వేడుకగా వేమన జయంతి
ABN , Publish Date - Jan 19 , 2026 | 12:03 AM
ఆరవల్లిలో యోగివేమన జయంతి ఉత్సవాన్ని నేత్రపర్వంగా జరిపారు.
ఆరవల్లిలో పండుగ.. వేమన చిత్రపటం ఊరేగింపు..
ఆలయం వద్ద భక్తి సంగీత కార్యక్రమాలు..
ప్రత్యేక దుకాణాల ఏర్పాటు.. భక్తులకు భోజనాలు
అత్తిలి, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): మానవ జీవితానికి సంబంధించిన అనేక నిత్యసత్యాలను తనదైన శైలిలో తేట తెలుగు పదాలతో రచించి తెలుగువారి హృదయాల్లో చిరస్మరణీయునిగా నిలిచిన ప్రజాకవి యోగివేమన. అత్తిలి మండలం ఆరవల్లిలో వేమనకు మందిరాన్ని నిర్మించి, ప్రతి ఏడాది జనవరి 18న వేమన జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఆదివారం యోగివేమన 101 జయంతి ఉత్సవాన్ని నేత్రపర్వంగా జరిపారు. వేకువ జామున వెలగల దాసు వంశీయులు వేమన చిత్రపటానికి గోస్తనీనది స్నానం చేయించారు. వేమన మందిరాన్ని పుష్పాల తో అలంకరించారు. ఉదయం నుంచి భక్తు లు పెద్ద సంఖ్యలో హాజరై వేమనను దర్శి ంచుకున్నారు. ఆలయ ప్రాంగణంలో కీర్తన లు, కోలాట భజన, సినీ సంగీత విభా వరి కార్యక్రమాలు నిర్వహించారు. బ్యాండు మేళాలు, మంగళవాయిద్యాల నడుమ బాణ సంచా కాల్పులతో విశేషంగా అలం కరించిన పల్లకీపై వేమన చిత్రపటాన్ని ఉంచి గ్రామ పురవీధులలో ఊరేగించారు. వేమన పల్లకీ కింద నుంచి తల్లి దండ్రులు తమ చిన్నారు లను దాటించారు. ఇలా చేయడం వల్ల చిన్నా రులకు ఆయుష్షు పెరుగుతుందనే గ్రామస్తు ల నమ్మకం. భక్తులకు అన్నదానం చేశారు. ఉత్సవాలు సందర్భంగా ఏర్పాటు చేసిన గృహోపకరణ, ఫ్యాన్సీ, వస్తు దుకాణాల వద్ద సందడి నెలకొంది. వేమన జయంతి సందర్భంగా గ్రామంలో పండుగ వాతావ రణం నెలకొ ంది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణ ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వేమన ఉత్సవ కమిటీ ఛైర్మన్ వెలగల అమ్మిరెడ్డి, కమిటీ సభ్యులు పర్యవేక్షణలో ఉత్సవాలను ఘన ంగా నిర్వహించారు. ఆరవల్లి గ్రామానికి చెందిన ప్రముఖ సినీ దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డి, నిర్మాత కె.అచ్చిరెడ్డి యోగి వేమనను దర్శించు కున్నారు. ఈసందర్భంగా కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డిలను ఆలయ కమి టీ ఛైర్మన్ సత్కరించి, వేమన పద్యాల పుస్తకాలను అందజేశారు. క్రీడా ప్రాంగ ణంలో జరుగుతున్న వాలీబాల్ పోటీలను తిలకించారు.
శునకాలకు అన్నదానం
ఆరవల్లిలో వేమన జయంతి ఉత్సవాలలో భాగంగా గ్రామ సింహాలైన శునకాలకు అన్నదానం చేశారు. పలు రకాల ఆహార పదార్ధాలను కావిడిపెట్టుకుని గ్రామంలో తిరుగుతూ కనిపించిన శునకాలకు విస్తరి వేసి, ఆహార పదార్ధాలను దగ్గర ఉండి వడ్డించారు. గ్రామానికి కాపలా ఉంటూ, గ్రామాన్ని రక్షించేది కాలభైరవుడని, ప్రతి ఏటా గ్రామంలో కాలభైరవ సంతర్పణ పేరుతో గ్రామంలో ఉన్న శునకాలకు భోజనం వడ్డిస్తామని యోగి వేమన జయంతి ఉత్సవ కమిటీ ఛైర్మన్ వెలగల అమ్మిరెడ్డి తెలిపారు.