Share News

ఈ ఏడాది మంచి పాలనకు సానుకూలం

ABN , Publish Date - Mar 20 , 2026 | 12:40 AM

‘శ్రీ పరాభవ నామ సంవత్సరం దేశం సుభిక్షంగా ఉండబోతోంది.

ఈ ఏడాది మంచి పాలనకు సానుకూలం
ప్రముఖులను సత్కరించిన కలెక్టర్‌ నాగరాణి

సోమయాజులు ఘనాపాఠి పంచాంగ పఠనం

కలెక్టరేట్‌లో ఘనంగా ఉగాది వేడుకలు.. పలువురికి సత్కారం

భీమవరం టౌన్‌, మార్చి 19(ఆంధ్రజ్యోతి): ‘శ్రీ పరాభవ నామ సంవత్సరం దేశం సుభిక్షంగా ఉండబోతోంది. రక్షణ, సాంకేతిక రంగాలు బలో పేతం అవుతాయి. ఈ ఏడాది రాజు గురువు, మంత్రి కుజుడు కావడం వల్ల మంచి పరిపాలన కు సానుకూలం. వర్షాలు అనుకూలం. పరాభవం అంటే చాలా మంది ఎన్నో అర్థాలు చెబుతున్నా రు. అమ్మ వారి అంశగా పరాభవ నామ సంవ త్సరం ఉంది కాబట్టి అమ్మ వారి ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి’ అని ఈమని రామచంద్ర సోమయాజులు ఘనాపాఠి అన్నారు. భీమవరం కలెక్టరేట్‌లో గురువారం జరిగిన శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలలో ఆయన మాట్లాడారు. కలెక్టర్‌ నాగరాణి మాట్లాడుతూ ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో, ఆయురా రోగ్యాలు, పాడి పంటలతో వృద్ధి చెందాలని ఆకాంక్షించారు. చిన్నారుల నృత్య ప్రదర్శన, విద్యార్థుల భువన విజయం ఆకట్టుకు న్నాయి. ఈ సందర్భంగా వివిధ రంగా ల్లో విశేష ప్రతిభ కనబరిచిన కవులు, రచయితలు, కళాకారులను సత్కరించారు. తెన్నేటి లక్ష్మీనరసింహమూర్తి, డాక్టర్‌ గుత్తి వెంకట సుబ్రహ్మణ్యశాస్త్రి, డాక్టర్‌ పింకీ విజయ్‌కుమార్‌ నిర్వహించిన కవి సమ్మేళనం అబ్బుర పరిచింది. దేవదాయ శాఖ తరపున అర్చకులు, వేద పండితులను సత్కరించారు. వేద పండితులు కలెక్టర్‌కు వేద ఆశీర్వచనాలు అందజేశారు. డీఆర్వో బి.శివన్నారాయణరెడ్డి, డీఈవో ఇ.నారాయణ, దేవదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ హరి సూర్యప్రకాశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 20 , 2026 | 12:40 AM