లక్ష్యం దిశగా..
ABN , Publish Date - May 03 , 2026 | 11:42 PM
జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా సెస్ వసూళ్లు గత ఆర్థిక సంవ త్సరంలో ఆశాజనకంగానే అయ్యాయి.
వసూలు కావాల్సింది రూ.53.75 కోట్లు
ఇప్పటి వరకు రూ.47.56 కోట్లు వసూలు
ధాన్యం సేకరణ సెస్ పెండింగ్
జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా సెస్ వసూళ్లు గత ఆర్థిక సంవ త్సరంలో ఆశాజనకంగానే అయ్యాయి. జిల్లాలో ధాన్యం కొనుగోలు సేకరణ రైతు సేవా కేంద్రాల ద్వారా జరిగిన దానికి సంబం ధించి సెస్ మొత్తాలు జమ కాకపోవడం వల్ల కొంతమేర లక్ష్యం తగ్గినట్టు కనిపిస్తోంది. జిల్లాలో గత మార్చి నెలాఖరు నాటికి తొమ్మి ది ఏఎంసీల ద్వారా రూ.53 కోట్ల 75 లక్షలు వసూలు చేయాల్సి ఉండగా 47 కోట్ల 56 లక్షల 62 వేలు వసూళ్లను చేపట్టారు. మొత్తం 88.50 శాతం పురోగతిని సాధించారు.
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
జిల్లా వ్యాప్తంగా తొమ్మిది వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉండగా, ఇప్పటికే ఏడు కమిటీల పాలక వర్గాలు కొలువుతీరాయి. నూజివీడు కమిటి ఇటీవల ఏర్పాటు కాగా, కలిదిండి కమిటీ ప్రకటన పెండింగ్‌లో ఉంది. ఇదిలా ఉండగా ఽధాన్యం సేకరణ సెస్ రైతు సేవా కేంద్రాల ద్వారా జిల్లాలోని కమిటీల్లో దాదాపుగా రూ.70 కోట్ల పైబడి ఐదేళ్ల నుంచి జమ కావడం లేదు. ఇది సెస్ తగ్గుదలకు కారణ ంగా తెలుస్తోంది.
పశువైద్యశిబిరాలు.. లింకురోడ్ల నిర్మాణం
జిల్లాలో మార్కెటింగ్ సెస్ వసూళ్లు ఆశాజనంగానే ఉన్నట్టు ఏడీఎం శ్రీనివాసరావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ‘గతేడాది ఫిబ్రవరి నాటికి 57 శాతం సగటున వసూలు చేయగా, మార్చిలో స్పెషల్ డ్రైవ్ ద్వారా 88 శాతానికి పెంచగలిగాం. ఈసారి 9 మార్కెట్ కమిటీల పరిధిలో పశువైద్య శిబిరాల నిర్వహణకు త్వరలో చర్యలు తీసుకుంటాం. చాలాకాలం నుంచి ఏఎంసీల పరిధిలో రైతుల పొలాలకు అనుసంధానం చేసే లింకురోడ్ల అభివృద్ధి పైన ప్రభుత్వం నిర్ణయం వెలువరిస్తే.. ఆ దిశగా అభివృద్ధికి ప్రతిపాదనలు ఈ ఆర్థిక సంవత్సరంలో చేపడతా’మన్నారు.