Share News

నేడు మాధవాయిపాలెం రేవు, మునిసిపల్‌ మార్కెట్‌ పాటలు

ABN , Publish Date - Mar 30 , 2026 | 12:10 AM

పట్టణంలోని మునిసిపల్‌ కార్యాలయంలో సోమవారం రోజువారి మార్కెట్‌ పన్ను వసూళ్ల పాటను నిర్వహిస్తున్నట్లు కమిషనర్‌ వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఉదయం 11 గంటలకు మునిసిపల్‌ కౌన్సిల్‌ హాల్‌లో బహిరంగ వేలం పద్దతిలో పాట జరుగు తుందన్నారు.

నేడు మాధవాయిపాలెం రేవు, మునిసిపల్‌ మార్కెట్‌ పాటలు

నరసాపురం, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని మునిసిపల్‌ కార్యాలయంలో సోమవారం రోజువారి మార్కెట్‌ పన్ను వసూళ్ల పాటను నిర్వహిస్తున్నట్లు కమిషనర్‌ వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఉదయం 11 గంటలకు మునిసిపల్‌ కౌన్సిల్‌ హాల్‌లో బహిరంగ వేలం పద్దతిలో పాట జరుగు తుందన్నారు. మాధవాయిపాలెం– సఖినేటిపల్లి రేవు పాటను మండల పరిషత్‌ కార్యాలయంలో నిర్వహి స్తున్నట్లు ఇన్‌ఛార్జి ఎంపీడీవో వీరభధ్రరావు తెలిపారు. ఉదయం 10.30కి కార్యాలయ ప్రాంగణంలో పాట ఉంటుందన్నారు. పాట ప్రారంభ ధర రూ.3.57 కోట్లుగా నిర్ణయించామన్నారు. సాల్వెన్సీ కట్టిన ఇద్దరు పాట దారులు మాత్రమే పాటలో పాల్గొనే అవకాశం ఉంటు ందన్నారు. సీక్రెట్‌, బహిరంగ వేలం పద్దతిలో పాట జరుగుతుందన్నారు. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన పాట సోమవారం జరిగే పాటను పాటదారులు పాడుకుంటారా..? లేక మళ్లీ వాయిదా పడుతుందా? అన్న సందేహం నెలకొంది.

Updated Date - Mar 30 , 2026 | 12:10 AM