Share News

రయ్‌..రయ్‌

ABN , Publish Date - Jan 12 , 2026 | 12:03 AM

సంక్రాంతి పండుగకు స్వగ్రామాలకు వెళుతు న్నవారు, బంధువుల ఇళ్లకు పండగకు వచ్చేవారితో పాటుగా పండుగ మూడు రోజులూ అన్నీ పనులూ పక్కన పెట్టేసి గోదావరి జిల్లాల్లో వేసే కోడిపందేలు, ఇతర సంప్రదాయ ఆటల, క్రీడా పోటీలను తిలకిం చేందుకు వచ్చేవారి కార్లన్నీ జాతీయరహదారిపై క్యూ కట్టాయి.

రయ్‌..రయ్‌
కలపర్రు టోల్‌ప్లాజా వద్ద వాహనాల రద్దీ

దూర ప్రాంతాల నుంచి పండుగకు రాక

కలపర్రు టోల్‌గేటు వద్ద అదనపు మార్గాలు

ప్రమాదాల నియంత్రణకు స్పెషల్‌ పార్టీ పోలీసులతో గస్తీ

ఏలూరు క్రైం/పెదపాడు, జనవరి 11 (ఆంధ్ర జ్యోతి): సంక్రాంతి పండుగకు స్వగ్రామాలకు వెళుతు న్నవారు, బంధువుల ఇళ్లకు పండగకు వచ్చేవారితో పాటుగా పండుగ మూడు రోజులూ అన్నీ పనులూ పక్కన పెట్టేసి గోదావరి జిల్లాల్లో వేసే కోడిపందేలు, ఇతర సంప్రదాయ ఆటల, క్రీడా పోటీలను తిలకిం చేందుకు వచ్చేవారి కార్లన్నీ జాతీయరహదారిపై క్యూ కట్టాయి. దీంతో జాతీయరహదారి, టోల్‌ప్లాజాల వద్ద రద్దీ వాహన శ్రేణుల రద్దీ కన్పిస్తోంది. వరుసగా సెల వులు ప్రారంభం కావడంతో శనివారం నుంచే వాహ నాల రాక మొదలవడంతో టోల్‌ప్లాజా వద్ద రద్దీ లేకుం డా వాహనాలు ముందుకెళుతున్నాయని, ఈ రద్దీ సోమ, మంగళవారాల్లో ఎక్కువగా ఉంటుందని అక్కడి సిబ్బంది చెబుతున్నారు సంక్రాంతి పండుగకు ముందే రెండో శనివారం, ఆదివారం రావడంతో దూర ప్రాంతాల్లో ఉన్న వారందరికీ సెలవు కలిసి వచ్చింది. విజయవాడ నుంచి ఏలూరు మీదుగా కలపర్రు టోల్‌గేటు వద్ద ఈనెల 9వ తేదీన 18,082 వాహనాలు దాటగా, పదో తేదీన 28,371 వాహనాలు దాటాయి. 11వ తేదీన రాత్రి 7 గంటల వరకు 21,339 వాహ నాలు దాటగా అర్ధరాత్రి సమయానికి 30వేల వాహ నాలు దాటాయి. కలపర్రు టోల్‌గేటు వద్ద విజయవాడ నుంచి ఏలూరు వైపు రావడానికి కేవలం మూడు వాహనాలు ఏకకాలంలో దాటడానికి మార్గాలు ఉండ గా డీటీఆర్బీ అధికారులు సూచనలతో టోల్‌గేటు నిర్వా హకులు మరో మూడు మార్గాలను తెరిచారు. దీంతో ఏకకాలంలో ఆరు వాహనాలు ఒకేసారి వెళి ్లపోతు న్నాయి. ఏలూరు నుంచి విజయవాడ వైపు వెళ్ళే మార్గంలోను టోల్‌గేటు వద్ద ఆరు మార్గాలను తెరి చారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా ఫాస్ట్‌టాగ్‌ స్కానర్‌ అవ్వకపోయినప్పటికీ – ఆ వాహనం ఫొటో తీసుకుని పంపించి వేస్తున్నారు. తర్వాత సిస్టమ్‌లో నమో దు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. దీంతో ట్రాఫిక్‌ అంతరాయం లేకుండా ముందుకు సాగుతోంది.

జాతీయ రహదారిలో నిరంతరం పెట్రోలింగ్‌ : ఎస్పీ కేపీఎస్‌ కిశోర్‌ ఆదే శాల మేరకు జాతీయ రహదారిలో ఎక్కడా ప్రమాదాలు జరుగకుండా స్పెషల్‌ పార్టీ పోలీసులతో పెట్రోలింగ్‌ చేయిస్తున్నారు. హనుమాన్‌ జంక్షన్‌ నుంచి గుండుగొలను వరకు పెట్రోలింగ్‌ పోలీసులు నిరంతరం జాతీయ రహదారిపై పర్యవేక్షణ చేస్తూ వాహనాలు ఎక్కడా రహదారిపై పార్కింగ్‌ చేయకుండా చూస్తున్నారు. ఏదైనా వాహనం మరమ్మతులు వచ్చి ఆగిపోతే వెంటనే టోయింగ్‌ వెహికల్‌తో పక్కకు తీయించి వేస్తున్నారు.

లిమిట్‌ దాటితే టోల్‌గేట్‌ ఎత్తేయాలి : దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని

టోల్‌ఫీజు వసూలు పేరుతో వాహనాలు బారులు తీరేలా నిలిపి ప్రజలను ఇ బ్బంది పెడితే ఉపేక్షించేది లేదని, వాహనాల లిమిట్‌ దాటితే టోల్‌గేట్‌ ఎత్తేయా లని పెదపాడు మండలం కలపర్రు టోల్‌ప్లాజా అధికారులు, సిబ్బందికి దెందు లూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ తెలిపారు. ఎమ్మెల్యే ప్రభాకర్‌ ఆదివారం కలపర్రు టోల్‌ప్లాజాను సందర్శించి అక్కడి ట్రాఫిక్‌ను పరిశీలించారు. కొన్ని లైన్లలో అడ్డుగా వేసిన బారికేడ్లను దగ్గరుండి తీయించారు. టోల్‌ప్లాజా వద్ద పోలీసు సిబ్బం దిని ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను పర్యవేక్షించాలని సీఐ రాజశేఖర్‌ను ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే చింతమనేని మీడియాతో మాట్లాడుతూ సొంత ఊళ్లకు తరలివెళ్లే ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించామన్నా రు. ఎస్‌ఐ కట్టా సతీష్‌, టోల్‌ప్లాజా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2026 | 12:03 AM