Share News

ఉద్యానం వికసించేనా ?

ABN , Publish Date - Mar 29 , 2026 | 12:19 AM

వెంకట్రామన్నగూడెం డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ విశ్వ విద్యాలయంలో విద్యార్థుల వెతలు అన్నీ ఇన్నీ కావు. హాస్టల్స్‌లో విద్యుత్‌ వెలుగులు ఉండవు. పరిశుభ్రత ఉండదు. చికెన్‌ చూస్తేనే భోజనంపై విరక్తి వచ్చే స్తుంది.

ఉద్యానం వికసించేనా ?

ఇన్‌చార్జి వీసీ ధనుంజయరావు రాకతో పలు మార్పులు

హాస్టళ్ల నిర్వహణపై అసంతృప్తి.. అసోసియేట్‌ డీన్‌ బదిలీ

ఉద్యోగుల పెన్షన్లు మంజూరు.. పీహెచ్‌డీ స్కాలర్స్‌ బకాయిల విడుదల

కొత్త పరిశోధనలు రావాలి.. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కావాలి

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

వెంకట్రామన్నగూడెం డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ విశ్వ విద్యాలయంలో విద్యార్థుల వెతలు అన్నీ ఇన్నీ కావు. హాస్టల్స్‌లో విద్యుత్‌ వెలుగులు ఉండవు. పరిశుభ్రత ఉండదు. చికెన్‌ చూస్తేనే భోజనంపై విరక్తి వచ్చే స్తుంది. పోనీ విద్యార్థులు ఎవరికైనా ఫిర్యాదు చేశా రా? ఇక అంతే.. వేధింపులు తప్పవు. అందుకే వారు పెట్టింది తింటాం.. సమస్యలను మౌనంగా భరిస్తాం అంటున్నారు విద్యార్థులు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీని వాస్‌ గతంలో ఉద్యాన విశ్వ విద్యాలయాన్ని సంద ర్శించినప్పుడు విద్యార్థినుల సమస్యలు ఆయన దృష్టికి వెళ్లాయి. వీటిని పరిష్కరించాలంటూ అప్పటి ఇన్‌ఛార్జ్‌ వైస్‌ ఛాన్సలర్‌కు సూచించారు. కాని.. ఫలితం లేకపోయింది. పైగా ప్రజా ప్రతినిధుల జోక్యం విద్యా సంస్థలో ఉండకూడదంటూ బెట్టు చేశారు. ఇలా ఎన్నో సమస్యలు అపరిష్కృతంగా ఉండిపోయాయి.

పలు సమస్యలు పరిష్కారం

ఇటీవల ఇన్‌చార్జ్‌ వీసీగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్‌ ధనుంజయరావు పది రోజుల క్రితం విద్యా ర్థుల హాస్టల్స్‌ను ఆకస్మిక తనిఖీ చేసి అవాక్క య్యారు. ఎక్కడికక్కడ అపరిశుభ్రత, వంట నాణ్యత లో లోపాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్‌ బాధ్యతలు చూస్తున్న అసోసియేట్‌ డీన్‌ను బదిలీ చేసి కొత్త వారిని నియమించారు. సమస్యల పరిష్కా రానికి ఆదేశాలు జారీ చేశారు. దీనిపై విద్యార్థుల్లో ఆనందం వ్యక్తమైంది. ధనుంజయరావు భాధ్యతలు చేపట్టిన తర్వాత మూడేళ్ల నుంచి పెండింగ్‌లో వున్న పైళ్లు బూజు దులిపారు. పదవీ విరమణ చేసిన 20 మంది ఉద్యోగుల పెన్షన్లను ఇప్పించారు. విశ్వ విద్యాలయంలో చాలా కాలంగా పరిశోధనలు చేసి పీహెచ్‌డీ డిగ్రీ పట్టాలు పొందిన అభ్యర్థులకు స్టైపండ్‌ మంజూరు చేయలేదు. పీహెచ్‌డీ పూర్తి చేసిన అభ్యర్థులు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఉద్యాన విశ్వ విద్యాలయ క్యాంపస్‌తోపాటు, నాలుగు అను బంధ కళాశాలల్లో పీహెచ్‌సీ పూర్తి చేసిన 110 మం ది అభ్యర్థులకు పెండింగ్‌ బకాయిలు చెల్లించారు. ఒక్కో అభ్యర్థికి సుమారుగా రూ.3 లక్షల వరకు అందాయి. దీంతో పీహెచ్‌డీ కోర్సులకు మళ్లీ పూర్వ వైభవం వస్తుందన్న భరోసా వచ్చింది. క్యాంపస్‌లో 20 ఏళ్లుగా ఒకే విభాగంలో తిష్ట వేసిన ఉద్యోగులను బదిలీ చేశారు.

మిగిలిన వాటి మాటేంటి ?

గతంలో వైస్‌ ఛాన్సలర్‌లుగా పనిచేసిన డాక్టర్‌ శిఖామణి, డాక్టర్‌ బీఎంసీ రెడ్డి, ఇన్‌ఛార్జ్‌గా పనిచేసిన మాజీ ఐఎఫ్‌ఎస్‌ అధికారి డాక్టర్‌ చిరంజీవి చౌదరి పాలనా కాలంలో ఉద్యాన విశ్వ విద్యాలయం కొత్త పుంతలు తొక్కింది. వారంతా వర్శిటీ అభివృద్ధిలో తమదైన ముద్ర వేసుకున్నారు. కేంద్రస్థాయిలో వున్న పరిచయాలతో నిధులు రాబట్టారు. పరిశోధన కేంద్రాలను నెలకొల్పారు. అవి ఇప్పుడు అంతగా పనిచేయడం లేదు. విశ్వ విద్యాలయంలోనే రూ.13 కోట్లతో నిర్మించిన ఎక్సెలెన్సీ కేంద్రం అంతగా అక్కర కు రావడం లేదు. పరిశోధనలు మందగించాయి. వాటిని వృద్ధిలోకి తీసుకురావాలి. ఏటా రైతు సదస్సులను ఏర్పాటు చేసేవారు. కొన్నేళ్లుగా దానికి స్వస్తి పలికారు. విశ్వ విద్యాలయ కృషిని ప్రభుత్వా నికి వివరించి నిధులు రాబట్టాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.23 కోట్లు కావాలంటూ అధికారులు ప్రతిపాదించారు. నిధులు మాత్రం రాలేదు. ప్రస్తుతం భారత వ్యవసాయ పరిశోధన మండలి నుంచే కొద్దో గొప్పో నిధులు వస్తున్నాయి. పరిశోధన ప్రాజెక్ట్‌లు పెద్దగా ఏమీ లేవు. ఆ దిశగా వర్శిటీ అడుగులు వేస్తేనే ప్రయోజనం ఉంటుంది. ఆ దిశగా ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు చేపట్టిన ధనుంజరావు సమస్యల పరిష్కారంలోనూ శ్రద్ధ చూపాలి.

Updated Date - Mar 29 , 2026 | 12:19 AM