ఆటపాక పక్షుల కేంద్రంలో పర్యాటకుల సందడి
ABN , Publish Date - Jan 18 , 2026 | 12:16 AM
కొల్లేరులోని ఆటపాక పక్షుల కేంద్రం సంక్రాంతి సెలవులను పురస్కరించుకుని పర్యాట కులతో కిటకిటలాడింది.
కైకలూరు, జనవరి 17(ఆంధ్రజ్యోతి): కొల్లేరులోని ఆటపాక పక్షుల కేంద్రం సంక్రాంతి సెలవులను పురస్కరించుకుని పర్యాట కులతో కిటకిటలాడింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు నిత్యం పర్యాటకులు రావడంతో సందడి నెలకొంది. అటవీశాఖ అధికారులు ఏర్పాటుచేసిన రెండు మరబోట్లు నిత్యం విరామం లేకుండా తిరుగుతూనే ఉన్నాయి. దూరప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు పక్షుల కేంద్రంలో సరదాగా భోజనాలు చేసి కుటుంబసభ్యులతో ఉత్సాహంగా జరిపారు. చిల్డ్రన్స్‌పార్క్‌లో పిల్లల ఆటపాటలు, పర్యావరణ విద్యాకేంద్రంలో సరస్సు నమూ నాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అటవీశాఖ అధికారులు పర్యాటకులకు టెంట్లు, టీ స్టాల్స్, తినుబండరాలు, మంచినీటి వసతి వసతులు కల్పించారు. గత నాలుగు రోజుల్లో నిత్యం 1,500 నుంచి రెండువేల మంది పర్యాటకులు ఆటపాక పక్షుల కేంద్రాన్ని సందర్శించినట్లు అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు.