Share News

వాయుగండం!

ABN , Publish Date - Sep 24 , 2026 | 12:49 AM

బంగాళా ఖాతం లో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి నుంచి కుంభవృష్టిగా వర్షా లు కురుస్తున్నాయి. జిల్లాలో జనజీవనం స్తంభించిం ది.

 వాయుగండం!
ఆగిరిపల్లిలో వర్షం

ఏలూరు జిల్లాలో కుంభవృష్టి

రహదారులు జలమయం..

లోతట్టు ప్రాంతాలు జలమయం

ఏజెన్సీలో పొంగుతున్న కొండవాగులు

గుబ్బల మంగమ్మ ఆలయానికి వెళ్లే మార్గం మూసివేత

ఎర్రకాలువ జలాశయంలోకి వరదనీరు

గోదావరికి వరద పోటు

కొయ్యలగూడెంలో 112.6 మి.మీ వర్షపాతం నమోదు

ఏలూరుసిటీ/కుక్కునూరు/బుట్టాయగూడెం/కలిండి/కొయ్యలగూడెం/జీలుగుమిల్లి/వేలేరుపాడు/ఏలూ రు క్రైం/ఏలూరు అర్బన్‌, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి):బంగాళా ఖాతం లో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి నుంచి కుంభవృష్టిగా వర్షా లు కురుస్తున్నాయి. జిల్లాలో జనజీవనం స్తంభించిం ది. రాబోయే మూడు రోజుల్లో జిల్లాలో అత్యంత భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు తీవ్ర చలిగాలులు వీస్తున్నాయి. ఈ వర్షాలు సార్వా సాగుకు ఊపిరినిచ్చాయి. ఇదే రకంగా కొన్ని రోజులు వర్షాలు కురిస్తే సార్వా సాగు గట్టెక్కినట్లే అని వ్యవ సాయ శాఖాఽధికారులు చెబుతున్నారు. అడుగంటిన భూగర్భ జలాలు వృద్ధి చెందే అవకాశాలున్నాయి. కొంగువారిగూడెం ఎర్రకాలువ జలాశయంలో ఇప్పటి వరకు డెడ్‌ స్టోరేజీలో నీటి నిల్వ ఉండగా కుంభ వృష్టిగా కురుస్తున్న వర్షాల వల్ల జలాశయంలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. జల్లేరు, కొవ్వాడ, పోగొండ జలాశయాల్లోకి వరదనీరు వచ్చి చేరుతోంది.

కుక్కునూరు మండలంలో కొత్తచెరువు, హను మంత చెరువు, రావి కొమరయ్యకుంటలు వర్షపునీటి తో నిండాయి. వర్షానికి పచ్చిమిర్చి పంట లకు నష్టం చేకూరే పరిస్థితి ఏర్పడింది. పత్తిపంట పూతరాలే పరిస్థితి ఏర్పడింది. ఏజెన్సీలో మంగళవారం సాయం త్రం నుంచి బుధవారం రాత్రి పొద్దుపోయేవరకు ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తూనే ఉంది. దొర మామిడి డ్యామ్‌ పరిసర అటవీ ప్రాంతంలో 78 మి. మీ, బుట్టాయ గూడెంలో 61.8 మి.మీ వర్షపాతం నమోదైనట్టు ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులు తెలి పారు. మరోవైపు కొండ వాగులు పొంగే ప్రమాదం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యగా గుబ్బల మం గమ్మ ఆలయానికి వెళ్లే మార్గంలోని గేటును బుధవారం కమిటీ సభ్యులు మూసివేశారు. భక్తుల ను వెనక్కి పంపించి వేశారు. ఉప్పుటేరు తీర గ్రామా ల ప్రజలు, లోతట్టు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలిదిండి తహసీల్దార్‌ రామకృష్ణ సూచిం చారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దన్నారు. కొయ్య లగూడెం– కన్నాపురం రోడ్డుపైకి నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. బైనేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.

కొయ్యలగూడెంలో 112.6 మి.మీ వర్షపాతం

జిల్లాలో గత 33 గంటల్లో కొయ్యలగూడెంలో 112.6 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదు కాగా జిల్లా లో సరాసరి వర్షపాతం 39.7 మి.మీ. వేలేరుపాడు 91.6, ఉంగుటూరు 85.6, జంగారెడ్డిగూడెం 83.4, పోలవరం 82.6, బుట్టాయిగూడెం 81, కుక్కునూరు 78.2, ముదినేపల్లి 72.4, జీలుగుమిల్లి 70, పెదపాడు 60, నూజివీడు 59.2, ముసునూరు 57.4, కామ వరపుకోట 55.6, ఏలూరు 55.4, ద్వారకాతిరుమల, టి.నరసాపురం 51.8, ఆగిరిపల్లి 51.2, దెందులూరు 48.6, లింగపాలెం 46, మండవల్లి 45.6, నిడమర్రు, కలిదిండి 45.2, భీమడోలు 43, కైకలూరు 42.2, పెదవేగి 41.2, చింతలపూడి 40.6, చాట్రాయి 30 మి.మీ నమోదైంది.

అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్‌

జిల్లాలో భారీ వర్షాల నేపఽథ్యంలో అధికార యం త్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ కె.వెట్రి సెల్వి అధికారులను ఆదేశించారు. బుధవారం అధి కారులతో కలెక్టర్‌ టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షిం చారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. లోతట్టు, సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. వర్షాల నేపథ్యంలో పోలీస్‌ యంత్రాంగం అప్రమత్తమైంది. ఏజెన్సీలోని వాగులు కాలువలు, కల్వర్టులు దాటేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రమాదకర పరిస్థితులుంటే రాకపోకలు నిలిపివేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. రోడ్లపైన విద్యుత్‌ స్తంభాలు, చెట్లు కూలి రాకపోకలకు అంతరాయం ఏర్పడితే తొలగించేందుకు అవసరమైన కట్టర్ల సిబ్బందిని, ఎక్స్‌కవేటర్లను, క్రేన్‌లను అగ్నిమాపక శాఖ అధికారులు సిద్ధం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు సహాయం కోసం 112కు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.

పొంచి వున్న గోదావరి గండం

వేలేరుపాడు మండలానికి గోదావరి వరద గండం పొంచి వుంది. ఎగువ ప్రాంతాలైన ఛత్తీస్‌ఘడ్‌, ఒడిశా, తెలంగాణ రాష్ర్టాల్లో కురుస్తున్న భారీవర్షాల కారణంగా ఉపనదుల ద్వారా గోదావరికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. సెప్టెంబరు మొదటి వారం నుంచే ఈ రెండు మండలాల్లో పది వేల ఎకరాల్లో మిర్చి, మరో పది వేల ఎకరాల్లో అపరాల పంటలను రైతులు వేసుకున్నారు. భద్రాచలం వద్ద 48 అడుగులకు వరద నీటిమట్టం చేరుకుంటే ఇవన్నీ మునిగిపోయే ప్రమాదం ఉండటంతో లక్షలు ఖర్చు చేసిన రైతులు ఆందోళనకు గురవుతున్నారు. వరద తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్‌ ఎన్‌.శ్రీనివాస్‌ ప్రజలకు సూచించారు.

ఏజెన్సీలో పొంగిన కొండవాగులు

ఏజెన్సీలో కురుస్తున్న వర్షాలకు జల్లేరు, బైనేరు, ఇతర ప్రాంతాల్లోని కొండవాగులు ప్రమాదకర స్థాయిలో పొంగి ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. జీలుగుమిల్లి శివారు కామ య్యపాలెం వాగు రోడ్డు పైనుంచి పొంగి ప్రవహి స్తోంది. లంకాలపల్లి, వంకవారిగూడెం, దర్భగూడెం వద్ద వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. వేలేరు పాడు మండలం పెదవాగుకు వరద పోటెత్తు తోంది. మేడేపల్లి, కమ్మరిగూడెం గ్రామాల మధ్య ఉన్న పెదవాగుపై భారీ తూరలతో నిర్మించిన తాత్కాలిక కాజ్‌వే వరద ఉధృతికి కొట్టుకుపోయింది.

కుండపోత వానలో పాఠశాలలకు సెలవుపై జిల్లా విద్యాశాఖ గందరగోళ వైఖరి

విద్యా శాఖలో గందరగోళం కారణంగా బుధవారం కొన్ని స్కూళ్లకు సెలవు ప్రకటించగా, మరికొన్ని పనిచేశాయి. విద్యాసంస్థలకు బుధ వారం సెలవు ప్రకటిస్తున్నట్టు ఉదయం 8.50 గంటలకు ఉప విద్యాశాఖాధికారి ఆదేశాలు జారీచేశారు. దీంతో హెచ్‌ఎంలు, టీచర్లు పాఠశాలలకు సెలవు ప్రకటించి విద్యార్థులను వర్షంలోనే ఇళ్లకు పంపించారు. కొన్ని పాఠశాలలు యథాతథంగా పనిచేశాయి. జిల్లాలో 2,220 పాఠశాలలుండగా 770 పాఠశాలలు సెలవు ప్రకటించుకోగా, మిగతా పాఠశాలలు పనిచేశాయి. ఈ గందరగోళం కొనసాగుతుండగానే డీఈవో జిల్లాలో పాఠశాలలు నిర్వహించడానికి అనువుగా ఉన్నచోట యఽథాతథంగా పనిచేయాలని, తరగతుల నిర్వహణపై డీవైఈవోలు, ఎంఈవోలే స్థానిక పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలని కామన్‌ మెసేజ్‌ను అందరికీ పంపారు. దీంతో సెలవు

ప్రకటించిన పాఠశాలల హెచ్‌ఎంలు, టీచర్లు గందరగోళానికి గురయ్యారు. ఒకే అంశంపై డీఈవో, డీవైఈవోల నుంచి వేర్వేరుగా మెసేజ్‌లు రావడంతో ఎవరి ఆదేశాలు పాటించాలో అర్థంకాని అయోమయంతోపాటు, ఇళ్లకు పంపివేసిన విద్యార్థులను తిరిగి పాఠశాలకు రప్పించడమెలా.. అనే సందిగ్ధావస్థను ఎదుర్కొన్నారు. ఇకమీదట ఇటువంటి గందరగోళం పునరావృతం కాకుండా ఉదయం ఎనిమిది గంటల్లోగానే నిర్ణయాన్ని ప్రకటించేలా చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. జిల్లా విద్యాశాఖ భిన్నమైన నిర్ణయాలతో విద్యార్థులను, టీచర్లను ఇబ్బందులకు గురిచేయడంపై ఏపీ ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడు వడ్లపట్ల మురళీకృష్ణ అభ్యంతరం వ్యక్తం చేశారు.

నేడు పాఠశాలలకు సెలవు

జిల్లావ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా గురువారం అన్ని మేనేజ్‌మెంట్ల విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తూ డీఈవో వెంకట లక్ష్మమ్మ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశా రు. ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్‌ కళాశాలలకు సెలవు ప్రకటించినట్టు ఆర్‌ఐవో యోహన్‌ తెలిపారు.

Updated Date - Sep 24 , 2026 | 12:49 AM