నేటి నుంచి అగ్రిగోల్డ్ బాండ్ల పరిశీలన
ABN , Publish Date - Oct 08 , 2026 | 11:47 PM
అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం త్వరితిగతిన న్యాయం చేయడా నికి చర్యలు చేపట్టింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఐదుగు రు సభ్యులతో కూడిన మంత్రుల కమిటీని అగ్రిగోల్డ్ డిపాజిట్‌ల సమస్యలు పరిష్కరించేందుకు కమిటీని ఏర్పాటు చేసింది.
నేడు, రేపు ఆచంట, నిడమర్రు మండలాల బాధితుల నుంచి స్వీకరణ
ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రత్యేక శిబిరం
ఏలూరు క్రైం, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి) : అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం త్వరితిగతిన న్యాయం చేయడా నికి చర్యలు చేపట్టింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఐదుగు రు సభ్యులతో కూడిన మంత్రుల కమిటీని అగ్రిగోల్డ్ డిపాజిట్‌ల సమస్యలు పరిష్కరించేందుకు కమిటీని ఏర్పాటు చేసింది. బాధితులు, ఏజెంట్ల నుంచి అగ్రిగోల్డ్ బాండ్ల కలర్ జిరాక్స్ కాపీలు, ఇతర వివరాల ధ్రువపత్రాలను స్వీకరించడానికి ఈనెల 9వ తేదీ నుంచి రాష్ట్రంలో పలు జిల్లాల్లో ప్రత్యేక శిబిరాలను జిల్లా పోలీస్ కార్యాలయాల్లో ఏర్పాటు చేస్తున్నారు. రోజుకు రెండు మండలాలకు సంబం ధించి అగ్రిగోల్డ్ బాధితులు, ఏజెంట్లు, బాధితులు మరణిస్తే వారి వారసుల నుంచి ధ్రువపత్రా లను స్వీకరించనున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించి ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఇద్దరు సీఐడీ అధికారులను పరిశీలకు లుగా నియమించింది. ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఇన్‌స్పెక్టర్ జేమ్స్ రత్నప్రసాద్, వి.వెంకటేశ్వరరావులను సీఐడీ విభాగం నియమించింది. ఈనెల 9, 10వ తేదీల్లో ఆచంట, నిడమర్రు మండలాల అగ్రిగోల్డ్ డిపాజిట్‌దార్లు, ఏజెంట్లు, ఒకవేళ డిపాజిట్‌దారులు మరణిస్తే వారి వారసులు, డిపాజిట్‌దారులు కదల లేని స్థితిలో అనారోగ్యంతో ఉంటే వారి తరఫున ఎవరైనా హాజరై సంబంధిత ధ్రువపత్రాలను అందించాల్సి ఉంటుంది. ఒరిజినల్ బాండ్, క్యాష్‌రసీదు, ఇతర సంబంధిత పత్రాలు పరిశీలన కోసం తీసుకురావాలి. ఒరిజినల్ బాండ్ కలర్ జిరాక్స్‌పై సంతకం చేసి ఇవ్వాలి. ఆధార్‌కార్డు, ఇతర గుర్తింపు కార్డులు, బ్యాంక్ పాస్‌బుక్ మొదటి పేజీ, డిపాజిట్‌దారుని ఫోన్‌నెంబర్లు అందించాలి. ఈ రెండు మండలాల బాధితులు ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరం ఉదయం 10 నుంచి 5 గంటలలోపు ధ్రువపత్రాలు సమర్పిం చాలని సూచించారు. మిగిలిన మండలాలకు సంబంధించిన వారికి ఏ తేదీల్లో పరిశీలన చేస్తారో తెలియపరుస్తామన్నారు.