ఐదింటితోనే సరి!
ABN , Publish Date - Jun 04 , 2026 | 12:30 AM
గ్రామీణ ప్రాంతాల్లో భజన మందిరాలను విస్తరించాలన్న టీటీడీ ఆలోచనలకు చాలాచోట్ల స్పందన కరువైంది. శివారు ప్రాంతాల్లోను వీటిని విస్తరించడానికి దర ఖాస్తులను ఆహ్వా నించగా కేవలం 14 చోట్ల స్థలాలు అందు బాటులో రావడంతో తొలి విడతగా ఐదుచోట్ల వీటికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
భజన మందిరాలకు నిబంధనల అడ్డంకి
జిల్లాలో 14 చోట్ల నిర్మాణాలకు ప్రతిపాదనలు
ఐదు భజన మందిరాలకు రూ.60 లక్షల మంజూరు
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
గ్రామీణ ప్రాంతాల్లో భజన మందిరాలను విస్తరించాలన్న టీటీడీ ఆలోచనలకు చాలాచోట్ల స్పందన కరువైంది. శివారు ప్రాంతాల్లోను వీటిని విస్తరించడానికి దర ఖాస్తులను ఆహ్వా నించగా కేవలం 14 చోట్ల స్థలాలు అందు బాటులో రావడంతో తొలి విడతగా ఐదుచోట్ల వీటికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో శ్రీవాణి ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రజల్లో భక్తిభావం పెంచేందుకు నిర్మించతలపెట్టిన భజన మందిరాలకు నిబంధనలే అడ్డంకిగా మారాయి. భారీ ఎత్తున భజన మందిరాలు, ఆలయాల నిర్మాణాలను ప్రతి గ్రామం లోను విస్తరించే యోచనలో టీటీడీ ఆధ్వర్యంలో నిధుల మంజూ రుకు ప్రతిపాదనలు ఆహ్వానించారు. తీరా ఆచరణలో ఏలూరు జిల్లా నుంచి 14 ప్రతిపాదనలు వెళ్లగా కేవలం ఐదింటితోనే దేవదాయధర్మదాయశాఖ సరిపెట్టింది.
స్థలాలే అసలు సమస్య
జిల్లాలో గ్రామగ్రామాన రామాలయం లేదా శివాలయంతో పాటు ఆంజనేయస్వామి ఆలయాలు ఉంటాయి. భక్తిభావం ఉన్న గుడులు, భజన మందిరాలు లేని చోట్ల విస్తరించే దిశగా ఐదు నెలలు క్రితం తిరుమల తిరుపతి దేవవస్థానం(టీటీడీ) ద్వారా దరఖాస్తులను ఆహ్వానించింది. ప్రధానంగా ఐదు సెంట్ల స్థలం దాతలు ఇస్తే అక్కడ రూ.10 లక్షలు, పది సెంట్లు స్థలం ఉంటే రూ.15 లక్షలు నిధులు మంజూరు చేయాలని నిర్ణయించారు. కాగా చాలాచోట్ల స్థలాలు అందుబాటులో లేక భజన మందిరాల ఏర్పాట్లు జిల్లాలో కొన్ని ప్రాంతాలకే పరిమితమయ్యాయి. జల్లెడ పట్టి దేవాలయ ఇన్స్‌పెక్టర్ల ద్వారా భజన మందిరాలకు దర ఖాస్తులు ఆహ్వానించగా, నిబంధనల ప్రకారం 14 చోట్ల నిర్మాణా లకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దీంతో ఒక్క విడతతో ఈ మహాసంకల్పానికి తెరపడి నట్లైంది.
ఐదు చోట్ల మంజూరైనవి ఇవే ..
ఐదు సెంట్లు స్థలం కలిగిన మూడు చోట్ల రూ.10 లక్షల నిధులను మంజూరు చేశారు. కలిదిండి మండలంలోని కలిదిండి శివారు రామాలయం, ఉంగుటూరు మండలం నీలాద్రిపురం కోదం డరామాలయం, కలిదిండిలో పర్సావానిపాలెంలోని అభయ రామ మందిరంలో భజన మందిరాల నిర్మిస్తారు. 10 సెంట్లు స్థలం కలి గిన ఉంగుటూరు మండలం బాదంపూడిలోని భక్తాంజనేయస్వామి ఆలయం, భీమడోలు మండలం పార్వతీ పరమేశ్వర సమేత సర్వేశ్వరాలయం వద్ద భజన మందిరాలు 15 లక్షలు వ్యయం చొప్పున వెచ్చించనున్నారు. జిల్లాలో మంజూరైన భజన మందిరాలను దేవదాయశాఖ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షించనున్నారు. విడతల వారీగా నిర్మాణాలు పూర్తయితే గ్రామ కమిటీలకు నిధులను టీటీడీ శ్రీవాణి ట్రస్టు ద్వారా విడుదల చేయనుంది.