Share News

శ్రీవారి ఆరు లడ్డూల బాక్స్‌ అమ్మకాలు

ABN , Publish Date - Jul 02 , 2026 | 12:19 AM

చినవెంకన్న ఆలయంలోని ప్రసా దాల కౌంటర్లలో ఆరు లడ్డూల బాక్స్‌ల విక్రయాలు బుధ వారం ప్రారంభమ య్యాయి.

 శ్రీవారి ఆరు లడ్డూల బాక్స్‌ అమ్మకాలు
లడ్డూల బాక్స్‌ను భక్తులకు విక్రయిస్తున్న సిబ్బంది

ద్వారకాతిరుమల, జూలై 1 (ఆంధ్ర జ్యోతి): చినవెంకన్న ఆలయంలోని ప్రసా దాల కౌంటర్లలో ఆరు లడ్డూల బాక్స్‌ల విక్రయాలు బుధ వారం ప్రారంభమ య్యాయి. భక్తుల సౌలభ్యం కోసం ఈ విధానాన్ని దేవస్థానం నూతనంగా ప్రవేశపెట్టింది. ఇప్పటికే ఈ విధానం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో అమలవుతోంది. ఒక్కో బాక్స్‌ను దేవస్థానం రూ.100కు విక్రయి స్తోంది. ఆరు లడ్డూల ధర రూ.90 అయినప్పటికీ బాక్స్‌లో అన్నీ ఒకే చోట ఉండడంతో రవాణా తేలికగా ఉంటుందని భక్తులు కొనుగోలు చేస్తున్నారు.

Updated Date - Jul 02 , 2026 | 12:19 AM