పార్టీ బలోపేతానికి.. ఐక్యంగా శ్రమిద్దాం
ABN , Publish Date - Jan 24 , 2026 | 01:10 AM
పార్టీ బలోపేతానికి చిత్తశుద్ధితో పనిచేస్తా. నాపై సీఎం చంద్రబాబు, లోకేశ్ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేత లతో కలిసి ఏకాభిప్రాయంతో అనుబంధ కమిటీలను కొలిక్కి తెస్తాన’ని టీడీపీ జిల్లా అఽధ్యక్షుడు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) స్పష్టం చేశారు.
ఘనంగా టీడీపీ జిల్లా కార్యవర్గ ప్రమాణ స్వీకారం
ఏలూరు, జనవరి 23(ఆంధ్రజ్యోతి):‘పార్టీ బలోపేతానికి చిత్తశుద్ధితో పనిచేస్తా. నాపై సీఎం చంద్రబాబు, లోకేశ్ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేత లతో కలిసి ఏకాభిప్రాయంతో అనుబంధ కమిటీలను కొలిక్కి తెస్తాన’ని టీడీపీ జిల్లా అఽధ్యక్షుడు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) స్పష్టం చేశారు. ఏలూరులో శుక్రవారం టీడీపీ జిల్లా కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. అధ్యక్షుడిగా చంటి, ప్రధాన కార్యదర్శిగా జగ్గవరపు ముత్తారెడ్డిలతో రాష్ట్ర ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు ప్రమాణం చేయించారు. ఉపాధ్యక్షులు కవల కోదండ రాంబాబు, కార్యాలయ కార్యదర్శి ఉప్పాల జగదీష్‌బాబు, మీడియా కో–ఆర్డినేటర్ చల్ల ప్రసాద్ తదితర 42 మంది కార్యవర్గ సభ్యులు ప్రమాణం చేశారు. చంటి మాట్లాడుతూ వారంలో నాలుగు రోజులపాటు సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల వరకు పార్టీ జిల్లా కార్యాలయంలో అందుబాటులో ఉంటానన్నారు.
వైసీపీ నీచ రాజకీయాలకు చరమగీతం
మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ ప్రభుత్వం తప్పులు చేయకపోయినా వైసీపీ బురద చల్లుతోంది. ఆ పార్టీ నీచ రాజకీ యాలకు చరమగీతం పాడదాం. అధిష్ఠానం అనుమతితోనే ఇతర పార్టీల నుంచి కూటమిలోకి తీసుకుంటామన్నారు. ‘రాబోయే రోజు ల్లో చంద్రబాబు, లోకేశ్‌ల లక్ష్యాలకు అనుగుణంగా మనం ప్రజల పక్షాన నిలవాలని ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌యాదవ్ అన్నా రు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ రానున్న వేరే పార్టీల నుంచి ముసుగు తొడుక్కుని మన పార్టీలోకి వచ్చిన కోవర్టుల పని పట్టకపోతే తనకే కాదు మీ నియోజకవర్గాల్లోను ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఎన్నికల్లోను కూటమి నేతలే విజయం సాధించేలా కృషి కొనసాగిద్దామని ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు అన్నారు. జోనల్ ఇన్‌చార్జి మంద లపు రవి మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో టీడీపీ కార్యాలయాల ఏర్పాటుకు స్థలాలను సమకూర్చాల్సిన బాధ్యతను కమిటీ, ఇతర నేతలు, ప్రజా ప్రతినిధులు తీసుకోవాలన్నారు. జిల్లా కార్యదర్శి జగ్గవరపు ముత్తారెడ్డి మాట్లాడుతూ పార్టీని బలోపేతా నికి కృషి చేస్తానన్నారు. మాజీ మంత్రులు పీతల సుజాత, పితాని సత్యనారాయణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం లక్ష్యాల సాధన కు అంతా కృషి చేయాలన్నారు. ఎమ్మెల్యేలు సొంగా రోషన్, మద్దిపాటి వెంకట్రాజు, మాజీ ఎమ్మెల్యేలు అంబికా కృష్ణ, ఘంటా మురళి, మరడాని రంగారావు, సీనియర్ నాయకులు మండవ లక్ష్మణరావు, గంగిరెడ్డి మేఘలాదేవి, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజ శేఖర్, మేయర్ నూరహాన్, విజయవాడ ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, జడ్పీ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ, వడ్డీ కార్పొ రేషన్ చైర్మన్ ఘంటసాల లక్ష్మి, మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్, ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాస్, కైక లూరు క న్వీనర్ వీరమల్లు నరసింహారావు తదితరులు పాల్గొని కార్యవర్గాన్ని అభినందించారు.