సంక్రాంతి రైళ్లకు నో బెర్త్!
ABN , Publish Date - Nov 13 , 2026 | 11:57 PM
సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమైన ప్రయాణికులకు అప్పుడే రైళ్ల కష్టాలు మొదలయ్యాయి.
నిమిషంలోనే ఫుల్.. అన్ని క్లాసుల్లోనూ రిగ్రెట్
జనవరి 12 వరకు ప్రధాన రైళ్లలో నిరాశే..
తత్కాల్, స్పెషల్ రైళ్లపైనే ప్రయాణికుల ఆశలు
నరసాపురం, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమైన ప్రయాణికులకు అప్పుడే రైళ్ల కష్టాలు మొదలయ్యాయి. 60 రోజుల ముందే రైల్వే రిజర్వేషన్ ప్రారంభం అవుతున్నప్పటికీ.. ఆన్ లైన్‌లో బుకింగ్ ఓపెన్ అయిన ఒక్క నిమిషం లోనే బెర్త్‌లన్నీ ఫుల్ అయిపోతున్నాయి. జన వరి 9 నుంచి 12 వరకు ముంబై, బెంగళూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి గోదా వరి జిల్లాల మీదుగా నడిచే ప్రధాన రైళ్లన్నీ వెయిటింగ్ లిస్ట్ లేదా రిగ్రెట్ (నో బెర్త్) చూపి స్తుండటంతో ప్రయాణికుల్లో టెన్షన్ మొదలైం ది. రెండు రోజులుగా ఇదే పరిస్థితి నెలకొన డంతో సొంతూళ్లకు ఎలా వెళ్లాలో తెలియక తత్కాల్, స్పెషల్ రైళ్ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
గోదావరి జిల్లాల్లో సంక్రాంతి పండుగను అత్యంత ఘనంగా జరుపుకోవడం ఆనవాయి తీ. ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో స్థిరపడిన వారు సైతం పండుగ మూడు రోజులు కుటుంబ సభ్యులతో గడిపేందుకు సొంతూళ్లకు వస్తుం టారు. ఇందుకోసం నెలల ముందు నుంచే ప్రయాణానికి ప్రణాళికలు చేసుకుంటారు. అడ్వాన్స్ రిజర్వేషన్ కోసం తేదీలు లెక్క బెట్టు కుని మరీ జనవరి తొమ్మిదో తేదీ ప్రయాణాల నుంచి ప్రతిరోజూ ఆశగా బుకింగ్ కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ, క్షణాల్లో టికెట్లు బుక్ అయిపోతుండటంతో నిరాశే మిగులుతోంది.
ఏ రైలులో చూసినా వెయిటింగ్ లిస్టే..
హైదరాబాద్ నుంచి గోదావరి జిల్లాల మీదుగా నడిచే లింగంపల్లి ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతుంటారు. కాబట్టి ఈ రైలులో జన వరి 10 నుంచి 12 వరకు స్లీపర్, ఏసీ క్లాస్ లన్నీ నిండిపోయి రిగ్రెట్ దర్శనమిస్తోంది.
చర్లపల్లి మీదుగా వచ్చే నాగర్‌సోల్ ఎక్స్ ప్రెస్ రైలులో జనవరి 10న స్లీపర్‌లో 120, ఏసీలో 31 వెయిటింగ్ లిస్ట్ ఉంది. 11న స్లీపర్‌లో 210, ఏసీలో 60 వెయిటింగ్ ఉండగా.. 12న స్లీపర్, ఏసీ క్లాస్‌ల్లో రిగ్రెట్ చూపిస్తోంది.
భీమవరం, తణుకు మీదుగా నడిచే ముంబై ఎల్‌టీటీ ఎక్స్‌ప్రెస్ రైలులో జనవరి 10, 11, 12 తేదీల్లో స్లీపర్, ఏసీ తరగతుల్లో బెర్త్‌లు ఖాళీ లేవు.
హైదరాబాద్ నుంచి భీమవరం మీదుగా భువనేశ్వర్ వెళ్లే విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలు నిండుకుంది. జనవరి 10న స్లీపర్‌లో వంద, ఏసీలో 40 వెయిటింగ్ లిస్ట్ ఉంది. 11, 12 తేదీల్లో నో బెర్త్ పరిస్థితి ఉంది.
ఏలూరు, తాడేపల్లిగూడెం మీదుగా నడిచే గౌతమి, గోదావరి ఎక్స్‌ప్రెస్ ప్రధాన రైళ్లలో నూ జనవరి 10, 11, 12, తేదీల్లో బెర్త్‌లు ఖాళీ లేవు.
బెంగళూరు నుంచి భీమవరం, తణుకు మీదుగా నడిచే శేషాద్రి ఎక్స్‌ప్రెస్ రైలులో జనవరి 10న స్లీపర్‌లో 120, ఏసీలో 106 వెయిటింగ్ లిస్ట్ ఉంది. 11న స్లీపర్‌లో 30, ఏసీలో ఒకటి చొప్పున, 12న స్లీపర్‌లో 100, ఏసీలో 30 చొప్పున వెయిటింగ్ లిస్ట్ చూపిస్తోంది.