వరి సస్యరక్షణపై రైతులకు అవగాహన కల్పించాలి
ABN , Publish Date - Jan 09 , 2026 | 12:24 AM
వరి సాగులో ఎరువులు, పురగు మందుల పిచికారీ, కలుపు నివారణ, నీటి సంరక్షణ యాజమాన్యంపై సిబ్బంది పూర్తి అవగాహనతో ఉండాలని వ్యవసాయ శాఖ జేడీ వెంకటేశ్వరరావు అన్నారు.
పాలకోడేరు, జనవరి 8(ఆంధ్రజ్యోతి): వరి సాగులో ఎరువులు, పురగు మందుల పిచికారీ, కలుపు నివారణ, నీటి సంరక్షణ యాజమాన్యంపై సిబ్బంది పూర్తి అవగాహనతో ఉండాలని వ్యవసాయ శాఖ జేడీ వెంకటేశ్వరరావు అన్నారు. గొరగనమూడిలో రాష్ట్రీయ కృషి వికాస్ యోజనపై వ్యవసాయ సహాయకులకు గురువారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. రైతులకు వరి సాగుపై అవగాహన కల్పించే విధంగా సహాయకులు ఉండాలన్నారు. అప్పుడే రైతులు వ్యవసాయంపై మరింత పట్టుసాధించి అధిక దిగుబడులు సాధించేందుకు అవకాశం ఉంటుందన్నారు. శిక్షణ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. డీఆర్‌సీ ఏవో బాల నాగేశ్వరమ్మ, శామ్యూల్ జాన్సన్, భీమవరం ఏడీఏ శ్రీనివాసరావు, ఏవోలు బి.సంధ్య, వై.ప్రసాద్, బెన్సి, తదితరులు పాల్గొన్నారు.
ఎండు గడ్డిని తగలబెడితే పోషకాలు నాశనం
తణుకు రూరల్, జనవరి 8(ఆంధ్రజ్యోతి): పంట పొలాల్లో ఎండు గడ్డి తగలబెట్టడం వలన భూమిలో సూక్ష్మ పోషకాలు నశిస్తాయని ఏడీఏ జి నరేంద్ర అన్నారు. జిల్లా వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ, జిల్లా వనరుల కేంద్రం ఆధ్వర్యంలో మండపాకలో గురువారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లా వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ అధికారి ఎస్ గీతాదేవి, సొసైటీ అధ్యక్షుడు పీవీవీ సత్యనారాయణ, బీవీవీ సుబ్బారావు, ఏవో కె.రాజేంద్రప్రసాద్, ఎం సీతా రామయ్య, డి.జయ రామకృష్ణ, రైతులు పాల్గొన్నారు.