Share News

ఆధునిక హంగులతో గూడెంలో రైతు బజారు

ABN , Publish Date - Oct 04 , 2026 | 12:36 AM

తాడేపల్లిగూడెంలో రైతు బజారు ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. దీనిలో భాగంగా మార్కెటింగ్‌ శాఖ ఈఈ(ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌) మల్లేశ్వర రావు రైతు బజారు ఏర్పాటుచేసే ప్రదేశాన్ని శని వారం పరిశీలించారు.

ఆధునిక హంగులతో గూడెంలో రైతు బజారు

ఆధునిక హంగులతో గూడెంలో రైతు బజారు

రూ.45 లక్షలతో 26 దుకాణాల ఏర్పాటుకు రంగం సిద్ధం

తాడేపల్లిగూడెం, అక్టోబరు 3(ఆంధ్రజ్యోతి): తాడేపల్లిగూడెంలో రైతు బజారు ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. దీనిలో భాగంగా మార్కెటింగ్‌ శాఖ ఈఈ(ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌) మల్లేశ్వర రావు రైతు బజారు ఏర్పాటుచేసే ప్రదేశాన్ని శని వారం పరిశీలించారు. రైతు బజారును పూర్తి స్థాయిలోకి తీసుకురావడానికి రూ.45 లక్షలు అవుతుందని అంచనాలు వేశారు. దీనితో పాటు ఆధునీకరించడానికి, ఇక్కడ 26 స్టాల్స్‌ ఏర్పాటు చేసే విధంగా నివేదికలు తయారు చేశారు. ప్ర స్తుతం ఉన్న షెడ్డు పైకప్పును తొలగించడంతో పాటు పూర్తి స్థాయిలో వెంటిలేషన్‌ సౌకర్యాన్ని కల్పించనున్నారు. రైతులు విక్రయించుకునేందు కు అనువుగా స్టాల్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. రైతు బజారును ఆధునీకరించడంతో పాటు పూర్తి పాదర్శకంగా జరిగేలా అవసరమైన చర్యలు తీసు కోనున్నారు. ఇటు వినియోగదారులు ఇబ్బంది పడకుండా రైతు బజారుకు ఎదురుగా ఉన్న స్థ లాన్ని పార్కింగుకు కేటాయించారు.ఈ పార్కింగ్‌ ప్రదేశాన్ని కూడా పరిశుభ్రం చేసేందుకు అంచ నాలు వేశారు. తాడేపల్లిగూడెం చుట్టుపక్కల రైతులు వారు పండించిన కూరగాయలు, వాటి అనుబంధ ఉత్పత్తులను తెచ్చి అమ్ముకునేలా ఈ స్టాల్స్‌ సిద్ధం చేయనున్నారు. రైతు బజారు ఏ ర్పాటు చేసే ప్రాంతం నిత్యం పరిశుభ్ర వాతావ రణంలో ఉంచేలా మున్సిపాల్టీ చర్యలు తీసుకో నుంది. దీనికి అవసరమైన ఏర్పాట్లు ఇప్పటికే చేపట్టారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌ రైతు బజారు ఏర్పాటుకు ముందునుంచి చర్యలు చేప ట్టారు. ఎట్టకేలకు రైతు బజారు ఏర్పాటుకు తొలి అడుగు పండింది. టెండర్లు పిలవడంతో రెండవ దశకు చేరుతుంది. అంచనాలను మార్కెటింగ్‌ శాఖ ఉన్నతాధికారులకు నివేదించడమే తరువా యి. వెంటనే టెండర్లు పిలవడం పనులు త్వరిత గతిన పూర్తి చేసేందుకు సన్నద్దమవుతున్నారు. మార్కెటింగ్‌ శాఖ ఈఈ వెంట డీడీ పాపారావు, ఎఎం సునీల్‌కుమార్‌, తాడేపల్లిగూడెం మార్కెట్‌ యార్డు అధికారులు, సిబ్బంది ఉన్నారు.

Updated Date - Oct 04 , 2026 | 12:36 AM