అనాథలపై.. వాత్సల్యం!
ABN , Publish Date - Jun 30 , 2026 | 12:41 AM
అనాఽథలను అక్కున చేర్చుకుని వారి జీవితాలకు భరోసాగా మిషన్ వాత్సల్య పథ కం నిలుస్తోంది. తల్లి లేదా తండ్రి లేకపోవ డం, సమాజంలో ఆలనాపాలనా కరువైన 18 ఏళ్లలోపు బాల, బాలికలకు ఈ పథకం ఓ వరం. 2021 వరకు ఇంటిగ్రేడేట్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్‌గా (ఐసీపీఎస్) ఉన్న దీనిని మిషన్ మోడ్ కింద మార్చారు.
మిషన్ వాత్సల్యకు భారీగా దరఖాస్తులు
జిల్లాలో 800కు పైగా అందిన వైనం
వడపోత దిశగా సీడీపీవోలు
ప్రతినెలా రూ.నాలుగు వేలు అందజేత
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
అనాఽథలను అక్కున చేర్చుకుని వారి జీవితాలకు భరోసాగా మిషన్ వాత్సల్య పథ కం నిలుస్తోంది. తల్లి లేదా తండ్రి లేకపోవ డం, సమాజంలో ఆలనాపాలనా కరువైన 18 ఏళ్లలోపు బాల, బాలికలకు ఈ పథకం ఓ వరం. 2021 వరకు ఇంటిగ్రేడేట్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్‌గా (ఐసీపీఎస్) ఉన్న దీనిని మిషన్ మోడ్ కింద మార్చారు. కరోనా కష్టంలో అనాఽథలను అక్కున చేర్చుకునేలా కేంద్రం పూర్తిస్థాయిలో అమలు చేయడానికి చర్యలు తీసుకోవడంతో చాలామంది పేదల జీవితాల్లో వెలుగులను నింపుతోంది.
2026–27 ఆర్థిక సంవత్సరానికి మిషన్ వాత్యల్స పథ కానికి సంబంధించి జిల్లాలో దరఖాస్తులు వెల్లు వెత్తా యి. 2024–25లో 412 మందికి లబ్ధి చేకూర్చగా, 2025– 26 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకంలో 600 మందికి నెలకు రూ.నాలుగువేల చొప్పున ఆర్థికసాయం అందిస్తు న్నారు. ఇటీవల బడ్జెట్ విడుదల కాగా ఒక్కొక్క రికి రూ.28 వేల చొప్పున నిధులను వారి ఖాతాలోకి జమ చేశారు. తాజాగా ఈ ఏడాది మార్చి నుంచి దర ఖా స్తుల స్వీకరణ ప్రారంభమైంది. జిల్లాలోని 10 అంగన్ వాడీ ప్రాజెక్టుల పరిఽధిలో ఇప్పటివరకు 800 దరఖా స్తులు అందాయి. వీటిని సీడీపీవో అధికారుల వారీగా దరఖాస్తులను పరిశీలించిన అర్హులను గుర్తించే పనిలో నిమగ్నం అయ్యారు.
18 ఏళ్లలోపు వారికి ఆధారం..
తల్లిదండ్రులు లేని పిల్లలు, తల్లి లేదా తండ్రి లేని వారు,హెచ్‌ఐవీతో బాధపడుతున్న తల్లిదండ్రులు, జైలు శిక్ష అనుభవిస్తున్న తల్లిదండ్రుల పిల్లలను మిషన్ వాత్సల్య పథకంలో ఎంపిక చేసి కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా సహకారం అందిస్తోంది. ఆరేళ్ల నుంచి 18 ఏళ్లలోపు నిండే వరకు ఈ పథకం కింద రూ.నాలుగు వేల చొప్పున ప్రతినెల వారి అవసరాలను తీర్చుతోంది. జిల్లాలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి 800 దరఖా స్తులు రాగా వాటి పరిశీలన జరుగుతోంది. ప్రధానంగా గ్రామాల్లో గ్రామ మహిళా సంరక్షణాధికారి ద్వారా దరఖాస్తులను బాల,బాలికలు తీసుకుని పూర్తి చేసి అందిస్తారు. అనంతరం మండలస్థాయిలో మండల కమిటీ పర్యవేక్షణలో సీడీపీవోకు దరఖాస్తులను అర్హత కోసం పంపుతారు. వారు క్షేత్రస్థాయిలో విచారణలు పూర్తి చేసి మిషన్ వాత్సల్య నిర్వహణ కమిటీ చైర్మన్‌గా ఉన్న కలెక్టర్‌కు నివేదిస్తారు. ఆమె ఆధ్వర్యంలో ఒక కమిటీ ఐసీడీఎస్ పీడీ, జిల్లా బాలల సంరక్షణాధికారి, సీడబ్ల్యూసీ మెంబర్, ఒక ఎన్జీవోలు పరిశీలించి తుది జాబితాను ఆమోదించి పంపుతారు. ప్రభుత్వం విడుదల చేసే బడ్జెట్ ఆధారంగా నెలకు లేదా మూడు నుంచి ఆర్నెళ్లలోపు అనాఽథలకు, వారి తాలూకా బంధువుల పర్యవేక్షణలో ఆయా మొత్తాలను జమ చేస్తుంటారు.
బాలల భవితకు దోహదం
జిల్లాలో మిషన్ వాత్సల్య పథకం 18 ఏళ్లలోపు సమాజంలో నిరాదరణ, ఆలనాపాలనా కరువైన వారికి జీవితంతపై భరోసా కల్పించేందుకు చాలా దోహద పడుతోంది. అనారోగ్య సమస్యలు, పుస్తకాలు, ఇతర చిన్నపాటి అవసరాలకు ప్రతినెలా రూ.నాలుగు వేలు వారికి అందడం అనేది శుభ పరిణామం. జిల్లాలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలతో మిషన్ వాత్సల్య పథకాన్ని ఐసీడీఎస్ పీడీ శారద ఆధ్వర్యంలో మా టీమ్ ముందుకు తీసుకెళుతోంది. ఇప్పుడు వచ్చిన దరఖాస్తులను స్ర్కూట్నీ చేసి ప్రభుత్వానికి నివేది స్తాం. దాని ప్రకారం ఎంత మందికి బడ్జెట్ విడుద లైతే వారికి అందించేందుకు చర్యలు చేపడతాం.
– డాక్టర్ సీహెచ్ సూర్యచక్రవేణి, డీసీపీవో