Share News

‘వికసిత్‌’లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

ABN , Publish Date - Aug 11 , 2026 | 12:48 AM

‘నేషన్‌ ఫస్ట్‌ స్ఫూర్తితో దేశ ఐక్యత, సమగ్రతను కాపాడుకుంటూ వికసిత్‌ భారత్‌ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పిలుపునిచ్చారు.

‘వికసిత్‌’లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
భీమవరంలో హర్‌ఘర్‌ తిరంగా యాత్రలో కేంద్రమంత్రి వర్మ, తదితరులు

కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ

భీమవరంలో ఘనంగా హర్‌ఘర్‌ తిరంగా యాత్ర

భీమవరంటౌన్‌, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): ‘నేషన్‌ ఫస్ట్‌ స్ఫూర్తితో దేశ ఐక్యత, సమగ్రతను కాపాడుకుంటూ వికసిత్‌ భారత్‌ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పిలుపునిచ్చారు. దేశభక్తి, జాతీయసమైక్యతను చాటుతూ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ’హర్‌ఘర్‌ తిరంగా‘ కార్యక్రమంలో భాగంగా భీమవరంలో సోమవారం భారీ తిరంగా యాత్ర ఘనంగా నిర్వహించారు. భీమవరం బీజేపీ జిల్లా కార్యాలయం నుంచి ప్రారంభ మైన ఈ యాత్రను ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులుతో కలిసి ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీలో కూటమి శ్రేణులు, యువత అధిక సంఖ్యలో జెండాలను చేతబూని పాల్గొన్నారు. ఈ యాత్ర ఓవర్‌బ్రిడ్జి, ప్రకాశం చౌక్‌ మీదుగా కొనసాగింది. మార్గమధ్యలో డాక్టర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఏఎస్‌ఆర్‌ నగర్‌లో అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు యాత్ర కొనసా గింది. ఆయన మాట్లాడుతూ 80వ స్వాతంత్య్ర దినోత్సవం, ’వందేమాతరం’ 150వ వార్షికోత్సవాల స్ఫూర్తితో ఈ తిరంగా యాత్రను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈనెల 10నుంచి 14 వరకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో తిరంగా యాత్రలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 13నుంచి 15వరకు ప్రతి ఇంటిపై, వాణిజ్య సంస్థలపై జాతీయ జెండాను ఎగురవేయాలని మోదీ పిలుపునిచ్చా రన్నారు. ఈ యాత్రలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, ’హర్‌ ఘర్‌ తిరంగా‘ జిల్లా ఇన్‌చార్జి షేక్‌ మొహుద్దీన్‌, జిల్లా ప్రధాన కార్యదర్శులు కలిదిండి వినోద్‌వర్మ, తోట గంగరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు కాయిత సురేంద్ర, కూటమి నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Updated Date - Aug 11 , 2026 | 12:48 AM