Share News

పురాల్లో నేడే పోలింగ్‌

ABN , Publish Date - Nov 01 , 2026 | 01:00 AM

పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలోని ఏలూరు నగర పాలక సంస్థతోపాటు నూజివీడు, జంగా రెడ్డిగూడెం, నరసాపురం, ఆకివీడు మునిసిపాలిటీ లకు ఆదివారం ఉదయం పోలింగ్‌ జరగనుంది.

పురాల్లో నేడే పోలింగ్‌
ఏలూరులోని సీఆర్‌రెడ్డి పబ్లిక్‌ స్కూల్లో మున్సిపల్‌ ఎన్నికల మెటీరియల్‌ సరిచూసుకుంటున్న సిబ్బంది

ఏలూరు కార్పొరేషన్‌, జంగారెడ్డిగూడెం, నూజివీడుల్లో సర్వం సిద్ధం

మూడుచోట్ల మొత్తం 376 పోలింగ్‌ కేంద్రాలు.. 3,28,671 మంది ఓటర్లు

11 మంది జోనల్‌ అధికారులు, 31 మంది రూట్‌ అధికారుల నియామకం

99 సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు.. పకడ్బందీగా బందోబస్తు

ఏలూరుసిటీ/ఏలూరు టూటౌన్‌/ జంగారెడ్డిగూడెం/నూజివీడు టౌన్‌, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలోని ఏలూరు నగర పాలక సంస్థతోపాటు నూజివీడు, జంగా రెడ్డిగూడెం, నరసాపురం, ఆకివీడు మునిసిపాలిటీ లకు ఆదివారం ఉదయం పోలింగ్‌ జరగనుంది. ఈ మేరకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఐదుగంటల వరకు నిర్వహించే పోలింగ్‌కు భారీ భద్రతతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అధికార కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ ఒక వైపు.. ప్రతిపక్ష వైసీపీతోపాటు కమ్యూనిస్టులు, కాంగ్రెస్‌ పార్టీల అభ్యర్థులు తలబడుతున్నారు. ఈసారి ప్రత్యక్ష పద్ధతిలో మేయర్‌, చైర్మన్‌ను ఎన్నుకోనుండటంతో ప్రతి ఓటరు రెండు ఓట్లు వేయాల్సి ఉంటుంది. కౌన్సిలర్‌ ఏకగ్రీవ మైనచోట చైర్మన్‌కు మాత్రమే ఓటు వేయాలి.

ఏలూరు నగరపాలక సంస్థతో పాటు జిల్లా లోని నూజివీడు, జంగారెడ్డిగూడెం పుర పాలక సంఘాల్లో నేడు పోలింగ్‌ జరు గు తుందని, ఈ మేరకు పటిష్ఠ ఏర్పాట్లు చేసినట్టు కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి తెలిపారు. స్థానిక సీఆర్‌ఆర్‌ పబ్లిక్‌ స్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ మెటీరియల్‌ పంపిణీ కేంద్రంలో శనివారం పోలింగ్‌ సిబ్బందికి పోలింగ్‌ మెటీరియల్‌ పంపిణీని జేసీ అభిషేక గౌడతో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘జిల్లాలో ఏలూరు నగరపాలక సంస్థ, నూజివీడు, జంగారెడ్డిగూడెం పురపాలక సంఘాలకు సంబంధించి 130 వార్డులు, డివిజన్లలో కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, మేయర్‌, చైర్‌పర్సన్‌ల ఎన్నికల నిమిత్తం 376 పోలింగ్‌ కేంద్రాల్లో 3,28,671 మంది ఓటర్లు తమ ఓటు హక్కు విని యోగిం చుకుంటారు. పోలింగ్‌ నిమిత్తం 11 మంది జోనల్‌ అధికారులు, 31 మంది రూట్‌ అధికారు లను నియమించాం. గతంలోని ఘటనలను అనుసరించి 99 సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలుగా గుర్తించి ఆయాచోట్ల అదనపు భద్రతా చర్యలు తీసు కున్నాం. ఒక్కొక్క పోలింగ్‌ కేంద్రంలో ప్రిసైడింగ్‌ అధికారి, అదనపు పీవోతో పాటు ముగ్గురు ఇతర పోలింగ్‌ సిబ్బందిని, మైక్రో పరిశీలకులను నియమించాం. వీరు పోలింగ్‌ సామగ్రితో పాటు వాహనాల లో పోలింగ్‌ కేంద్రానికి రూట్‌ అధి కారి నేతృత్వంలో తరలివెళ్లారు. ఆదివారం ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ ప్రక్రియ జరుగు తుంది. ప్రజలు నిర్దేశించిన సమయం లోగా పోలింగ్‌ కేంద్రానికి చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని’ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఆమె వెంట అసిస్టెం ట్‌ కలెక్టర్‌ శ్రావణ్‌కుమార్‌ రెడ్డి, ఏలూరు ఆర్డీవో లక్ష్మీప్రసన్న, ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్‌ భానుప్రతాప్‌, డీఎస్పీ శ్రావణ్‌కుమార్‌ , ఏలూరు తహసీల్దార్‌ పాల్గొన్నారు.

పోలింగ్‌ కేంద్రాలకు తరలిన సామగ్రి

ఏలూరు నగరపాలక సంస్థ, నూజివీడు, జంగారెడ్డిగూడెం పురపాలక సంఘాల పరిధిలోని పోలింగ్‌ కేంద్రాలకు బందోబస్తు నడుమ పోలింగ్‌ సామగ్రిని బస్సులలో పోలింగ్‌ సిబ్బంది తీసుకెళ్లారు. పోలింగ్‌ సిబ్బందికి పోలింగ్‌ సామగ్రిని అందించ డానికి ఏలూరు సర్‌ సీఆర్‌ఆర్‌ పబ్లిక్‌ స్కూల్‌లో పోలింగ్‌ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని సంబందిత అధికారులు పర్యవేక్షించారు.

ఏలూరు నగరంలో..

ఏలూరు నగర పాలక సంస్థకు ఆదివారం జరగనున్న ఎన్నికలకు సర్వం సిద్ధంగా ఉన్నామని కమిషనర్‌ భానుప్రతాప్‌ శనివారం తెలిపారు. ఆయన మాట్లాడుతూ ‘నగరంలో 62 డివి జన్లలో ఏ సమస్యలు లేవు. సమస్యాత్మక ప్రాంతాలు లేవు. అయినా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం. నగరంలో 2,37, 325 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఒక్కొ డివిజన్‌కు 3 నుంచి 4 పోలింగ్‌ బూత్‌ల చొప్పున మొత్తం 255 బూత్‌లు ఏర్పాటు చేశాం. 62 డివిజన్లకు 334 మంది, మేయర్‌ అభ్యర్థులు 9 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. ఓటర్లు తమ ఓటు ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు ‘వేర్‌ ఈజ్‌ మై ఓట్‌’ లింక్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాం. ఇప్పటికే నగర పాలక సిబ్బంది ఓటర్‌ స్లిప్పులు ఇంటింటికీ పంపిణీ చేశారు. పోలింగ్‌ బూత్‌ల వద్ద ఓటర్ల కోసం తాగునీరు, లైట్లు, ఫ్యాన్లు ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశా’మన్నారు.

జంగారెడ్డిగూడెంలో..

పట్టణంలో మున్సిపల్‌ ఎన్నికలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. జేసీ అభిషేక్‌గౌడ సమక్షంలో శనివారం ఎన్నికల సిబ్బందికి పోలింగ్‌ సామగ్రి స్థానిక మార్కెట్‌ యార్డు ఆవరణలో పంపిణీ చేశారు. జేసీతో కలిసి ఆర్డీవో ఎంవి.రమణ ఎన్నికల సామగ్రిని పరిశీలించారు. అనంతరం స్థానిక ప్రైవేటు పాఠశాలల బస్సుల్లో పోలింగ్‌ సిబ్బంది ఆయా పోలింగ్‌ సిబ్బందికి తరలివెళ్లారు. పట్టణంలో 32 వార్డులకు 64 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేయగా 48,463 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇప్పటికే పట్టణంలో సచివాలయ సిబ్బంది ఓటరు స్లిప్పులను పంపిణీ చేశారు. పట్టణంలో పది సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు, పది అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి.వీటి వద్ద పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేయడంతో పాటు వెబ్‌ కాస్టింగ్‌ కెమెరాలు ఏర్పాటు చేశారు.

నూజివీడులో..

నూజివీడు మున్సిపల్‌ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. నేడు జరిగే ఎన్నికల్లో 42,952 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. మున్సిపల్‌ పరిధిలో 36 వార్డులు ఉండగా 57 పోలింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేశారు. నాలుగు జోన్లుగా ఏడు రూట్‌లను విభజించగా శనివారం నూజివీడు శ్రీసారథి ఇంజనీరింగ్‌ కళాశాలలో పోలింగ్‌ సామగ్రిని పోలింగ్‌ ఆఫీసర్లకు అందించారు. మున్సిపల్‌ పరిధిలో 285 మంది పోలింగ్‌ సిబ్బందిని నియమించగా వారిని పోలింగ్‌ సామగ్రితో పోలింగ్‌ స్టేషన్లకు తరలించారు.

అప్రమత్తంగా విధులు నిర్వర్తించండి : ఎస్పీ

ఏలూరు క్రైం : ఎన్నికల నిర్వహణలో అప్రమత్తత, సమన్వయం, నిష్పక్షపాతంగా విధులు నిర్వహణ కీలకం అని పోలింగ్‌ కేంద్రాల వద్ద అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పటిష్ఠ భద్రతా చర్యలు తీసుకోవాలని ఎస్పీ కేపీఎస్‌ కిశోర్‌ ఆదేశించారు. ఏలూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం నిర్వహించనున్న ఎన్నికల విధుల కోసం నియమితులైన సిబ్బందికి ఏలూరు సీఆర్‌రెడ్డి పబ్లిక్‌ స్కూల్‌లో ఏర్పాటు చేసిన బ్యాలెట్‌ పేపర్‌ పంపిణీ కేంద్రం వద్ద విధుల నిర్వహణపై అవగాహన కార్యక్రమాన్ని ఎస్పీ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది తమ బాధ్యతలను క్రమశిక్షణతో, నిష్పక్షపాతంగా నిర్వహించాలన్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ఠ భద్రత, ప్రతి పోలింగ్‌ కేందరం వద్ద సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుందన్నారు. పోలింగ్‌ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో అమలులో ఉన్న నిషేదాజ్ఞలను ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. ఓటర్లు ఎలాంటి భయం, ఒత్తిడి, ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీస్‌ సిబ్బంది భరోసా కల్పించాలన్నారు. ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్‌కుమార్‌, ఏలూరు టౌన్‌ ఇన్‌స్పెక్టర్లు, సీఐలు, ఎస్‌ఐలు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

ఎన్నికల నిర్వహణకు పటిష్ఠ భద్రత

నూజివీడు : పటిష్ఠ భద్రత వ్యవస్థను ఏర్పాటు చేసి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ వెట్రిసెల్వి అధికారులకు సూచించారు. నూజివీడు శ్రీసారథి ఇంజనీరింగ్‌ కళాశాలలో మున్సిపల్‌ ఎన్నికల కౌంటింగ్‌ హాల్‌, స్ట్రాంగ్‌ రూమ్‌లను పట్టణంలోని పలు పోలింగ్‌ స్టేషన్లను ఎస్పీ ప్రతాప్‌ శివకిశోర్‌లతో కలిసి కలెక్టర్‌ పరిశీలించి పలు సూచనలు చేశారు. ఒక దశలో కౌంటింగ్‌ ఏర్పాట్లను పరిశీలించి కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్‌ కలెక్టర్‌ వినూత్న, సీఐ నాగేంద్రకుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

కౌంటింగ్‌ కేంద్రాలను సిద్ధం చేయాలి..

ఏలూరుసిటీ : జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ కేంద్రాలను నవంబర్‌ 1వతేదీ నాటికి సిద్దం చేయాలని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్‌, కౌంటింగ్‌ ప్రక్రియల నిర్వహణపై శనివారం సాయంత్రం అధికారులతో కలెక్టర్‌ వెట్రిసెల్వి టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. మున్సిపల్‌, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ అనంతరం బ్యాలెట్‌ బాక్సులను స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రత పరచాలని, వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపధ్యంలో బ్యాలెట్‌ బాక్సులు తడిసిపోకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.

Updated Date - Nov 01 , 2026 | 01:00 AM