నేటి నుంచి శోభనాచలుని కల్యాణోత్సవాలు
ABN , Publish Date - Jan 19 , 2026 | 12:32 AM
ఆగిరిపల్లిలోని శోభనచల వ్యాఘ్ర లక్ష్మీనరసింహస్వామి మాఘమాస రథసప్తమి కల్యాణోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభమై ఈనెల 29వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి.
ఆగిరిపల్లి, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): ఆగిరిపల్లిలోని శోభనచల వ్యాఘ్ర లక్ష్మీనరసింహస్వామి మాఘమాస రథసప్తమి కల్యాణోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభమై ఈనెల 29వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. తొలిరోజు సోమవారం సాయంత్రం స్వామివారిని చంద్రప్రభ వాహనంపై ఊరేగింపుగా కల్యాణ మండపంలోకి తీసుకువచ్చి రాత్రి 9గంటలకు నిత్య కల్యాణాన్ని నిర్వహిస్తారు. 20న హనుమద్ వాహనోత్సవం, 21న ఆశ్వవాహనోత్సవం, 22న గజ వాహనోత్సవం, 23న పెద్ద శేష వాహనోత్సవం, 24 గరుడోత్సవంతో స్వామి భక్తులకు దర్శనమిస్తారు. 25న మాఘమాస రథసప్తమి సందర్భంగా కల్పవృక్ష వాహనోత్సవం, 26న స్వామి దివ్య రథోత్సవం, 27న చిన్న శేష వాహనతోత్సవం, 28న చిన్న గరుడ వాహనోత్సవం, 29న రజత ఉయల ఉత్సవం, శ్రీ పుష్పయాగం, శాంతి కల్యాణోత్సవంతో ఉత్సవాలు ముగు స్తాయని ఈవో సీహెచ్ సాయి తెలిపారు. లక్ష్మీ నర సింహస్వామి వ్యాఘ్ర రూపంలో శోభనగిరిపై వెలియడం తో స్వామి శోభనచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామిగా పిలవబడుతున్నారని చరిత్ర చెబుతోంది. శోభనగిరి శిఖర భాగాన శివుడు మల్లికార్జునస్వామిగా దిగువ భాగాన విష్ణుమూర్తి లక్ష్మీనరసింహస్వామిగా శివకేశవులు ఇద్దరు కొలువై ఉండడం విశేషం.