రైతుల పాలిట పగాకు
ABN , Publish Date - Jul 19 , 2026 | 12:16 AM
గత రెండేళ్లు వర్జీనియా పొగాకు రైతులకు కాసులు కురిపించిన పొగాకు నేడు వారి పాలిట పగాకుగా మారింది. ఈ ఏడాది మార్చి 25న పొగాకు అమ్మకాలు ప్రారంభ మైనప్పటి నుంచి కనీస గిట్టుబాటు ధరలు లేకపోవడంతో ఏజెన్సీ మెట్ట ప్రాంత రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు.
4 నెలల్లో పదిహేను శాతం లోపే అమ్మకాలు
క్వాలిటీ పొగాకుకూ ధర లేదు..
వెనక్కు పంపడంతో రవాణా ఖర్చులు తడిసి మోపెడు
వచ్చే ఏడాదికి ఉత్పత్తిపై కోత
జంగారెడ్డిగూడెం, జూలై 18 (ఆంధ్రజ్యోతి): గత రెండేళ్లు వర్జీనియా పొగాకు రైతులకు కాసులు కురిపించిన పొగాకు నేడు వారి పాలిట పగాకుగా మారింది. ఈ ఏడాది మార్చి 25న పొగాకు అమ్మకాలు ప్రారంభ మైనప్పటి నుంచి కనీస గిట్టుబాటు ధరలు లేకపోవడంతో ఏజెన్సీ మెట్ట ప్రాంత రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు. సీఎం చంద్రబాబు, వ్యవసాయశాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు నిత్యం అధికారులు, పొగాకు కంపెనీలతో సమీక్ష నిర్వహిస్తూ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆదేశించినా కంపెనీల యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు.
నాలుగు నెలలుగా నిరాశే..
గత ఏడాది కిలో పొగాకు గరిష్ఠ ధర రూ.456 గా నమోదైంది. ప్రారంభ ధర 295. ఈ ఏడాది కనీసం 300 నుంచి ప్రారంభ ధర ఉంటుందని ఆశ పడిన రైతులకు గత నాలు గు నెల లుగా నిరాశ ఎదుర వుతూనే ఉంది. గత ఏడాది ధరల మాదిరిగానే ఈ ఏడా దీ ఉంటాయని ఆశించిన రైతులు పొగాకును అధి కంగా పండించి మోసపో యారు. ఎన్‌ఎల్ ఎస్ పరిధి లో ఉన్న ఐదు పొగాకు వేలం కేంద్రాలకు రైతులు తెస్తున్న బేళ్లలో 50 శాతా నికి పైగా వెనక్కి పంపడంతో అద నపు రవాణా ఖర్చు తో రైతులు ఇబ్బందులు పడుతు న్నారు. క్వాలిటీ పొగాకుకు కూడా కిలో రూ.265 ధర ఇవ్వడంతో ఇష్టం లేని రైతులు నేటికీ పూర్తి స్ధాయిలో పొగాకు బేళ్లు వేలం కేంద్రాలకు తీసుకురావడంలేదు.
15 శాతం కొనుగోళ్లూ పూర్తికాలేదు..
ఈ ఏడాది రాజమండ్రి రీజియన్ పరిధిలో ఉన్న ఐదు వేలం కేంద్రాల పరిధిలో 51.87 మిలియన్ కిలోల పొగాకు పండించాలని రైతులకు బోర్డు ఆదేశించింది. అయితే రైతులు సుమారు 83.52 మిలియన్ కిలోల పొగాకు పండించారు. దాదాపు 31 మిలియన్ కిలోల పొగాకును అదనంగా పండించారు. కాగా ఇప్పటి వరకు కనీసం బోర్డు ఇచ్చిన అనుమతి ప్రకారం పొగాకును కొనుగోలు చేయాల్సిన కంపెనీలు ఈ నాలుగు నెలల కాలంలో కేవ లం సుమారు 7.7 మిలియన్ కిలోల పొగాకు మాత్రమే కొనుగోలు చేశాయి. కేవలం 15 శాతం కూడా కొనుగోళ్లు పూర్తి కాలేదు. బోర్డు లెక్కల ప్రకారం ఇంకా దాదాపు 43 మిలియన్ కిలోల పొగాకు మరో నాలుగు నెలల్లో రైతుల నుంచి కొనుగోలు చేయాల్సి ఉంది. దీంతో పాటు అదనంగా పండించిన పొగాకు కూడా రైతుల ఇళ్ల వద్దనే మూలుగుతోంది.