నేటి నుంచి మద్దిలో పవిత్రోత్సవాలు
ABN , Publish Date - Sep 20 , 2026 | 12:38 AM
గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈనెల 20 నుంచి 23 వరకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తామని ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రాజాన సత్యనారాయణ, ఈవో చందన తెలిపారు.
మూడు రోజుల పాటు గర్భాలయ దర్శనం నిలిపివేత
జంగారెడ్డిగూడెం రూరల్, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి) : గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఈనెల 20 నుంచి 23 వరకు పవిత్రోత్సవాలు నిర్వహిస్తామని ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షుడు రాజాన సత్యనారాయణ, ఈవో చందన తెలిపారు. ఈ నేపథ్యంలో ఈనెల 20వ తేదీ ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 23వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకు భక్తులకు గర్భాలయ దర్శనం, సేవలను నిలిపివేస్తామన్నారు. ఈ సమయంలో భక్తులకు అంతరాలయ దర్శనం మాత్రమే అందుబాటులో ఉంటుందన్నారు. శనివారం సందర్భంగా స్వామికి పంచామృత అభిషేకాన్ని ఆలయ అర్చకులు, వేద పండితులు నిర్వహించారు. పలు సేవల రూపంలో దేవస్థానంకు రూ.1,25,340 ఆదాయం వచ్చిందని, నిత్యాన్నదాన సత్రంలో 1,850 మంది భక్తులకు అన్నప్రసాదాన్ని అందజేసినట్టు వారు తెలిపారు.