నేటి నుంచి వంతుల వారీగా..
ABN , Publish Date - Feb 01 , 2026 | 12:24 AM
దాళ్వాకు ఆదివారం నుంచి వంతుల వారీ విధానంలో సాగు నీటిని విడుదల చేయనున్నారు. జిల్లాలో ప్రధాన కాలువలైన జీఅండ్‌వీ, అత్తిలి కాలువలకు రెండు వంతులుగా నీరు వదలనున్నారు.
జీఅండ్‌వీ, అత్తిలి కాలువలకు నీటి విడుదల
ఆరు రోజులకు ఒక వంతు.. మార్చి నెలాఖరు వరకు
జిల్లాలో 2 లక్షల 20 వేల పైగా దాళ్వా నాట్లు పూర్తి
భీమవరం రూరల్, జనవరి 31(ఆంధ్రజ్యోతి):దాళ్వాకు ఆదివారం నుంచి వంతుల వారీ విధానంలో సాగు నీటిని విడుదల చేయనున్నారు. జిల్లాలో ప్రధాన కాలువలైన జీఅండ్‌వీ, అత్తిలి కాలువలకు రెండు వంతులుగా నీరు వదలనున్నారు. వీటిలో ఈ నెల 1వ తేదీ ఉదయం ఆరు నుంచి 7వ తేదీ ఉదయం ఆరు గంటల వరకు మొదటి వంతుకు, ఏడో తేదీ సాయంత్రం ఆరు గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు రెండో వంతుకు నీటిని సరఫరా చేస్తారు. ఇలా మార్చి నెలాఖరు వరకు ఆరేసి రోజులపాటు కొనసాగుతుంది. జిల్లాలో రెండు లక్షల 25 వేల ఎకరాల్లో దాళ్వా సాగు జరుగుతుంది. ఇప్పటి వరకు 99 శాతం రెండు లక్షల 20 వేల ఎకరాల్లో నాట్లు పూర్తయ్యాయి. నాట్లు వేసిన చోట ఎక్కడా సాగు నీటి ఇబ్బందులు లేనందున వంతుల వారీ విధానంలో సరిపడా నీరందుతుందని అధికారుల అంచనా.
మొదటి వంతు తేదీలు : ఫిబ్రవరి 1 నుంచి 7 వరకు, 14 నుంచి 20 వరకు, 27 నుంచి మార్చి 5 వరకు, 12 నుంచి 16 వరకు, 25 నుంచి 31వ తేదీ వరకు.
రెండో వంతు తేదీలు : ఫిబ్రవరి 7 నుంచి 13 వరకు, 20 నుంచి 26 వరకు, మార్చి 5 నుంచి 11 వరకు, 18 నుంచి 24 వరకు, 31 నుంచి ఏప్రిల్ 6 వరకు.
మొదటి వంతు (అత్తిలి కాలువ) : వేల్పూరు(తణుకు), కావలిపురం, రేలంగి (ఇరగవరం), పాలి, అత్తిలి, మంచిలి, పాలూరు, కొమ్మర, ఈడూరు, గుమ్మంపాడు, ఆరవల్లి, కంచుమర్రు, స్కిన్నెరపురం, ఉనికిలి, ఎల్‌ఎన్ పురం(అత్తిలి), రామేశ్వరం, జుత్తిగ, పెనుమంట్ర, మాముడూరు (పెనుమంట్ర), కోరుకొల్లు, మైప, గరగపర్రు, వేండ్ర, మోగల్లు (పాలకోడేరు), ఎస్.కొండేపాడు (గణపవరం) గ్రామాలకు..
మొదటి వంతు (జీ అండ్ వీ కాలువ) : వేండ్ర, పెన్నాడ, శృంగవృక్షం, కొండేపూడి, వేండ్ర అగ్రహారం, గొరగనమూడి, పాలకోడేరు, విస్సాకోడేరు, మోగల్లు, కుముదవల్లి (పాలకోడేరు), తాడేరు, భీమవరం, గునుపూడి, యనమదుర్రు, వెంప, దిరుసుమర్రు (భీమవరం), పెర్కిపాలెం, వీరవాసరం, మెంటేపూడి, బాలేపల్లి, మత్స్యపురి, తోలేరు, బొబ్బనపల్లి (వీరవాసరం) కాళీపట్నం (మొగల్తూరు) గ్రామాలకు..
రెండో వంతు (అత్తిలి కాలువ) : డి.కుముదవల్లి, కొమర్రు, మొయ్యేరు, ముప్పర్తిపాడు, కేశవరం, వెంకటరాజపురం, పిప్పర (గణపవరం), శెట్టిపేట (నిడదవోలు), కాల్దరి, మోర్త, పసలపూడి, చిలకపాడు, సత్యవాడ, చివటం, వట్లూరు, సూర్యరావుపాలెం (ఉండ్రాజవరం), తేతలి, దువ్వ, పైడిపర్రు, మండపాక, వేల్పూరు (తణుకు), వరిగేడు, బల్లిపాడు, తిరుపతిపురం, గుమ్మంపాడు, అత్తిలి, కొమ్మర, ఉరదాళ్ళపాలెం (అత్తిలి), బి.కొండేపాడు, మీనవల్లూరు (పెంటపాడు) గ్రామాలకు..
రెండో వంతు (జీ అండ్ వీ కాలువ)
శృంగవృక్షం (పాలకోడేరు), వీరవాసరం, మత్స్యపురిపాలెం, మత్స్యపురి, దూసనపూడి, నేలపోగుల, మడుగు పోలవరం, రాయకుదురు, అండలూరు, కొణితివాడ, పంజా వేమవరం, తోకలపూడి, నవుడూరు (వీరవాసరం), ఇరగవరం, కావలిపురం (ఇరగవరం), ఎస్.ఐ. పర్రు, మల్లినీడు, జుత్తిగ, పెనుమంట్ర, భట్లమగుటూరు, పొలమూరు, మాముడూరు (పెనుమంట్ర), తుందుర్రు, తాడేరు, బేతపూడి, దిరుసుమర్రు, వెంప(భీమవరం), కంసాలబేతపూడి (నరసాపురం).