కొలువుదీరనున్న పురాధీశులు
ABN , Publish Date - Nov 23 , 2026 | 12:22 AM
జిల్లాలో ఏలూరు కార్పొరేషన్, నూజివీడు, జంగారెడ్డిగూడెం పట్టణాల్లో పాలకవర్గాలు కొలువుదీరేందుకు ఏర్పాట్లు జరిగాయి.
అట్టహాసంగా మూడు చోట్ల ఏర్పాట్లు
ఏలూరు డిప్యూటీ మేయర్‌గా పృఽథ్వీశారద ఖరారు
నేటితో ముగియనున్న ప్రత్యేకాధికారుల పాలన
ఏలూరు, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఏలూరు కార్పొరేషన్, నూజివీడు, జంగారెడ్డిగూడెం పట్టణాల్లో పాలకవర్గాలు కొలువుదీరేందుకు ఏర్పాట్లు జరిగాయి. ఈనెల ఒకటో తేదీన మూడుచోట్ల పురపాలక ఎన్నికలు జరగ్గా 3వ తేదీన జరిగిన ఓట్ల లెక్కింపులో కూటమి పార్టీలు హవా చాటాయి. ప్రత్యక్ష పోరులో మేయర్‌లు, చైర్మన్లు భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. ఏలూరు కార్పొరేషన్ మేయర్‌గా జనసేన అభ్యర్థి రెడ్డి అప్పల నాయుడు, ఘంటా మోహనరావు (వైసీపీ)పై 40,611 ఓట్లతో విజయదుందుబి మోగించారు. నూజివీడు మున్సిపల్ చైర్మన్‌గా బర్రే ఇళయ రాజా (టీడీపీ) కంచర్ల లవకుమార్ (వైసీపీ)పై, జంగారెడ్డి గూడెం చైర్మన్‌గా రొంగల అనూష (టీడీపీ) మేకా సత్యవతి (వైసీపీ)పై విజయం సాధించారు. ఇదిలా ఉండగా ఏలూరు డిప్యూటీ మేయర్‌గా ఎన్నికల్లో వరుసగా మూడోసారి విజయం సాధించిన పృఽథ్వీశారదను ఖరారు చేశారు. నూజివీడు, జంగారెడ్డిగూడెంలో వైస్ చైర్మన్ల ఎంపిక ఇంకా కొలిక్కి రాలేదు. సోమ వారం ఉదయం నాటికి వైస్ చైర్మన్లు ఎవరద నేది తేలనుంది. తొలుత కార్పొరేటర్‌లు, కౌన్సి లర్ల చేత ప్రమాణం చేయించాక డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. ప్రత్యేకాధికారుల ఆధ్వర్యంలో మున్సిపల్ కమిష నర్లు పురపాలకుల పదవీ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తి చేశారు.
నేటితో ముగియనున్న ప్రత్యేకాధికారుల పాలన
కొత్త పాలకవర్గాలు సోమవారం కొలువుదీర నున్న నేపఽథ్యంలో మూడు పురాల్లోను ప్రత్యే కాధికారుల పాలన ముగియనుంది. ఏలూరు కార్పొరేషన్‌కు జేసీ అభిషేక్‌గౌడ్, నూజివీడు ము న్సిపాలిటీకి సబ్‌కలెక్టర్ వినూత్న, జంగారెడ్డి గూడెం మున్సిపాలిటీకి ఆర్డీవో రమణ ప్రత్యేకా ధికారులుగా వ్యవహరిస్తున్నారు.