యూరియా మాఫియా!
ABN , Publish Date - Aug 04 , 2026 | 12:57 AM
కుక్కు ూరు మండలంలో యూరియా పంపిణీలో ఎన్నో అక్రమాలు జరుగుతు న్నాయి. భూమితో పనిలేదు.. కేవలం ఆధార్‌కార్డు ఉంటే చాలు. యూరియా విక్రయాలు జరిగిపోతున్నాయి.
భూమి లేకున్నా.. ఆధార్ ఉంటే చాలు..!
యూరియా విక్రయాల్లో అక్రమాలు
అధిక ధరలకు అమ్ముతూ రైతులను దోచుకుంటున్న వ్యాపారులు
ఏలూరు ఎంపీకి టీడీపీ నాయకుల ఫిర్యాదు.. ఏవోపై చర్యలకు ఆదేశం
కుక్కునూరు, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): కుక్కు ూరు మండలంలో యూరియా పంపిణీలో ఎన్నో అక్రమాలు జరుగుతు న్నాయి. భూమితో పనిలేదు.. కేవలం ఆధార్‌కార్డు ఉంటే చాలు. యూరియా విక్రయాలు జరిగిపోతున్నాయి. ప్రజల ఆధార్ కార్డ్‌కి ఫోన్ నంబర్ లింకై ఉంటే చాలు. వాటి ద్వారా వ్యాపారులు, అక్రమార్కులు యూరియా దోపిడీకి తెరలేపారు.
రైతు సేవా కేంద్రాలకు అధిక సంఖ్యలో ఆధా ర్ కార్డులను తీసుకెళ్లడం, భూమి ఉన్నట్లు చూ పించడం, పత్తి విత్తనాలు కొనుగోలు చేసినట్టు రసీదు చూపించి ఫోన్‌న నంబర్ ఓటీపీతో యాప్‌లో పేర్లు నమోదు చేయిస్తున్నారు. అనంతరం ఎరువుల దుకాణం నుంచి ఈ–పాస్ ద్వారా అత్యంత సులువుగా యూరియాను పొందుతున్నారు. ఈ దోపిడీలో వ్యాపారులదే కీలకపాత్ర కావడంతో వారి దగ్గరే పత్తి విత్తనా లు కొనుగోలు చేసినట్టు బిల్లులు రూపొం దిస్తు న్నారు. ఉప్పేరుతో పాటు మరికొన్ని ప్రాం తా ల్లోని ఎరువుల వ్యాపారులు యూరియా దందా లో ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఇలా అక్రమంగా పొందిన యూరియాను తెలం గాణ లోని పలు ప్రాంతాలకు యథేచ్ఛగా రవాణా చేస్తున్నారు. వ్యవసాయాధికారులు లాగిన్ ఓపెన్ చేసి చూస్తే ఏ వ్యక్తి ఆధార్‌కార్డు ద్వారా ఎంత యూరియా తీసుకున్నారో కచ్చితంగా బయటపడుతుంది. భూమి తక్కువగా ఉన్న ఓ ఇంటిలోని నలుగురు కుటుంబ సభ్యుల పేరు మీద 40 బస్తాల యూరియా తీసుకున్నారంటే ఏ మేర అక్రమాలు జరిగాయో అర్థమవుతుంది. అమాయక గిరిజనుల పేరుతో వారి ఆధార్ కార్డులు తీసుకొచ్చి యూరియాను పొంది తెలం గాణ ప్రాంత రైతులకు అమ్ముకోవడంలో వ్యాపా రులు, అక్రమార్కుల పాత్ర ఉంది. ఈ దోపిడీలో వ్యవసాయ సిబ్బంది పాత్ర సైతం ఉందని రైతాంగం ఆరోపిస్తున్నారు.
అధిక ధరలకు యూరియా అమ్మకం
మండలంలో ఎరువుల వ్యాపారులు రైతాంగా న్ని దోచుకుంటున్నారు. ప్రభుత్వ యాప్ ద్వారా యూరియాను పొందడానికి అర్హులైన రైతులు ఏ ఎరువుల దుకాణానికైనా వెళ్లి తీసుకొవచ్చు. ప్రభుత్వం సబ్సిడీపై యూరియా బస్తాను రూ.267లకు అందిస్తుంది. కానీ వ్యాపారులు రూ.350కి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నా రు. దీనిపై వ్యవసాయాధికారి బాలాజీకి ఫిర్యా దు చేసినా పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. జిల్లా వ్యవసాయ శాఖాధికారు లు స్పందించి యూరియా అక్రమాలపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.
వేసవిలోనే వందలాది బస్తాల తరలింపు
ప్రభుత్వ యాప్ ద్వారా యూరియా అమ్మ కాలు జరుపుతుందని ముందే సమాచారం తెలుసుకున్న వ్యాపారులు వేసవి నుంచే అక్రమాలకు పాల్పడ్డారు. తమ అనుకూలమైన రైతులకు వందలాది యూరియా బస్తాలను అమ్మినట్టు రికార్డులు చూపించి తరలించేశారు. ఈ క్రమంలో యూరియా బస్తాను రూ.400–రూ500కి అమ్ముకుని వ్యాపారులు సొమ్ము చేసుకున్నారు. గతేడాది నిల్వ ఉన్న ఎరువులను సైతం పాత ధరలకు అమ్మకుండా కొత్త ధరలకు అమ్ముతూ దోచేస్తున్నారు.
ఈ యాప్ ద్వారానే యూరియా అమ్మకాలు..
కుక్కునూరు మండలంలో యూరియా అమ్మకాలు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏపీ ఏఐఎంఎస్ 2.0 యాప్ ద్వారా జరుగుతున్నట్టు జిల్లా వ్యవసాయాధికారి హబీబ్‌బాషా తెలిపారు. సోమవారం ‘ఆంధ్రజ్యోతి’లో ‘యూరియాకు రెక్కలు’ శీర్షికన వచ్చిన కథనంపై స్పందిస్తూ వివరణ ఇచ్చారు. రైతుల భూములకు సంబంధించి వెబ్‌ల్యాండ్‌లో ఓపెన్‌లో లేనందున నాన్ వెబ్‌ల్యాండ్‌లో నమోదు చేసి యూరియా సరఫరా చేస్తున్నామన్నారు. ప్రతి రైతుకు ఓటీపీ లేదా వేలిముద్ర వేసిన తరువాతే యూరియా ఇస్తున్నామన్నారు. యూరియా తెలంగాణకు రవాణ అవడం అవాస్తమన్నారు. ఇదిలా ఉండగా ఉప్పేరు నుంచి అక్రమంగా తెలంగాణలోని దంతెలబారు ప్రాంతానికి యూరియా రవాణా జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి. అక్కడ నుంచి మరి కొందరు బ్రోకర్లు ఇతర ప్రాంతాలకు యూరియాను అమ్మి సొమ్ము చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఒక్కొ యూరియా బస్తా చేతులు మారుతూ రూ.400 నుంచి రూ.800 వరకు అమ్మకాలు సాగిస్తున్నట్టు సమాచారం.
ఏలూరు ఎంపీకి ఫిర్యాదు
మండలంలో జరిగిన యూరియా అక్రమా లపై సోమవారం ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌కుమార్ యాదవ్‌ను స్థానిక టీడీపీ నాయకులు కలిసి వివరించారు. వందలాది యూరియా బస్తాలను తరలి వెళ్లిపోవడానికి మండల వ ్యవసాయాధికారి బాలాజీ కారణమని టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు ములిశెట్టి నాగేశ్వరరావు ఫిర్యాదు చేశారు. రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని ఎంపీని కోరారు. దీనిపై ఎంపీ స్పందిస్తూ ఏవో బాలాజీపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయా ధికారి హబీబ్‌బాషాను ఆదేశించారు. రైతాం గానికి యూరియా అందుబాటులో ఉంచి సరఫరా చేయాలన్నారు.