Share News

భగ్గుమన్న కూరగాయలు

ABN , Publish Date - May 11 , 2026 | 12:07 AM

మా ర్కెట్లో కూరగాయల ధరలు భగ్గుమంటున్నా యి. గత వారంతో పోల్చుకుంటే కిలోకి రూ. 10నుంచి 20 పెరిగాయి.

భగ్గుమన్న కూరగాయలు

ఎండ తీవ్రతతో తగ్గిన కాపు.. పతనమైన ములగ.. మండుతున్న అల్లం

తాడేపల్లిగూడెం, మే 10(ఆంధ్రజ్యోతి): మా ర్కెట్లో కూరగాయల ధరలు భగ్గుమంటున్నా యి. గత వారంతో పోల్చుకుంటే కిలోకి రూ. 10నుంచి 20 పెరిగాయి. ఎండల తీవ్రత పెరగ డంతో కాపుతగ్గింది. దీనితో వీటి ధరలు పెరి గాయి. రెండు వారాలుగా ఎండ తీవ్రత ఎక్కు వగా ఉంది. కూరగాయలు పండించే తోటలు ఎండిపోతున్నాయి. దీనివల్ల దిగుబడి తగ్గి మార్కెట్‌కు సరుకు రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కొరత ఏర్పడింది. డిమాండ్‌కు తగ్గా సప్లయ్‌ లేకపోవడంతో ఒక్కసారిగా కూర గాయల ధరలు పెరిగాయి. రెండు నెలలుగా స్థిరంగా ఉన్న కూరగాయల ధరలు ఒక్క సారిగా ఈవారం పెరగడంతో వినియోగారులు ఆందోళన చెందుతున్నారు. తాడేపల్లిగూడెం మార్కెట్‌కు ఉమ్మడి పశ్చిమగోదారి జిల్లాలోని సిద్దాంతం, పెరవలి, ఖండవల్లి, యలమంచలి, అనంతపల్లి, నల్లజర్ల, దూబచర్ల, ఆవపాడు, శింగరాజపాలెం,గోపాలపురం, కొయ్యలగూడెం, లింగారాయుడుగూడెం, జగ్గన్నపేట, వెంకట్రా మన్నగూడెం వంటి ప్రాంతాల నుంచి సరఫరా అవుతోంది. ఇలాంటి ప్రాంతాల్లో కూడా ఎండ తీవ్రత వల్ల పూత ఎండిపోవడం, కాయలు చిన్నవిగా మారండం వంటి కారణంతో దిగు బడి తగ్గిపోయింది. దీంతో వీటి ధరలు పెరి గాయని హోల్‌సేల్‌, రిటైల్డ్‌ వ్యాపారులు చెబు తున్నారు. వంకాయలు రకం బట్టి కిలో రూ.60 నుంచి 80, బీరకాయలు రూ.40 నుంచి 60, బెండ రూ.60, దొండ రూ.40, దోస రూ.40, కాకర రూ.60, క్యాప్సికం రూ.80, కీర రూ.60, బీట్‌రూట్‌ రూ.60, క్యారెట్‌ రూ.60, టమాటా రూ.40 నుంచి 50, మిర్చి రూ.60, పొట్లకాయ రూ.40 ఆనబ రూ.20, అరటి జత రూ.10 విక్రయిస్తున్నారు.

నేలనంటిన ములగ ధర

ములగ ధర పతనమైంది. ఎన్నడూ లేని విధంగా కాయ రూ.5కు వ్యాపారులే ఇచ్చే స్తున్నారు. గతంలో వీటి ధర ఎక్కువగా ఉండ టంతో రైతులు వీటివైపు మరలారు. దీంతో సాగుపెరిగింది. కాపుకూడా ఎక్కువగా ఉండటంతో వీటి ధర పతనమైంది. వీటిని పండించే రైతులు గగ్గోలు పెడుతున్నారు. రైతుల వద్దనే కాయ రూ.2 నుంచి 3.5 మధ్యలో కొనుగోలు చేస్తున్నారంటే పరిస్థితి అర్దమవుతోంది.

అల్లం మంట

మార్కెట్లో అల్ల ధరలు మంటెత్తిస్తున్నాయి. కిలో రూ.80 నుంచి 100 మధ్య విక్రయించే అల్లం ధర ఇప్పుడు రూ.160 నుంచి 200 మధ్య విక్రయిస్తున్నారు. వాతావరణం అనుకూలించక ఈ సంవత్సరం అల్లం దిగుబడి తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పుడు బెంగళూరు నుంచి అల్లం దిగుమతి అవుతుంది..

నిలకడగా ఉల్లి

ఉల్లిధరలు మార్కెట్లో నిలకడగానే ఉన్నాయి. ఇప్పుడు మహారాష్ట్ర నుంచే ఉల్లి దిగుమతి అవుతోంది. క్వింటా ఉల్లి రూ.1000 నుంచి 1500 మధ్య హోల్‌సేల్‌గా ధర పలుకుతుంది. దీన్ని రిటైల్డ్‌ వ్యాపారులు నాణ్యమైన ఉల్లి రూ.100కు నాలుగు కిలోలు, మఽధ్యరకం ఉల్లి రూ.100కు 5కిలోల వంతున విక్రయిస్తున్నారు. ఇక ఆటోల్లో తిరిగి విక్రయించే వారు మధ్యరకం నాసిరకం ఉల్లిని కలిపి రూ.100కు 6కిలోల వంతున అమ్ముతున్నారు. ఇక మార్కెట్లో నాణ్యమైన ఉల్లి రావడం ప్రారంభమైంది. తాడేపల్లిగూడెం మార్కెట్‌కు మహారాష్ట్ర నుంచి 15 లారీల్లో 375 టన్నుల ఉల్లి వచ్చింది.

మార్కెట్‌ను ముంచెత్తిన

పచ్చడి మామిడి కాయలు

తాడేపల్లిగూడెం, మే 10(ఆంధ్రజ్యోతి): మార్కెట్లో పచ్చడి మామిడి కాయలు ఆదివారం ముచెత్తాయి. గత వారంతో పోల్చుకుంటే ఎక్కువ షాపులు వెలిశాయి. దీంతో రోడ్డు పొడవున రిటైల్డ్‌ వ్యాపారులు పిలిచి మరీ విక్రయాలు చేశారు. ఆవకాయ పచ్చడికి రారాజుగా ఉండే కొత్తపల్లి కొబ్బరి కాయలు తక్కువగా వచ్చాయి. వచ్చిన వాటికి మంగు(పేను)పట్టినవి ఎక్కువగా కనిపించింది. రాజమండ్రి సమీపంలోని గోకవరం నుంచి తెచ్చిన ఒక్కవ్యాపారి వద్ద మాత్రం నాణ్యమైన కొత్తపల్లి కొబ్బరి కాయలు కనిపించాయి. మిగిలిన వ్యాపారుల వద్ద మంగు పట్టి చిన్న సైజులో ఉన్న కొత్తపల్లి కొబ్బరి రకం కాయలు కనిపించాయి. వీటి ధరలు హోల్‌సేల్‌గా కాయ రూ.15 నుంచి 20 విక్రయించగా రిటైల్డ్‌ వ్యాపారులు వద్ద మా త్రం రూ.20నుంచి 30 మధ్య విక్రయించారు. పెద్దర సాలు హోల్‌సేల్‌గా కిలో రూ.15 నుంచి 20 అమ్మారు. వీటిని రిటైల్డ్‌గా కాయ రూ.20 నుంచి 25 మధ్య, సువర్ణరేఖ హోల్‌సేల్‌గా కిలో రూ.25 నుంచి 30 జరిగితే, రిటైల్‌గా కాయ రూ.15 నుంచి 20, చిన్నరసాలు కిలో హోల్‌సేల్‌గా రూ.25 నుంచి 30, రిటైల్డ్‌గా కాయ రూ.15 నుంచి 20 అమ్మారు. దేశవాళీ మామిడి కాయ రూ.10 నుంచి 15 మధ్య విక్రయించారు. ఐజర్లు, పాపారావు గోవా వంటి రకాలు కాయ రూ.15 నుంచి 20 మధ్య అమ్మకాలు సాగాయి.

Updated Date - May 11 , 2026 | 12:07 AM