నేటి నుంచి ఏపీ జేఏసీ ఉద్యమ బాట
ABN , Publish Date - Sep 01 , 2026 | 12:33 AM
ఉద్యోగుల 29 న్యాయమైన డిమాండ్ల సాధనకు ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు డిమాండ్ల సాధనకై చేపట్టనున్న ఉద్యమ కార్యాచరణకు ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల ఏపీ జేఏసీ చైర్మన్లు కె.రమేష్ కుమార్, ఐ.వి.వి. సత్యనారాయణ పిలుపునిచ్చారు.
ఏలూరురూరల్/భీమవరం టౌన్, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): ఉద్యోగుల 29 న్యాయమైన డిమాండ్ల సాధనకు ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు డిమాండ్ల సాధనకై చేపట్టనున్న ఉద్యమ కార్యాచరణకు ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల ఏపీ జేఏసీ చైర్మన్లు కె.రమేష్ కుమార్, ఐ.వి.వి. సత్యనారాయణ పిలుపునిచ్చారు. సోమవారం ఏలూ రులో ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, భీమవరంలో పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణికి ఆయా జిల్లాల జేఏసీ చైర్మన్ల ఆధ్వర్యంలో సంబంధిత నోటీసులను అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెప్టెంబరు 1 నుంచి 5 వరకు నల్ల బ్యాడ్జీలు, 2 నుంచి 8 వరకు హ్యాండ్ టు హ్యాండ్ కార్యక్రమం, 3, 5 తేదీల్లో భోజన విరామ సమయంలో నిరసనలు, 11న రౌండ్‌టేబుల్ సమావేశాలు, 15 నుంచి 26 వరకు వర్క్‌టురూల్, 17న మానవహారం, 23న ధర్నా, 26న ఉద్యోగులు, కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా నిర్వహించనున్నట్టు తెలిపారు. ఉద్యోగుల బకాయిలు, పీఆర్సీ, ఐఆర్, డీఏ తదితర సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఏలూరులో జనరల్ సెక్రెటరీ బి.రాంబాబు, మహిళా విభాగం చైర్‌పర్సన్ గీతిక, వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. భీమవరంలో ఏపీజేఏసీ అమరావతి జిల్లా జనరల్ సెక్రటరీ అల్లం సత్యనారాయణ, మహిళా విభాగం చైర్‌పర్సన్ సుగుణ సంధ్య, జేఏసీ ట్రెజరర్ ఎం.కనకారావు, ఏపీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగుల జిల్లా చైర్మన్ జేమ్స్ జనరల్ సెక్రటరీ ఎస్.సత్యనారాయణరాజు, భీమవరం ఏరియా రిటైర్డ్ ఉద్యోగుల అధ్యక్షుడు సీతారామరాజు, పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు.