Share News

రేపటినుంచి గోవుల అందాలు, పాల పోటీలు

ABN , Publish Date - Mar 19 , 2026 | 12:55 AM

గోవుల అందాలు, పాల పోటీలు ద్వారకాతిరుమల మార్కెట్‌ యార్డులో ఈనెల 20 నుంచి 22 వరకు నిర్వహిస్తా మని గోజాతి సంరక్షణ రాష్ట్ర అధ్యక్షుడు యు.చక్రపాణి తెలిపారు.

రేపటినుంచి గోవుల అందాలు, పాల పోటీలు
ద్వారకాతిరుమల మార్కెట్‌ యార్డులో పోస్టర్‌ను ఆరిష్కరిస్తున్న నిర్వాహకులు

ద్వారకాతిరుమల, మార్చి 18 (ఆంఽధ్ర జ్యోతి): గోవుల అందాలు, పాల పోటీలు ద్వారకాతిరుమల మార్కెట్‌ యార్డులో ఈనెల 20 నుంచి 22 వరకు నిర్వహిస్తా మని గోజాతి సంరక్షణ రాష్ట్ర అధ్యక్షుడు యు.చక్రపాణి తెలిపారు. బుధవారం ద్వార కాతిరుమల మార్కెట్‌ యార్డులో సంబం ధిత పోస్టర్‌ను టీడీపీ నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా త్రిదండి చినజీయర్‌ స్వామి, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు పాల్గొంటారన్నారు. గోసమ్మేళన పేరుతో ఒంగోలు, పుంగనూరు జాతి గోవులకు ఇటువంటి పోటీలను గత కొన్నేళ్లుగా జరుపు తున్నామన్నారు. గతంలో మాదిరిగా ఈసారి పోటీల నిర్వహణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తు న్నామన్నారు. పుంగనూరు, ఒంగోలు జాతుల పశువులను పెంచే నిర్వాహకులు ఇక్కడకు వచ్చేందుకు ఎంతో ఆసక్తి చూపుతున్నార న్నారు. వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. విజేతలకు బహుమతులు అందజేస్తామని గోపాలపు రం ఏఎంసీ చైర్మన్‌ బ్రహ్మరాజు తెలిపారు.

Updated Date - Mar 19 , 2026 | 12:55 AM