ఏలూరులో ట్రాఫిక్ చిక్కుముడి
ABN , Publish Date - Nov 07 , 2026 | 12:24 AM
శుక్రవారం స్థానిక విజయవిహార్ సెంటర్లో జీవీమాల్ వద్ద నాలుగు రోడ్లకూడలి కావడంతో సుమారు గంట పాటు ట్రాఫిక్ స్థంభించింది. ఎక్కడి వాహనాలు అక్కడే ఉండిపోయాయి.
ఏలూరు నగరంలో రోజుకురోజుకు ట్రాఫిక్ సమస్య పెరుగుతున్నది. షాపింగ్ మాల్స్‌కు పార్కింగ్ సౌకర్యం లేకుండానే కార్పొరేషన్ అనుమతులు ఇవ్వండంతో షాపింగ్‌కు వచ్చిన వారు కార్లు,బైకులు రోడ్లపై పార్కింగ్ చేస్తున్నారు. దీనితో రోడ్డుపై వాహనదారులు వెళ్లే దారి లేక తీవ్రమైన సమస్య ఏర్పడుతున్నది. శుక్రవారం స్థానిక విజయవిహార్ సెంటర్లో జీవీమాల్ వద్ద నాలుగు రోడ్లకూడలి కావడంతో సుమారు గంట పాటు ట్రాఫిక్ స్థంభించింది. ఎక్కడి వాహనాలు అక్కడే ఉండిపోయాయి. అదేసమయంలో అంబులెన్స్, 108 రావడంతో దారి లేని దుస్థితి ఏలూరు ఆర్‌ఆర్‌పేట విజయ్‌విహార్ సెంటర్లో నెలకొన్నది. నిత్యం ట్రాఫిక్ పద్యవ్యూహంగా ఏర్పడుతోంది. ఇంత జరుగుతున్నా ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించే పోలీసులు మాత్రం కనపడలేదు. సంబంధిత అధికారులు పట్టించుకోక పోవడంతో వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఫొటో గ్రాఫర్,ఏలూరు