వికసిత్ గ్రామాలే..లక్ష్యంగా..!
ABN , Publish Date - Jan 04 , 2026 | 01:04 AM
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టం స్థానంలో వికసిత భారత్– 2047 దార్శనికతకు అనుగుణంగా వికసిత్ భారత్ – రోజ్ గార్ అజీవికా మిషన్ (గ్రామీణ) (వీబీ జీ రామ్ జీ ) చట్టం –2025ను కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి శాఖ అందు బాటులోకి తీసుకొచ్చింది.
వీబీ జీ రామ్ జీ చట్టంపై ప్రత్యేక గ్రామ సభలు
రేపు 547 పంచాయతీల్లో ఒకేసారి నిర్వహణ
ఏలూరుసిటీ, జనవరి 3(ఆంధ్రజ్యోతి):
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టం స్థానంలో వికసిత భారత్– 2047 దార్శనికతకు అనుగుణంగా వికసిత్ భారత్ – రోజ్ గార్ అజీవికా మిషన్ (గ్రామీణ) (వీబీ జీ రామ్ జీ ) చట్టం –2025ను కేంద్ర ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి శాఖ అందు బాటులోకి తీసుకొచ్చింది. కొత్త చట్టంలోని ముఖ్య అంశాలు, చట్టపర హక్కుల గురించి అవగాహన కల్పిం చడానికి రాష్ట్రంలోని అన్ని పంచాయతీ ల్లో ఈనెల 5వ తేదీన రాష్ట్రమంతటా ఒకేసారి గ్రామ సభలు నిర్వహించాలని నిర్ణయించారు.
జిల్లా లోని 547 పంచాయతీల్లో ఈ గ్రామ సభలు జరగనున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నా రు. ఈ చట్టాన్ని ఉపాధి శ్రామికుల ఉపాధి కోసం, స్థిరమైన జీవనోపాధి అవకాశాలకు ప్రాధాన్యతతో పాటు, సామాజిక, ఆర్థిక సాధికా రితను మరింత బలోపేతం చేయడయే లక్ష్యం గా పెట్టుకుని ఈ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది.ఈ చట్టంపై అవగాహన కోసం కరపత్రాలు, పోస్టర్లు, హోర్డింగులు తయారు చేసుకుని ప్రతి గ్రామ సభ వేదిక వద్ద ఉంచాలి. ప్రభుత్వ కార్యాలయాలు, కమ్యూనిటీ హాల్స్, గ్రామ పంచాయతీ భవనాలు, గ్రామసభ జరిగే ప్రదే శాల్లో పోస్టర్లు ప్రదర్శించాలి. గ్రామ ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేసి చట్టంపై విస్తృత అవగాహన కల్పించాలని రాష్ట్ర గ్రామీ ణాభివృద్ధి శాఖ కమిషనర్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు, డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.
చట్టంలోని ప్రధాన అంశాలు
ఉపాధి కూలీలకు 125 రోజులు ఉపాధి హామీ. గ్రామ సభల ద్వారా వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళిక (విజిపిపి) రూపొందిస్తా రు. శక్తివంతమైన నిరుద్యోగ భృతి ఏర్పాటు ఈ చట్టం ద్వారా కలుగుతుంది. వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికలో అన్ని పథకాలు అను సంధానం చేస్తారు. నిర్ణీత సమయాల్లో చెల్లిం పులు, ఆలస్యానికి పరిహారం వసూలు చేస్తారు. సాంకేతిక పరిజ్ఞానంతో శక్తివంతంగా ఈ చట్టాన్ని అమలు చేయనున్నారు. మెరుగైన హామీ, ధృఢమైన నిబద్దత, సమర్థపాలన వంటి అంశాలే వికసిత్ భారత్‌గా పేర్కొన్నారు.
గ్రామ సభలకు ఏర్పాట్లు
జిల్లాలోని 547 గ్రామ పంచాయతీల్లో ఈనెల 5వ తేదీన వీబీ– జీ రామ్‌జీ చట్టంపై అవగాహన కల్పించడానికి ప్రత్యేక గ్రామ సభల నిర్వహణకు ఏర్పాట్లు చేశాం. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ చట్టం స్థానే వీబీ జీ రామ్‌జీ చట్టం వచ్చింది. ఇందులో పేర్కొన్న మార్గదర్శకాలను ప్రజలకు సమగ్రంగా వివరిస్తాం. గ్రామాల్లో చేపట్టాల్సిన పనులు, ఇతర అంశాలపై ఈ గ్రామ సభల్లో చర్చించి వికసిత్ భారత్ గ్రామ పంచాయతీ ప్రణాళికను రూపొందిస్తాం.
– కేవీ సుబ్బారావు, డ్వామా పీడీ