శ్రీవారి క్షేత్రంలో సాయంకాలార్చన సమయం మార్పు
ABN , Publish Date - Mar 05 , 2026 | 12:22 AM
సూర్యాస్తమ కాలానికి అనుగుణంగా శ్రీవారి ఆలయంలో సాయంకాలార్చన సమయాన్ని ఈనెల 14 నుంచి మార్పు చేస్తున్నట్టు ఆలయ ఈవో భద్రాజీ తెలిపారు.
ద్వారకాతిరుమల, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): సూర్యాస్తమ కాలానికి అనుగుణంగా శ్రీవారి ఆలయంలో సాయంకాలార్చన సమయాన్ని ఈనెల 14 నుంచి మార్పు చేస్తున్నట్టు ఆలయ ఈవో భద్రాజీ తెలిపారు. ఇప్పటివరకు సాయంకాలార్చన సమయం 5 నుంచి 6.30 గంటల వరకు ఉందన్నారు. దానిని సాయంత్రం 5.30 నుంచి 7.00 గంటల వరకు మార్పు చేస్తున్నామన్నారు. ఈనెల 14 నుంచి స్వామివారి దర్శనం భక్తులకు సాయంత్రం 5.30 గంటల వరకు లభిస్తుందన్నారు. సాయంకాలార్చన అనంతరం తిరిగి ఏడు గంటల నుంచి స్వామి దర్శనం లభిస్తుందని భక్తులు గమనించాలని కోరారు.
వెంకన్న క్షేత్రంలో 20న ఉగాది ఉత్సవం
చిన్నతిరుమలేశుని క్షేత్రంలో శ్రీపరాభవ నామసంవత్సవ ఉగాది ఉత్సవాన్ని ఈనెల 20న నిర్వహిస్తామని ఈవో తెలిపారు. ఉగాది ఉత్సవాన్ని పురస్కరిం చుకుని ఆలయ పరిసరాలను పుష్పమాలికలు, మామిడితోరణాలతో అలంకరిస్తా మన్నారు. సాయంత్రం ఆరు గంటలకు శ్రీవారు ఉభయదేవేరులతో శేషవాహనంపై కొలువై ఉగాదిమండపం వద్దకు తిరువీథుల్లో విహరించి వస్తారన్నారు. విశేష పూజలు జరిపి పంచాంగశ్రవణం నిర్వహిస్తామన్నారు. అనంతరం ఆలయానికి ఎక్కువ మొత్తంలో విరాళాలిచ్చిన దాతలకు, పండితులను సత్కరిస్తామన్నారు.