బియ్యం దుకాణాలపై విజిలెన్స్ దాడులు
ABN , Publish Date - Nov 14 , 2026 | 11:50 PM
నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించేం దుకు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. శనివారం ఏలూరు పట్టణంలోని తంగెళ్లమూడి ప్రాంతంతో పాటు పెదవేగి మండలం విజయ రాయి గ్రామంలో విజిలెన్స్, పౌరసరఫరాలు, తూనికలు కొలతల శాఖ అధికారులు సం యుక్తంగా తనిఖీలు నిర్వహించారు.
ఏలూరుక్రైం, నవంబరు 14, (ఆంధ్రజ్యోతి) : నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించేం దుకు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. శనివారం ఏలూరు పట్టణంలోని తంగెళ్లమూడి ప్రాంతంతో పాటు పెదవేగి మండలం విజయ రాయి గ్రామంలో విజిలెన్స్, పౌరసరఫరాలు, తూనికలు కొలతల శాఖ అధికారులు సం యుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సంద ర్భంగా బియ్యం విక్రయ దుకాణాల్లో బియ్యం సంచులపై గరిష్ట చిల్లర ధర వివరాలను స్టిక్కర్ల ద్వారా అతికించడం, ప్యాకింగ్ లైసెన్స్ లేకపో వడం, నిర్ణీత బరువు కంటే తక్కువగా బియ్యం విక్రయించడం, తయారీదారు లేదా ప్యాకర్ చిరునామా వివరాలు సంచులపై ముద్రించక పోవడం వంటి ఉల్లంఘనలను అధికారులు గుర్తించారు. ఏలూరు పట్టణంలోని తంగెళ్ల మూడిలో ఒక దుకాణంపై, పెదవేగి మండలం విజయరాయి గ్రామంలోని లక్ష్మి వెంకటేశ్వర ఫ్యాన్సీ అండ్ జనరల్ స్టోర్స్, సూర్య జనరల్ రైస్ అండ్ ఆయిల్స్, శ్రీలక్ష్మి వెంకటేశ్వర జనరల్ స్టోర్స్‌లపై కేసులు నమోదు చేశారు. మొత్తం నాలుగు దుకాణాలపై తూనికలు, కొలతల చట్టం ప్రకారం ఐదు కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి నాగేశ్వరరావు మాట్లా డుతూ నిత్యావసర సరుకులను అధిక ధరలకు విక్రయించే వ్యాపారులపై చర్యలు తీసుకుం టామని హెచ్చరించారు. తనిఖీల్లో విజిలెన్స్ డీఎస్పీ సింగులూరి వెంకటేశ్వరరావు, ఏవో జి.మీరయ్య, పోలీస్ ఇన్‌స్పెక్టర్ డి.ప్రసాద్ కుమార్, పి.శ్రీధర్, తూనికలు కొలతల అధికారి జి.వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు.