Share News

ఎల్‌ఆర్‌ఎస్‌..

ABN , Publish Date - Jan 22 , 2026 | 11:55 PM

జిల్లాలో అనుమతులు తీసుకోని లే–అవుట్లలో ఇళ్థ స్థలాలు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం విధించిన గడువు ఈనెల 23తో ముగుస్తోంది.

ఎల్‌ఆర్‌ఎస్‌..
ఏలూరు ఎంఆర్సీ కాలనీ సమీపంలో లేఅవుట్‌

నేటితో గడువు ముగింపు

ఇడాకు 4,789, పురాలకు 1,074 దరఖాస్తులు

పట్టణాల్లో ఆదాయం రూ.9.04కోట్లు.. పంచాయతీల్లో 21.19 కోట్లు

దరఖాస్తులు పరిష్కరిస్తే కోట్లలోనే ఆదాయం

జిల్లాలో అనుమతులు తీసుకోని లే–అవుట్లలో ఇళ్థ స్థలాలు, ప్లాట్ల క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం విధించిన గడువు ఈనెల 23తో ముగుస్తోంది. ఇడా పరిధిలో రియల్టర్లు, భవన యజమానుల నుంచి దరఖాస్తులు పోటెత్తగా, కార్పొరేషన్‌, మునిసి పాలిటీల్లో ఓ మోస్తరుగా దర ఖాస్తులు అందాయి. ఈ దరఖాస్తులను పరిష్కరిస్తే కోట్లలో ఆదాయం స్థానిక సంస్థలకు దక్కనుంది. వీటిపై వచ్చే ఆదాయాన్ని స్థాని కంగా అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు విని యోగించే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది.

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

జిల్లాలో ఏలూరు కార్పొరేషన్‌, నూజివీడు, జంగారెడ్డిగూడెం మున్సిపాల్టీలు, చింతలపూడి నగర పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిల్లో 1,074 దరఖాస్తులు రాగా, 228 ఆమోదం పొందాయి. దరఖాస్తు ఫీజుల రూపంలో 9కోట్ల4లక్షల50వేల రూపాయలు ఆదాయంగా సమకూరింది. వీటిని పరిష్కరిస్తే మరింత ఆదాయం సమకూరనుంది.

గత ప్రభుత్వ హయాంలో అనుమతుల్లేకుండా అడ్డగోలుగా లే–అవుట్లు వేశారు. వీటిల్లో స్థలాలు కొన్న ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న కూటమి ప్రభుత్వం వాటిని క్రమబద్ధీకరించేందుకు ఎల్‌ఆర్‌ఎస్‌ పథకాన్ని తెచ్చింది. ఈమేరకు గత జూలై 26న ఉత్తర్వులు ఇచ్చింది. స్థలాలు యాజమానులు వాటిని రెగ్యులైజేషన్‌ చేసుకోవడానికి ముందుకొచ్చారు. నవంబరులో గడువు ముగియగా, మరలా గడువు పెంపునకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఈసారి కటాప్‌ డేట్‌ను యజమానులు ఎక్కువ మంది వినియో గించేలా ఇచ్చారు. గతేడాది జూన్‌ నెలాఖరు నాటికి లే–అవుట్‌ ఆయిన స్థలాలు, ప్లాట్లకు అవకాశం ఇచ్చారు. ఈగడువు ఈనెల 23లోగా ప్లాట్లు క్రమబద్ధీకరించుకునే వారికి ఓపెన్‌ స్పేస్‌ చార్జీల్లో ప్రభుత్వం 50 శాతం రాయితీ ప్రకటించింది. ఓపెన్‌ స్పేస్‌ కింద ప్లాట్‌ మొత్తం విలువలో 14 శాతానికి బదులు తాజాగా ఏడుశాతం చెల్లిస్తే సరిపోతుంది. గడువు ముగిసాక ప్లాట్లు క్రమబద్ధీకరించుకోవాలంటే ఓపెన్‌ స్పేస్‌ చార్జీలు 14 శాతం కట్టాల్సిందే. అదీ ఆ రోజు సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో విలువల ఆధారంగా చెల్లించాలి. బెటర్‌మెంట్‌ ఛార్జీలు, ఇతర రుసుములు మొత్తం పైన మళ్లీ అపరాధ రుసుం విధిస్తారు. ఇవన్నీ చెల్లించడానికి సిద్ధమైనా ఆ లే–అవుట్‌లో అప్పటికే కొన్ని ప్లాట్లయినా ఎల్‌ఆర్‌ఎస్‌లో క్రమబద్ధీకరించు కొని ఉండాలి. లేదంటే దాన్ని అనుమతుల్లేని లే–అవుట్‌గా భావించి క్రమబద్ధీకరణకు ఆ స్థలాల్లో గృహ నిర్మాణాలకు పుర, నగరపాలక సంస్థలు అనుమతులు ఇవ్వవు.

చిరునామాల దొరక్క ఇక్కట్లు

కొందరు ప్లాట్ల యజమా నులు చిరునామా తెలుసుకో వడం అధికారులకు కష్టసా ధ్యంగా మారింది. సబ్‌ రిజి స్ర్టార్‌ కార్యాలయాల్లో ప్లాట్ల రిజిస్ర్టేషన్‌ సమమంలో ఇచ్చిన సెల్‌ నెంబరు పనిచేయడం లేదు. తాత్కాలిక చిరునామాల్లో వారు దొరకడం లేదు. దీంతో అక్రమ లే–అవుట్‌లోని అన్ని ప్లాట్ల క్రమబద్ధీకరణ సాధ్యం కావడం లేదు. మరోవైపు ఎల్‌ ఆర్‌ఎస్‌కు వచ్చిన దరఖాస్తుల్లో పూర్తి సమా చారం ఉండడం లేదు. అవసరమైన వివరాలు లేని వాటిని అధికారులు పక్కన పెట్టేసే అవకాశాలు లేకపోలేదు. టౌన్‌ ప్లానింగ్‌శాఖ ఆర్డీ గెడ్డం సుబ్బారావు మాట్లా డుతూ వచ్చిన దరఖాస్తులను త్వరిగతిన పరిష్కరించే దిశగా త్వరలో సమీక్ష సమావేశాలను నిర్వహిస్తామన్నారు.

ఏలూరు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అఽథారిటీ (ఇడా)పరిధిలో పంచాయతీల పరంగా ఏలూరు, పశ్చిమగోదావరిలతో పాటు ఎన్టీఆర్‌ జిల్లాలోని ఐదు మండలాలైన తిరువూరు,గంపలగూడెం, ఏ కొండూరు, రెడ్డిగూడెం, విసన్నపేటల్లో కలిపి మొత్తం 4,789 దరఖాస్తులు అందాయి. గతంలోనే 2వేలకు పైగా దరఖాస్తులు వచ్చి ఉండగా, గడువు పొడిగింపుతో ఈ ప్రభుత్వ హయాంలో మరో 2,789 దరఖాస్తులు అందినట్టు ఇడా ప్లానింగ్‌ అధికారి సుధాకర్‌ ఆంధ్రజ్యోతికి తెలిపారు. మొత్తంగా దరఖాస్తుల ఫీజుల రూపంలో 21.19 కోట్లు ఇడాకు ఆదాయం జమ అయ్యింది.

Updated Date - Jan 22 , 2026 | 11:55 PM