Share News

విస్తృతంగా ఆపరేషన్‌ వజ్ర ప్రహార్‌

ABN , Publish Date - Mar 08 , 2026 | 12:50 AM

ఆపరేషన్‌ వజ్రప్రహార్‌లో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కార్డన్‌ చర్చి విస్తృతంగా నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో శనివారం వేకువజాము నుంచే కార్డన్‌ చర్చ్‌ జరిగింది.

విస్తృతంగా ఆపరేషన్‌ వజ్ర ప్రహార్‌
విస్తృతంగా ఆపరేషన్‌ వజ్ర ప్రహార్‌

ఉమ్మడి జిల్లాలో ఏకకాలంలో మెగా కార్డన్‌ సెర్చ్‌

మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా తనిఖీలు

ఇరు జిల్లాల్లో భారీగా మోటార్‌ సైకిళ్ల స్వాధీనం

ఏలూరు క్రైం/పోలవరం, మార్చి 7(ఆంధ్రజ్యోతి): ఆపరేషన్‌ వజ్రప్రహార్‌లో భాగంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కార్డన్‌ చర్చి విస్తృతంగా నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో శనివారం వేకువజాము నుంచే కార్డన్‌ చర్చ్‌ జరిగింది.ఏలూరు సమీపంలోని తంగెళ్ళమూడి, కబడ్డీ కాలనీ, పోలవరం కొత్తపేటలోని బాపూజీ కాలనీ, జంగారెడ్డిగూడెంలోని రాముడుగుంట చెరువు పరిసర ప్రాంతాలు, నూజివీడులోని ఎంఆర్‌ అప్పారావు కాలనీలో తనిఖీలు కొనసాగించారు. జిల్లా అదనపు ఎస్పీ ఎన్‌ సూర్యచంద్రరావు, ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్‌, పోలవరం డీఎస్పీ ఎం.వెంకటేశ్వర రావు, నూజివీడు డీఎస్పీ కేవీవీఎన్‌వీ ప్రసాద్‌, సీఐలు, ఎస్‌ఐలు, ఈగల్‌ టీమ్‌ ఆర్‌ఎస్‌ఐ ఉదయ భాస్కర్‌ వారి సిబ్బంది ఈ తనిఖీలను కొనసా గించారు. మాదక ద్రవ్యరహిత జిల్లాగా తీర్చిది ద్దేందుకు అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. ప్రతి వాహనానికి సం బంధించిన రికార్డులను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. ఏలూరు కబడ్డీ కాలనీలో రికార్డులు లేని 30మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పోలవరం మండలం కొత్తపేట గ్రామంలో ఎస్‌ఐ పవన్‌ కుమార్‌ తనిఖీలు చేసి 25 మోటార్‌ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. జంగారెడ్డి గూడెంలోని రాముడుకుంట చెరువు ప్రాంతంలో ఏఎస్పీ సుస్మిత ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిం చారు. సిఐ ఎంవి.సుభాష్‌, ఎస్‌ఐలు ఎన్‌.వీర ప్రసాద్‌, సతీష్‌ కుమార్‌, చిన్నారావు, వెంకన్న, సిబ్బంది పాల్గొన్నారు.

భీమవరం, తాడేపల్లిగూడెంలో..

భీమవరం క్రైం: పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి సారథ్యంలో జిల్లా వ్యాప్తంగా శనివారం ‘మెగా కార్డన్‌ సెర్చ్‌ నిర్వహిం చారు. రాష్ట్ర వ్యాప్తంగా మాదక ద్రవ్యాల నిర్మూలనకు శ్రీకారం చుట్టిన ‘ఆపరేషన్‌ వజ్ర ప్రహార్‌’లో భాగంగా జిల్లాలోని అన్ని సబ్‌ డివిజన్ల పరిధిలో ఈ సోదాలు జరిగాయి. భీమవరం డీఎస్పీ రఘువీర్‌ విష్ణు, తాడేపల్లిగూడెం డీఎస్పీ డి.విశ్వనాథ్‌ల నేతృత్వంలో సుమారు 106 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో కూడిన ప్రత్యేక బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి. ముఖ్యంగా డ్రగ్స్‌ విక్రయాలకు ఆస్కారం ఉన్న హాట్‌ స్పాట్లు, విద్యార్థుల హాస్టళ్ళు, పీజీ నివాసాలు, లాడ్జిలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు,గూడెంలో టిడ్కో సముదాయంలో జల్లెడ పట్టారు. ఈ క్రమంలో మొత్తం 445 గృహాలను క్షుణ్ణంగా తనిఖీ చేయడంతోపాటు సరైన ధృవీకరణ పత్రాలులేని 65 మోటార్‌ సైకిళ్ళను గుర్తించి సీజ్‌ చేశారు. పాత నేరస్తుల నివాసాల్లోనూ సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్‌ అధికారులు ప్రజలకు, యువతకు మాదకద్రవ్యాల వల్ల కలిగేశారీరక, మానసిక, చట్టపరమైన అనర్థాలపై అవగాహన కల్పించారు.మత్తు పదార్థాల అక్రమ రవాణా గురించి సమాచారం తెలిస్తే ఏపీ ఈగల్‌ టోల్‌ఫ్రీ నంబర్‌ 1972కు ఫిర్యాదు చేయాలన్నారు. సమాచారం అందిం చిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు.

Updated Date - Mar 08 , 2026 | 12:50 AM