Share News

ప్రాణాలు తీసిన ఈత సరదా

ABN , Publish Date - Mar 16 , 2026 | 01:30 AM

బుట్టాయగూడెం మండలంలోని జల్లేరు జలాశయంలో ఇద్దరు యువకులు ఈతకు దిగి గల్లంతై చివరకు మృత్యువాత పడిన ఘటన ఆదివారం రాత్రి జరిగింది.

ప్రాణాలు తీసిన ఈత సరదా
మృతులు నాగరాజు, రమణ

బుట్టాయగూడెం, మార్చి 15(ఆంధ్రజ్యోతి): బుట్టాయగూడెం మండలంలోని జల్లేరు జలాశయంలో ఇద్దరు యువకులు ఈతకు దిగి గల్లంతై చివరకు మృత్యువాత పడిన ఘటన ఆదివారం రాత్రి జరిగింది. కుటుంబ సభ్యులు పోలీసులు తెలిపిన వివరాలివి. తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండ లం యాదవోలుకు చెందిన తుమ్మల నాగరాజు(35), తుమ్మల రమణ(30)లు వనదేవత గుబ్బల మంగమ్మతల్లిని దర్శించు కోవడానికి కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం వచ్చారు. తిరుగు ప్రయాణంలో దొరమామిడి డ్యామ్‌ కాలనీ సమీపంలోని జల్లేరు జలాశయాన్ని చూడడానికి వెళ్లి ఈతకు దిగి మృత్యువాత పడ్డారు. కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని పోలీసులకు చెప్పడంతో జలాశయంలో గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి పడడంతో గాలింపు చర్యలకు తీవ్ర విఘాతం ఏర్పడినా పోలీసులు గజఈతగాళ్ళ చేత గాలింపు చర్యలు ముమ్మరం చేయడంతో రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇద్దరి మృతదేహాలు లభ్యం అయ్యాయి. మృతదేహా లను పోస్టుమార్టం కోసం జంగారెడ్డి గూడెం ఏరియా ఆసుపత్రికి తరలించి ఇరువురి తండ్రులు తుమ్మల సత్యనారాయణ, తుమ్మల నారాయణ స్వామిల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ డి.దుర్గా మహేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులకు భార్య, పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యుల కన్నీరు మున్నీరుగా విలపించడం అందరిని కంటతడి పెట్టించింది.

Updated Date - Mar 16 , 2026 | 01:30 AM