పాతాళంలో జలం!
ABN , Publish Date - Apr 14 , 2026 | 12:17 AM
జిల్లాలో భూగర్భజలాలు అట్టడుగుకు చేరాయి. పలు మండలాల్లో పాతాళంలోకి నీటిమట్టాలు పడి పోయాయి. రాబోయే రోజుల్లో ఇదే పరిస్థితి కొనసాగి తే రైతులు బోర్లకు విద్యుత్ వినియోగం పెంచుకోవా ల్సిన దుస్థితి నెలకొంది.
జిల్లాలో భారీగా పడిపోయిన భూగర్భ జలాలు
పైకి ఉబికి వచ్చేదెన్నడో..
జిల్లా సగటు 21.23 మీటర్లు
ఐదు మండలాల్లో ప్రమాద ఘంటికలు
జలధారే దారి చూపాలి
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
జిల్లాలో భూగర్భజలాలు అట్టడుగుకు చేరాయి. పలు మండలాల్లో పాతాళంలోకి నీటిమట్టాలు పడి పోయాయి. రాబోయే రోజుల్లో ఇదే పరిస్థితి కొనసాగి తే రైతులు బోర్లకు విద్యుత్ వినియోగం పెంచుకోవా ల్సిన దుస్థితి నెలకొంది. ఇప్పటి వరకు భూగర్భజలం పైకి తీసుకువచ్చేలా ఏ ప్రణాళిక రచన సాగలేదు. ఇటీవల ప్రభుత్వం జలధార కింద 100 రోజుల ప్రణా ళిక చేపట్టింది. దీనివల్ల భూగర్భ జల మట్టాలు పెరు గుతాయని భావిస్తున్నారు. ప్రధానంగా పంట కుంటలు, మైనర్ ఇరిగేషన్ చెరువుల ఆక్రమణల తొలగింపు తదితర పనులు గతంలో జరిగిన ఉపాధి హామీ పనుల్లో చేసి ఉంటే మెట్ట మండలాలకు ఈ దుస్థితి తలెత్తిది కాదు.
మరింతగా దిగజారే..
జిల్లాలో సగటు భూగర్భ జల మట్టాలు ఈ ఏడా ది మార్చి నెలాఖరు నాటికి 21.23 మీటర్ల దిగువకు పడిపోయాయి. గతేడాది మార్చి నాటికి 18.13 సగటు ఉండగా.. అది మరింత లోతుగా దిగజారాయి.ఈ శాఖపరంగా భూగర్భజలాలు వృద్ధి చేయడానికి నిధు లు ఖర్చు చేసే పరిస్థితి లేదు. నివేదికలు తయారు చేసి... వివిధ శాఖలను అప్రమత్తం చేయడానికే పరిమితం అయ్యింది. అంతకుముందు రీచార్జి బావు లను ఈ శాఖ ఆధ్వర్యంలో నిర్మించేవారు. రానురాను వీటిని ఎక్కడ నిర్మించలేని దుస్థితి. రైతులు స్వయం గా రీచార్జి బావులను నిర్మించుకోవడం వల్ల ఆయా పంట పొలాలకు విద్యుత్ ఖర్చు కొంత తగ్గుతోంది.
ఐదు మండలాల్లో ప్రమాదకరం
జిల్లాలో ఐదు మండలాల్లో గత కొద్దినెలలు కంటే భారీగా నీటి మట్టాలు ప్రమాదస్థాయికి పడి పోయా యి. ద్వారకాతిరుమలలో 54.51 మీటర్లు, ముసు నూరు 53.39 మీటర్లు, దెందులూరు 45.53, కొయ్యలగూడెం 44.87, కామవరపుకోట 36.71 మీటర్ల మేర దిగజారాయి.
ఈ మండలాలు సమస్యాత్మకమే..
పెదవేగిలో 26.92, పెదపాడు 24.36, లింగపాలెం 24.04, ముదినేపల్లి 21.57, ఉంగుటూరు 21.1 మండ వల్లి 20.07, ఏలూరు రూరల్ 17.25,చింతలపూడి 17.01, నూజివీడు 16.86, టి.నరసాపురంలో 15.14, జంగారెడ్డిగూడెం 13.12, చాట్రాయి 12.08, జీలుగుమిల్లి 10.98, ఆగిరిపల్లి 9.36, భీమడోలు 9.48 మీటర్ల లోతులో నీటి మట్టాలున్నాయి. కాగా గోదావరి పరీవాహక ప్రాంతంలోని మండలాలైన పోలవరం 4.68, వేలేరుపాడు 4.46, కుక్కునూరు 4.74 మీటర్లతో కొంత ఫరవాలేదు.
ప్రతిపాదనలు పంపండి : కలెక్టర్
ఏలూరు రూరల్ : జిల్లాలో ‘నీటి భద్రత – సాగు నీటి సంఘాల బాధ్యత’ కార్యక్రమం ద్వారా గ్రామాల నుంచి వచ్చిన చేపట్టాల్సిన పనులకు సంబంధించి ప్రతిపాదనలను వెంటనే సమర్పించా లని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఇరిగేషన్ శాఖాధి కారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి ఇరిగేషన్ శాఖాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించా రు. ఆమె మాట్లాడుతూ నీటి పరిరక్షణ, భూగర్భ జలాల పెంపు లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తు న్నట్టు తెలిపారు. వర్షాకాలం సీజన్ ప్రారంభం నాటికి నీటి వనరుల న్నింటినీ పూర్తి నీటి నిల్వ సామర్థ్యంతో సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో ఇరిగేషన్‌శాఖ ఏలూరు ఎస్‌ఈ దేవప్రకాశ్, భూ గర్భ జల శాఖాధికారి కోదండరావు, ఇరిగేషన్ శాఖ డీఈలు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.