్టడం లేదంటూ మండిపడ్డారు. కూటమి పార్టీకి చెందిన నాయకులు చెప్పినా పట్టు వీడలేదు. చివరికి డీఎల్‌పీవో జ్యోత్మిమయి ఫోన్‌లో మాట్లాడారు. త్వరలో బిల్లులు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. కార్యదర్శి వ్యవహారంపై కూడా విచా రణ చేయిస్తామని హామీ ఇచ్చారు. దీంతో సర్పంచ్‌ ఆందోళన విరమించారు. నిరసన విషయం తెలుసుకున్న మొగల్తూరు పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకున్నారు. అధికారులతో చర్చించారు.

Updated Date - Mar 06 , 2026 | 12:07 AM