భగ్గుమంటున్న కూరల ధరలు..
ABN , Publish Date - Oct 04 , 2026 | 11:59 PM
మార్కెట్లో కూరగాయల ధరలు భగ్గుమంటు న్నాయి. అన్ని రకాల కూరగాయల ధరలు కిలో రూ.50 పైనే ధర పలుకుతున్నాయి. గత వా రంతో పోలిస్తే కిలోకు రూ.20 నుంచి 40వరకు పెరిగాయి. వాతావరణంలో ఏర్పడిన అనిశ్చితి కారణంగా తోటలు చాలావరకు దెబ్బతిన్నట్టు రైతులు చెబుతున్నారు.
అన్ని కూరగాయలు కిలో రూ.50 పైమాటే..
అందుబాటులోకి వచ్చిన కర్నూలు ఉల్లి
తాడేపల్లిగూడెం, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): మార్కెట్లో కూరగాయల ధరలు భగ్గుమంటు న్నాయి. అన్ని రకాల కూరగాయల ధరలు కిలో రూ.50 పైనే ధర పలుకుతున్నాయి. గత వా రంతో పోలిస్తే కిలోకు రూ.20 నుంచి 40వరకు పెరిగాయి. వాతావరణంలో ఏర్పడిన అనిశ్చితి కారణంగా తోటలు చాలావరకు దెబ్బతిన్నట్టు రైతులు చెబుతున్నారు. మూడు రోజుల పాటు ఎడతెరిపి లేని వర్షాలకు కూరగాయల తోటలు దెబ్బతిన్నాయి. కొన్నిచోట్ల తోటల్లో నీరునిలిచి మొక్కలు చనిపోగా, మరికొన్ని ప్రాంతాల్లో పూత, పిందే రాలిపోయింది.దీంతో మార్కెట్‌కు వచ్చే కూరగాయలు తగ్గిపోయాయి. వినియో గానికి సరిపడా ఉత్పత్తి లేకపోవడంతో ధరలు మరింత పెరిగాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రకాశరావుపాలెం, ఆవపాడు, తెలిక చర్ల, నల్లజర్ల, పోతవరం, కొయ్యలగూడెం మం డలం,గోపాలపురం, ద్వారకాతిరుమల, పెదవేగి, తాడేపల్లిగూడెం మండలంలోని లింగారాయు డుగూడెం, దండగర్ర, అమృతపురం, వెంకట్రా మన్నగూడెం, తెలికచర్ల, జగన్నపేట ప్రాం తాల్లో విస్తారంగా కూరగాయల సాగుచేస్తారు. ఈ ప్రాంతాల నుంచే ఇతర ప్రదేశాలకు కూర గాయలు ఎగుమతి జరుగుతుంది. ఈ ప్రాం తాల్లో వేసిన తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. తిరిగి మళ్లీ కాపుపట్టాలంటే సుమారు 15 రోజులకు పైగానే సమయం పడుతుంది.
దిగిరాని మహారాష్ట్ర ఉల్లి..
మహారాష్ట్ర రకం ఉల్లి ధరలు దిగిరావడం లేదు. కర్నూలు ఉల్లి మాత్రం సామాన్యులకు అందుబాటులోకి వచ్చింది. హోల్‌సేల్‌గా మహా రాష్ట్ర ఉల్లి క్వింటా రూ.4వేలు నుంచి 5వేల మధ్య విక్రయించారు. వీటిని రిటైలర్స్ కిలో రూ.60 చొప్పున విక్రయిస్తున్నారు. ఆది వారం మార్కెట్లో అమ్మేవారు మాత్రం రెండు రకాల ఉల్లిని కలిపి రెండు కిలోలు రూ.100లకు ఇస్తున్నారు. ఇప్పుడు తాడేపల్లి గూడెం మార్కెట్లోకి కర్నూలు ఉల్లి వస్తోంది. ఈ ఉల్లి హోల్‌సేల్‌గా క్వింటా రూ.2 వేలు నుంచి 4వేల మధ్యలో విక్రయిం చారు. మార్కె ట్లో అమ్మేవారు వీటిలో నాసిరకం ఉల్లిని రూ.100కు 4కిలోలు, నాణ్యమైన ఉల్లిని 100కు రూ.2 కిలోల వంతున విక్రయించారు. ఇటీవల కురిసిన వర్షాలకు కర్నూలు ఉల్లికి ఎఫెక్ట్ పడింది. దీంతో నేరుగా ఒడిస్సా, బెం గాల్‌కు తీసుకెళ్లేవారు నిల్వ ఆగని కారణంగా గూడెం మార్కెట్‌కు తీసుకొచ్చేస్తున్నారు. తాడే పల్లిగూడెం మార్కెట్లో నాలుగు రోజులుగా 20 నుంచి 30 వరకు లారీలు వస్తున్నాయి.
పెరుగుతున్న చికెన్ ధరలు..
అంతకంతకూ చికెన్ ధరలకు పెరుగుతూ పోతున్నాయి. ప్రతి వారం కిలోకు రూ.20 వం తున పెరుగుతోంది. కోల్ల సప్లై లేదనే సాకుతో కొంత మంది వ్యాపారులు కొనుగోలుదారులను దోచేస్తున్నారు. తాడేపల్లిగూడెం టూటౌన్‌లో కొన్ని చికెన్ సెంటర్లలో స్కిన్ లెస్ చికెన్ కిలో రూ.280 విక్రయించారు. విత్‌స్కిన్ రూ.260, లైవ్ కిలో రూ.160కు విక్రయిస్తే, తాడేపల్లి గూడెం వన్ టౌన్‌లో కిలో స్కిన్‌లెస్ చికెన్ రూ.300, విత్‌స్కిన్ చికెన్ రూ.280, లైవ్ రూ.165 అమ్మారు. పెంటపాడు ప్రాంతాల్లో స్కిన్‌లెస్ చికెన్ కిలో రూ.320, విత్‌స్కిన్ చికెన్ కిలో రూ.300, లైవ్ రూ.170 విక్రయించారని ఆ ప్రాంతవాసులు చెబుతున్నారు. అయితే బేర మాడితే మాత్రం స్కిన్‌లెస్ రూ.300కు ఇస్తు న్నారని చెబుతున్నారు. ఆయా ప్రాంతాల వారి అవసరాలను క్యాష్ చేసుకుంటూ ఆ ప్రాంత వ్యాపారులు దోచేస్తున్నారు. కూరగాయల ధర కిలోలో పరిశీలిస్లే.. ఇలా కింది విధంగా ఉన్నాయి.. వంకాయలు రూ.80, బీరకాయలు రూ.80, దొండకాయలు రూ.60, బెండకాయలు రూ.60, చిక్కుడు కాయలు రూ.200, బంగాళదుంపలు రూ.40, టమాటాలు రూ.60, కాప్సికం రూ.100, క్యారెట్ రూ.60, బీట్‌రూట్ రూ.60, కాకరకాయలు రూ.80, ఆగాకర రూ.160, దోసకాయలు రూ.60, పచ్చిమిర్చి రూ.60, పొట్లకాయ ఒక్కటి రూ.40, ముగకాడ జత రూ.20, అరటికాయలు జత రూ.15 పలికాయి.