Share News

విద్యుత్‌ పొదుపుపై నేడు ఏపీఈపీడీసీఎల్‌ వెబినార్‌

ABN , Publish Date - Mar 12 , 2026 | 12:38 AM

విద్యుత్‌ వినియోగాన్ని సమర్ధ వంతంగా నిర్వహించటం ద్వారా తమ విద్యుత్‌ ఖర్చులను తగ్గించుకునే అవకాశాలపై వినియోగదారులకు అవగాహన కల్పించేందుకు ఏపీఈపీ డీసీఎల్‌ ప్రత్యేక వెబినార్‌ నిర్వహించనుంది.

విద్యుత్‌ పొదుపుపై నేడు ఏపీఈపీడీసీఎల్‌ వెబినార్‌

విద్యుత్‌ పొదుపుపై నేడు ఏపీఈపీడీసీఎల్‌ వెబినార్‌

జయప్రదం చేయాలన్న ఎస్‌ఈ సాల్మన్‌రాజు

ఏలూరుసిటీ, మార్చి 11(ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ వినియోగాన్ని సమర్ధ వంతంగా నిర్వహించటం ద్వారా తమ విద్యుత్‌ ఖర్చులను తగ్గించుకునే అవకాశాలపై వినియోగదారులకు అవగాహన కల్పించేందుకు ఏపీఈపీ డీసీఎల్‌ ప్రత్యేక వెబినార్‌ నిర్వహించనుంది. పరిశ్రమలు, వాణిజ్య విని యోగదారుల కోసం ఎనర్జీ అండ్‌ కాస్ట్‌ సేవింగ్స్‌ , డిమాండ్‌ రెస్పాన్స్‌ అనే అంశంపై మార్చి 12వ తేదీ మధ్యాహ్నం 3గంటలకు ఆన్‌లైన్‌ వెబి నార్‌ నిర్వహిస్తున్నట్టు జిల్లా విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ పి.సాల్మన్‌రాజు బుధవారం తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఏపిఇపిడిసిఎల్‌ చైర్మన్‌ అండ్‌ సిఎండి ఇమ్మడి పృధ్వీతేజ్‌ ఆదేశాల మేరకు , మద్రాస్‌ ఐఐటి కి చెందిన ఎనర్జీ టెక్నాలజీ స్టార్టప్‌ సంస్థ, ఎలిమెంట్స్‌ ఎనర్జీ భాగస్వామ్యంతో కమర్షియల్‌ విభాగం అధికారులు ఈ వెబినార్‌ నిర్వహిస్తారని ఆయన వివరించారు. ప్రతిపాదిత టైమ్‌ ఆఫ్‌ డే విధానం ప్రకారం హైటెన్షన్‌ వినియోగదారులకు ఆదయం 5 నుంచి 9గంటల వరకు, సాయంత్రం 7గంటల నుంచి 11 గంటల వరకు పీక్‌ సమయాలుగా పరిగణించి అదనపు టారీఫ్‌ అమలు చేయనున్నారన్నారు. అలాగే ఉదయం 9 నుంచి సాయంత్రం 5గంటల వరకు ఆప్‌–పీక్‌ సమయాల్లో తగ్గించిన టారీప్‌ ప్రయోజనం అందుబాటులో ఉండనున్నాయన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పరిశ్రమలు, వాణిజ్య వినియోగదారులు విద్యుత్‌ వినియోగాన్ని సమర్ధవంతంగా నిర్వహించటం ద్వారా విద్యుత్‌ బిల్లుల్లో పొదుపు సాధిం చటంతోపాటు విద్యుత్‌ గ్రిడ్‌పై ఒత్తిడిని తగ్గించటంలో సహకరించాల న్నారు. ఏపిఇపిడిసిఎల్‌ ఫరిధిలోని పరిశ్రమలు, వాణిజ్య వినియోగదా రులు ఈ వెబినార్‌లో పాల్గొనాలని అన్నాన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యుత్‌ వినియోగాన్ని మెరుగుపరిచిన పరిశ్రమ, వాణిజ్య విభా గాల్లోని ఉత్తమ ప్రదర్శన కనబరిచిన వినియోగదారులకు మొత్తంగా 10 లక్షల రూపాయల ప్రోత్సాహకాలను అందజేయనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన దలచిన వినియోగదారులు వివరాల కోసం ఏపిఇపిడిసిఎల్‌ సీజీఎం (వాణిజ్యం) ఎస్‌.రాజబాబు, ఎలిమెంట్స్‌ ఎనర్జీ పౌండర్‌ ఆన్సన్‌ సాండో వారిని సంప్రదించాలన్నారు.

Updated Date - Mar 12 , 2026 | 12:38 AM