Share News

కొనాల్సిందే..!

ABN , Publish Date - Jan 05 , 2026 | 12:45 AM

జిల్లాలో యూరియా నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. సొసైటీల్లో యూరియా కోసం రైతులు ఎగబడుతున్నారు.

కొనాల్సిందే..!

యూరియాతో గుళికలు, జింక్‌ విక్రయాలు

డిమాండ్‌ను సొమ్ము చేసుకుంటున్న కంపెనీలు

వ్యాపారులు, రైతులకు ఇబ్బందులు

జిల్లాలో 10 వేల టన్నుల యూరియా నిల్వలు

పోర్టుల్లో 4 లక్షల టన్నులు సిద్ధం

జిల్లాలో యూరియా నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. సొసైటీల్లో యూరియా కోసం రైతులు ఎగబడుతున్నారు. మార్కెట్‌లో యూరియాకు నెలకొన్న డిమాండ్‌ను ఎరువుల కంపెనీలు సొమ్ము చేసుకుంటున్నాయి. ప్రైవేటు వ్యాపారుల వద్ద యూరియా కొనుగోలు చేస్తున్న రైతులు గుళికలు, జింక్‌ కొనాల్సిందేనని షరతు పెడుతున్నాయి. ప్రస్తుతం యూరియా సరఫరాలో ఇదో పెద్ద సమస్యగా మారింది.

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

జిల్లాలో వరి సాగుకు సరిపడా యూరియాను ప్రభుత్వం అందుబాటులో ఉంచినా ప్రతినెలా కోటాకు సరిపడా యూ రియా తెప్పించడం సమస్యగా మారింది. రైతులు ఎక్కువ సంఖ్యలో యూరియా కొనుగోలు చేయడంతో వ్యాపారులు గుళికలు, జింక్‌ కొనుగోలు చేయాలని షరతు విధిస్తున్నారు. జింక్‌, గుళికలతో పంటకు ప్రయోజనం ఉన్నా కంపెనీలు దీనిపై అవగాహన కల్పించాలి. యూరియాతో ఇతర ఎరువుల లింక్‌పై అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది. జిల్లాలో మార్క్‌ఫెడ్‌, వ్యాపారుల వద్ద దాదాపు 10వేల టన్నుల యూరియా నిల్వ ఉంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు మరో నాలుగు వేల టన్నుల యూరియా ఒకటి రెండు రోజుల్లో రానుంది.

ఎగబడడంతోనే సమస్య

రైతులు తమకు అవసరమైన ఎరువును ప్రస్తుత అవస రం మేరకు కాకుండా సీజన్‌ మొత్తానికి ఒకేసారి కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు దీనిపై అవగాహన కల్పిస్తున్నారు. అయినప్పటికీ రైతుల తొందరపాటును దృష్టిలో ఉంచుకుని కంపెనీలు వ్యాపారుల కు లింక్‌ ఎరువులను కట్టబెడుతున్నాయి. ముఖ్యంగా యూ రియా విషయంలోనే ఇలా చేస్తున్నాయి. లింక్‌ ఎరువును తీసుకోకుంటే యూరియా ఇవ్వడం లేదు. సొసైటీల ద్వారా యూరియా నేరుగా విక్రయిస్తున్నారు. వ్యాపారులకు ఎం ఆర్‌పీకే వ్రియించడంతో రవాణా, దింపుడు చార్జీల భారం వ్యాపారులపై పడుతోంది. దానికి తోడు లింక్‌ ఎరువులను ముడిపెడుతున్నారు. రైతులు దీనిని పెద్దగా పట్టించుకో వడం లేదు. కాంప్లెక్స్‌ ఎరువుల ధరలు అధికంగా ఉంటున్నాయి. యూరియా అం దుబాటులో ఉండడంతో ప్రైవేటు వ్యాపారుల నుంచి కొనుగోలు చేసుకుంటున్నారు. ఈసారి కేంద్రం యూరియా తగ్గింపు కోసమని ఎప్పటిక ప్పుడు కోటా విడుదల చేస్తోంది. అధిక వినియోగం వల్ల భూస్వభావం కోల్పోతోందని కేంద్రం భావిస్తోంది. ఫలితంగా కోటా ప్రకారం మంజూరు చేస్తోంది. దీనిని పట్టించుకో కుండా రైతులు ఒకేసారి కొనుగోలుకు ప్రయత్నం చేస్తున్నా రు. సొసైటీల్లో తక్కువ ధరకు లభ్యమవుతుందని వాటిపైనే అధికంగా ఆధారపడుతున్నారు. ప్రభుత్వ స్థాయిలోనే కంపె నీల లింకు ఎరువులపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. మరోవైపు ముందస్తుగానే నిల్వ చేసుకుంటే రైతులు ఎగబడే పరిస్థితి ఉండదు.

పోర్టుల్లో సిద్ధంగా ఉన్న యూరియా

విశాఖపట్నం. గన్నవరం, కాకినాడ, కృష్ణపట్నం ఓడరే వుల్లో 4 లక్షల టన్నుల యూరియా సిద్ధంగా ఉంది. ఓడ రేవుల్లో నిల్వ ఉన్న యూరియాను రప్పించుకునే ప్రయ త్నం చేస్తే జిల్లాలో సజావుగా విక్రయాలు జరిగే పరిస్థితి నెలకొంటుంది. కాంప్లెక్స్‌ ఎరువుల విషయంలో కంపెనీలే ముందస్తుగా నిల్వ చేసుకుంటున్నాయి. యూరియా విషయంలోనే వెనుకంజ వేస్తున్నాయి.

జిల్లాలో ఇంకా 20వేల టన్నుల యూరియా అవసరం కానుంది. జనవరిలో 10వేల టన్నులు, ఫిబ్రవరిలో 10వేల టన్నుల వినియోగిస్తే సరిపోతుంది. ప్రస్తుతం 10వేల టన్ను లు సిద్ధంగా ఉన్నాయి. ఫిబ్రవరిలో అవసరమైన ఎరువుల ను కూడా ఇప్పుడే దిగుమతి చేసుకోవడానికి జిల్లా అధికా రులు ప్రణాళిక చేసుకున్నారు. రైతుల్లోనూ ఇప్పుడిప్పుడే దీనిపై అలజడి తగ్గింది. పోర్టుల్లో ఉన్న ఎరువులను ముందస్తుగా ప్రభుత్వం సరఫరా చేస్తే లింక్‌ సమస్య ఉండదంటూ వ్యాపారులు, రైతులు కోరుతున్నారు.

Updated Date - Jan 05 , 2026 | 12:45 AM