భవన నిర్మాణ కార్మిక నేత వీరన్న మృతి
ABN , Publish Date - Mar 27 , 2026 | 12:24 AM
భవన నిర్మాణ కార్మిక సంఘ నేత, ఏ ఐటీయూసీ, సీపీఐ నాయకులు యింటి వీరన్న(86) గురువారం తణుకులోని ఆయన నివాసంలో మృతి చెందారు.
భవన నిర్మాణ కార్మిక నేత వీరన్న మృతి
తణుకు, మార్చి 26(ఆంధ్రజ్యోతి): భవన నిర్మాణ కార్మిక సంఘ నేత, ఏ ఐటీయూసీ, సీపీఐ నాయకులు యింటి వీరన్న(86) గురువారం తణుకులోని ఆయన నివాసంలో మృతి చెందారు. తాపీ పనిలో నూతన ఒరవడి సృష్టించారు. ఎంతో మంది శిష్యులను తీర్చిదిద్దారు. పట్టణ ప్రాంత భవన నిర్మాణ కార్మిక సంఘ నేత సుదీర్ఘకాలం పనిచేశారు. కార్మిక సంక్షేమ సంఘంలోను, సీపీఐలోనూ పనిచేశారు. వీరన్న భౌతికకాయానికి పార్టీ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు, పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు, సభ్యులు గార ప్రసాదులు పూల మాలలు వేసి నివాళుర్పించారు.