Share News

భగ్గుమంటున్న కూరగాయల ధరలు

ABN , Publish Date - Sep 28 , 2026 | 12:23 AM

మార్కెట్లో కూరగాయల ధరలు భగ్గుమంటు న్నాయి.మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. దీంతో సామాన్యులపై ధరల భారం పడుతోంది.

భగ్గుమంటున్న కూరగాయల ధరలు

భగ్గుమంటున్న కూరగాయల ధరలు

ఊరటనిచ్చిన ఉల్లి.. కొండెక్కిన కోడి

తాడేపల్లిగూడెం, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): మార్కెట్లో కూరగాయల ధరలు భగ్గుమంటు న్నాయి.మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. దీంతో సామాన్యులపై ధరల భారం పడుతోంది. గత వారంతో పోలిస్తే ఈ వారం కిలోలకు రూ.10నుంచి 20వరకు వ్యత్యాసం కనిపిస్తోంది. అసలే ఎల్‌నినో ప్రభావంతో పంటల దిగుబడి అంతంత మాత్రంగానే ఉంది.ఇటీవల కురిసిన వర్షాలకు కురిసిన వర్షాలకు ఉన్న పంటలు నీటి పాలయ్యాయి.దీంతో కూరగాయల కొరత ఏర్ప డింది. దీంతో మార్కెట్లో కూరగాయల ధరలు అమాంతం పెరిగాయి. వంకాయలు కిలో రూ.40 నుంచి 60కు, బీరకాయలు రూ.40 నుంచి 50, దొండకాయలు రూ.30 నుంచి 50, బెండకా యలు రూ.30 నుంచి 50, దోసకాయలు రూ.30 నుంచి 50,క్యాప్సికం రూ.80 నుంచి 100, పచ్చి మిర్చి రూ.40 నుంచి80కు పెరిగాయి. కాకరకా యలు రూ.40, ఆగాకర రూ.160, క్యారెట్‌ రూ.50, క్యాబేజ్‌ రూ.40, చిక్కుళ్లు రూ.120, ఆనబ కా యలు రూ.25, అరటి జత రూ.15, మునగకా డలు జత రూ.15 చొప్పున విక్రయించారు.

పెరుగుతున్న చికెన్‌ ధరలు...

చికెన్‌ ధరలకు రెక్కలొచ్చాయి. గత వారం తో పోలిస్తే కిలోకు రూ.20పెరిగింది. కనిష్టానికి కిలో రూ.200కు చేరింది. ఇప్పుడు అదే కిలో స్కిన్‌లెస్‌ చికెన్‌ రూ.280కు చేరింది. విత్‌ స్కిన్‌ చికెన్‌ రూ.260, లైవ్‌ కిలో రూ.150కు విక్రయి స్తున్నారు. రైతుల వద్ద కోళ్లు దాదాపు అయిపో యినట్టు చెబుతున్నారు. ఇప్పుడు కార్పొరేట్‌ సంస్థల వద్ద కోళ్లు ఉన్నట్టు వ్యాపారులు చెబు తున్నారు. దీంతో ధరలు పెరిగాయని చెబుతు న్నారు. ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు పేర్కొంటున్నారు.

కొద్దిగా తగ్గిన ఉల్లి..

ఉల్లి ధర ఈ వారం కొద్దిగా దిగి వచ్చింది. మహారాష్ట్ర ఉల్లి హోల్‌సేల్‌గా క్వింటాలు రూ.4 వేలు నుంచి 5 వేలు మధ్య ధర పలికింది. కర్నూలు రకం ఉల్లి రూ.3 వేలు నుంచి 4వేల మధ్య విక్రయించారు. గతవారం రిటైల్‌గా ఉల్లి కిలో రూ.60 ఉంటే ఈ వారం రూ.50కు దిగివ చ్చింది. కర్నూలు ఉల్లి పంటకు వర్షం ప్రభావ పడినట్లు తెలిపారు. వర్షం తీవ్రత వల్ల ఉల్లి తడిసినట్టు చెబుతున్నారు. దీని వల్ల కూడా కర్నూలు ఉల్లి ధర కొద్దిగా దిగివచ్చినట్లు వ్యా పారులు చెబుతున్నారు.

Updated Date - Sep 28 , 2026 | 12:23 AM