హోరాహోరీగా కబడ్డీ సెమీఫైనల్స్ పోటీలు
ABN , Publish Date - Jan 17 , 2026 | 11:56 PM
పట్టణంలోని రుస్తుంబాద కబడ్డీ స్టేడియంలో నాలుగు రోజులుగా జరుగుతున్న జాతీయస్థాయి స్ర్తీ, పురుషుల కబడ్డీ పోటీలు శనివారం సెమీఫైనల్స్ పోటీలు హోరాహోరీగా సాగాయి.
నేడు ఫైనల్స్.. విజేతలకు రూ.7లక్షలు ప్రైజ్‌మనీ
నరసాపురం టౌన్, జనవరి17(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని రుస్తుంబాద కబడ్డీ స్టేడియంలో నాలుగు రోజులుగా జరుగుతున్న జాతీయస్థాయి స్ర్తీ, పురుషుల కబడ్డీ పోటీలు శనివారం సెమీఫైనల్స్ పోటీలు హోరాహోరీగా సాగాయి. ఇప్పటికే కొన్ని జట్లు సెమీఫైనల్స్‌కు చేరుకున్నాయి. ఆదివారం సాయంత్రం ఫైనల్స్ పోటీలు జరగనున్నాయి. గోగులమ్మ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 31వ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు ఈనెల 14న ప్రారంభమయ్యాయి. స్ర్తీ, పురుషుల విభాగంలో 30 జట్లు తలపడుతున్నాయి. మహిళా విభాగంలో హిమాచల్‌ప్రదేశ్, సీఆర్‌పీఎఫ్, ఢిల్లీ, తమిళనాడు జట్లు, పురుషుల విభాగంలో ఈస్ట్రన్ రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వే, హరియాణా జట్లు ముందంజలో ఉన్నాయి. శనివారం జరిగిన పోటీల్లో జమ్ముకశ్మీర్ జట్టుపై 13 పాయింట్ల తేడీతో ఈస్ట్రన్ రైల్వే జట్టు విజయం సాధించింది. ఎస్‌వీబీపీ ఢిల్లీ జట్టుపై 12 పాయింట్ల తేడాతో సౌత్ సెంట్రల్ రైల్వే జట్టు గెలిచింది. అదివారం జరిగే పైనల్స్‌లో పురుషుల విభాగంలో నాలుగు జట్లు, స్ర్తీ విభాగంలో నాలుగు జట్లు తలపడనున్నాయి. వీటిలో మొదటి నాలుగు స్థానాలను ఎంపిక చేసి రూ.7 లక్షలు ప్రైజ్‌మనీ, షీల్డ్‌లను ఉత్సవ కమిటీ సభ్యులు అందించనున్నారు. ఈ పోటీలను కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, కన్వీనర్ జానకీరామ్, వీరలంకయ్య పర్యవేక్షించారు.