Share News

వెంకన్న క్షేత్రంలో భక్తులు కళకళ

ABN , Publish Date - Jun 28 , 2026 | 12:04 AM

జోరుగా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వేలాది మంది యాత్రికులు శనివారం శ్రీవారి క్షేత్రాన్ని సందర్శించారు.

వెంకన్న క్షేత్రంలో భక్తులు కళకళ
ఉచిత ప్రసాద వితరణ వద్ద భక్తులు

ద్వారకాతిరుమల, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): జోరుగా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వేలాది మంది యాత్రికులు శనివారం శ్రీవారి క్షేత్రాన్ని సందర్శించారు. ఉదయం తొమ్మిది గంటల వరకు జోరుగా వాన కురిసింది. అయినప్పటికీ ఆలయానికి భక్తుల రాక ప్రారంభమైంది. తొమ్మిది గంటల తర్వాత నుంచి వర్షం తగ్గుముఖం పట్టడంతో భక్తుల జోరు మరింతగా పెరిగింది. ఆలయంలోని అన్నివిఽభాగాలు భక్తులతో కళకళలాడాయి. ఆలయానికి వచ్చిన భక్తులు మొక్కుబడులు తీర్చుకుని క్యూలైన్ల ద్వారా వెళ్లి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. దాదాపు 20వేల మంది పైబడి భక్తులు ఆలయానికి వచ్చినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. దర్శనానంతరం వారంతా ఉచిత ప్రసాదాన్ని స్వీకరించారు.

Updated Date - Jun 28 , 2026 | 12:04 AM