Share News

నేడు శ్రీవారి తెప్పోత్సవం

ABN , Publish Date - Nov 20 , 2026 | 11:56 PM

ప్రముఖపుణ్యక్షేత్రం ద్వారకాతిరుమలలో శ్రీవారికి తెప్పోత్సవాన్ని అంగరంగవైభవంగా నిర్వహించేందుకు దేవస్దానం అన్ని ఏర్పాట్లు చేసింది.

నేడు శ్రీవారి తెప్పోత్సవం
సాగరం నడుమ విద్యుత్‌ కాంతుల్లో మండపం

సర్వాంగ సుందరంగా ద్వారకాతిరుమల తిరుమల వెంకన్న పుష్కరిణి

ద్వారకాతిరుమల, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): ప్రముఖపుణ్యక్షేత్రం ద్వారకాతిరుమలలో శ్రీవారికి తెప్పోత్సవాన్ని అంగరంగవైభవంగా నిర్వహించేందుకు దేవస్దానం అన్ని ఏర్పాట్లు చేసింది. క్షీరాభ్ది ద్వాదశి పర్వదినమైన శనివారం నాడు రాత్రి స్వామివారు ఉభయదేవేరులతో కలసి సుదర్శనపుష్పరిణిలో విహరిస్తారు. ఇందునిమిత్తం దేవస్దానం ఇప్పటికే పుష్కరిణిని సర్వాంగసుందరంగా తీర్చిదిద్దింది. ఇందులో భాగంగా సాగరపరిసరాలను విద్యుత్‌ దీపకాంతులతో అలంకరించింది. అలాగే స్వామి, అమ్మవార్లు విహరించే తెప్పను హంసవాహనం గా అలంకరిస్తున్నారు. పుష్కరిణి ముందు భారీ విద్యుత్‌ కటౌట్‌లను ఏర్పాటు చేసారు. శనివారం రాత్రి శ్రీవారు, ఉభదేవేరులతో కలసి ప్రత్యేక వాహనంలో తిరువీథుల్లో తిరిగి పుష్కరిణి వద్దకు చేరుకుంటారు. అక్కడ తెప్పను అదిరోహించి అట్టహాసంగా పుష్కరిణిలో విహరిస్తారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు భక్తులు త రలిరావాలని ఈఓ ఎన్వీ త్రినాధరావు కోరారు.

నేత్రపర్వంగా.. శ్రీవారికి ఏకాదశి ఉత్సవం

ఉభయదేవేరులతో చినవెంకన్నకు శుక్రవారం రాత్రి క్షేత్ర పురవీథుల్లో జరిగిన ఏకాదశి ఉత్సవం భక్తులను అలరించింది. ముందుగా ఆల యంలో స్వామి, అమ్మవార్లను తొళక్కవాహనంపై ఉంచి ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఆలయ ప్రధాన రాజ గోపురం మీదుగా అట్టహాసంగా తిరువీధులకు తీసుకొచ్చారు. ప్రతి ఇంటి ముందు భక్తులు స్వామవారి మూర్తులకు హారతులు పట్టారు.

Updated Date - Nov 20 , 2026 | 11:56 PM