శ్రీవారి హుండీల ఆదాయం రూ.12 లక్షలు
ABN , Publish Date - Jul 03 , 2026 | 12:25 AM
ఏలూరు– రామచంద్రరావు పేటలోని వేంకటేశ్వరస్వామి ఆలయ హుండీలను 96 రోజులకుగాను గురువా రం లెక్కించగా 12 లక్షల 22 వేల 50 రూపాయల ఆదాయం లభించినట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి నల్లూరి సతీష్‌కుమార్, ధర్మకర్తల మండలి చైర్మన్ పాలడుగు వెంకట రమాదేవి తెలిపారు.
ఏలూరుకార్పొరేషన్, జూలై 2 (ఆంధ్రజ్యోతి) : ఏలూరు– రామచంద్రరావు పేటలోని వేంకటేశ్వరస్వామి ఆలయ హుండీలను 96 రోజులకుగాను గురువా రం లెక్కించగా 12 లక్షల 22 వేల 50 రూపాయల ఆదాయం లభించినట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి నల్లూరి సతీష్‌కుమార్, ధర్మకర్తల మండలి చైర్మన్ పాలడుగు వెంకట రమాదేవి తెలిపారు. దేవదాయ శాఖ ఇన్‌స్పెక్టర్ వి.సురేష్‌కుమార్ పర్యవేక్షణలో లెక్కింపు నిర్వహించారు. హుండీ లెక్కింపులో ఆలయ సిబ్బంది, భక్తులు, ధర్మకర్తలు, అర్చక బృందం పాల్గొన్నారు.